For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ లిప్స్ నివారించే టాప్ 10 అత్యుత్తమ చిట్కాలు

|

సందేహం లేదు, నేచురల్ గా రోజీ లిప్స్ కలిగి ఉండటం మహిళ బ్యూటీకి లేదా పురులుషు అందంగా కనబడుతారు. చాలా మంది డార్క్ లిప్స్ ను కలిగి ఉంటారు. వాటిని లైట్ మార్చుకోవడం ఎలా? లేదా నలుపు పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.

డార్క్ లిప్స్ కు ప్రధాన కారణం ఎక్కువగా సూర్య రశ్మికి గురిఅవ్వడం, లేదా అలెర్జిక్ రియాక్షన్, లేదా తక్కువ నాణ్యత కలిగిన కాస్మొటిక్స్ ఉపయోగించడం, లేదా టుబాకో నమలడం, ఎక్కువగా సిగరెట్స్ త్రాగడం, అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం, మరియు హార్మోనుల అసమతులత్య ఇవి ప్రధాన కారణాలుగా ఉంటాయి.

పురుషుల్లో డార్క్ లిప్స్(పెదాల నలుపు)నివారించే టిప్స్: క్లిక్ చేయండి

ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించకుండానే డార్క్ లిప్స్ ను లైట్ మార్చుకోవడం లేదా, నలుపును నివారించడానికి అనేక మార్గాలు లేదా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డార్క్ లిప్స్ కలిగి ఉన్నవారికి నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మంచి ఫలితాలను పొందడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఫలితాను మీరు చూసే వరకూ వీటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తుండండి. మరి ఆ అత్యుత్తమ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

నల్లిని పెదవులకు లిప్ స్టిక్ ఎంపిక చేసుకోవడం ఎలా?: క్లిక్ చేయండి

నిమ్మ:

నిమ్మ:

నిమ్మ: నిమ్మరసంను తరచుగా ఉపయోగించడం వల్ల స్కిన్ ప్యాచ్ లను మరియు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డార్క్ లిప్స్ నివారించడానికిదీన్ని మీరు ఉపయోగించవచ్చు. నిమ్మరసంలోని బ్లీచింగ్ లక్షణాలు డార్క్ లిప్స్ మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

*అందుకు నిమ్మరసాన్ని నిద్రించే ముందు పెదాల మీద రుద్దాలి. ఈ సింపుల్ రెమెడీని రెండు నెలలు క్రమం తప్పకుండా అనుసరించండి.

*నిమ్మ తొక్క మీద ఉప్పు లేదా షుగర్ చిలకరించి పెదాల మీద రుద్దాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. దాంతో పెదాల మీద కొత్త చర్మం కనబడుతుంది. ఈ రెమెడీని క్రమం తప్పకుండా కొన్ని వారాలు చేయండి.

రోజ్:

రోజ్:

రోజ్: రోస్ లో మూడు ప్రధాణ లక్షణాలు కలిగి ఉన్నాయి. సున్నితంగా, కూలింగ్ గా మరియు మాయిశ్చరైజింగ్ గా మార్చుతాయి. ఇంకా రోజ్ మీ డార్క్ లిప్స్ ను పింక్ కలర్ లోకి మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

*అందుకు ఒక చుక్క రోజ్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి, పెదాలకు అప్లై చేయాలి . ఇలా రోజుకు మూడు, నాలుగు సార్లు చేయాలి.

*గులాబీ రేకులను పేస్ట్ లా చేసి అందులో ఒక చెంచా బట్టర్, తేనె, పాలు వేసి క్రీమ్ లా చేయాలి. దీన్ని పెదాలకు అప్లై చేసి నిధానంగా రుద్దాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ డార్క్ లిప్స్ ను ప్రకాశంతంగా మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది . ఆలివ్ ఆయిల్లో నేచురల్ లిప్స్ కు అవసరం అయ్యే అనేక పోషకాలున్నాయి. ఇది మాయిశ్చరైజింగ్ గా పనిచేసి, పెదాలా సున్నితంగా మరియు బ్యూటిఫుల్ గా మార్చుతుంది.

* ఆలివ్ ఆయిల్ ను కొన్ని చుక్కలు పెదాల మీద వేసి మాసాజ్ చేయాలి. నిద్రించే ముందు ప్రతి రోజూ రెగ్యులర్ గా చేయాలి.

పంచదార:

పంచదార:

పంచదార: మీ పెదాలను రెగ్యులర్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అలా చేయడం వల్ల పెదాలను మరింత నల్లగా మరియు డల్ గా కనబడేలా చేస్తాయి. అందుకు షుగర్ చాలా అద్భుత ఏజెంట్ గా పనిచేస్తుంది.

*పంచదారను మెత్తగా పౌడర్ చేసి అందులో రెండు చెంచాల బట్టర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని పెదాల మీద రుద్దాలి. ఇలా వారానికొకసారి చేసి మీ పెదాలను నేచురల్ గా మరియు షైనింగ్ గా ఉంచుకోవాలి.

బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూట్: రెడీగా అందుబాటులో ఉండే మరో వస్తువు బీట్ రూట్. బీట్ రూట్ పింక్ లిప్స్ ను ఏర్పరిచేందుకు బాగా సహాయపడుతుంది . బీట్ రూట్ లో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది డార్క్ లిప్స్ ను లైట్ చేస్తుంది.

*తాజాగా ఉండే బీట్ రూట్ ముక్కలను పెదాల మీద రుద్దాలి. లేదా బీట్ రూట్ రసాన్ని నిద్రించే ముందు గా అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. బీట్ రూట్ లోని నేచురల్ రెడ్ కలర్ డార్క్ లిప్స్ ను రోజీగా మార్చుతాయి.

 దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ: డార్క్ లిప్స్ ను అందంగా తీర్చిదద్దడంలో మరియు పింక్ గా మార్చడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. పొడిబారిన మరియు తేమకోల్పోయిన పెదాలకు తగినంత తేమను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పింక్ కలర్ ను రిస్టోర్ చేస్తుంది.

*దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా మిల్క్ క్రీమ్ మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి పెదాలకు అప్లై చేసి, కొద్దిసేటి తర్వాత రుద్దాలి. గోరువెచ్చని నీటితోశుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కీరదోస:

కీరదోస:

కీరదోస: కీరదోసకాయ స్కిన్ లైటెన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది మీ పెదాలను మరియు చర్మం మీదా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కీరదోసకాయముక్కను తీసుకొనే పెదాల మీద నిధానంగా రుద్దాలి. ఇలా ప్రతి రోజూ 5నిముషాలు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.

బెర్రీస్ :

బెర్రీస్ :

బెర్రీస్ : బెర్రీస్ అంటే రాస్పెబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి వాటిలో అనేక మినిరల్స్ , విటమిన్స్ ఉంటాయి. ఇవి పెదాలను చాలా ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి.

*అరచెంచా రాస్బ్రెరీ జ్యూస్ లో కొద్దిగా అలొవెరా జెల్ మిరయు తేనె మిక్స్ చేసి, పెదాల మీద అప్లై చేసిన నిదానంగా మసాజ్ చేయాలి. 10నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 4సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె:

తేనె:

తేనె: తేనె ఒక నేచురల్ మాయిశ్చరైజర్ ఇది పెదాలను సున్నితంగా చేస్తుంది మరియు నేచురల్ గా పింక్ కలర్ లోకి మార్చుతుంది.

*ప్రతి రోజూ నిద్రించే ముందు తేనెను మీ పెదాల మీద అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి, తర్వాత ఉదయం శుభ్రం చేసుకోవాలి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా చేసి పెదాలను పింక్ కలర్ లోనికి మార్చుకోవాలి.

బాదాం ఆయిల్:

బాదాం ఆయిల్:

బాదాం ఆయిల్: డార్క్ లిప్స్ కు విరివిగా ఉపయోగించే మరో హోం రెడీ బాదం ఆయిల్. ఇది పెదాలను సున్నితంగా మరియు మాయిశ్చరైజ్ గా చేస్తుంది.

* బాదం నూనెను కొద్దిగా వేసి, అందులో తేనె మిక్స్ చేసి పెదాల మీద అప్లై చేయాలి. కొన్ని రోజుల్లోనే మీ పెదాలు సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మారుతాయి. నేచురల్ పింక్ కలర్ కి మారుతాయి.

English summary

Top 10 Home Remedies for Dark Lips

There are many ways to lighten dark lips that don’t require buying expensive products or treatments. Natural home remedies can effectively lighten your lips. The time it takes for these remedies to work varies, so use them as long as needed to achieve the results you want.
Desktop Bottom Promotion