For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మకాంతి పెంచే బాడీ స్ర్కబ్: వీకెండ్ లో మీరు ట్రై చేయవచ్చు

|

బాడీ స్ర్కబ్బింగ్: శరీరం, చర్మ ఛాయ అందంగా, హైడ్రేషన్ లో మంచి మెరుపుతో ఉండాలన్నా మరియు మన చర్మకాంతిని పెంచే మాయిశ్చరైజ్ అందివ్వాలన్నా చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్, మురికి మరియు ఆయిల్ ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అందుకు బాడీ స్ర్కబ్స్ బాగా సహాయపడుతాయి. చర్మం ఛాయను మెరుగుపరచుకోవడానికి మరియు శరీరం కాంతివంతంగా మెరిపించడంకోసం అవసరం అయ్యే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. అయితే వాట ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఫలితం శాస్వతంగా ఉండదు.

అందుకోసం డబ్బును వృధా చేయడం కంటే అదే స్ర్కబ్బింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఇంట్లోనే తయారుచేసుకుంటే, డబ్బు ఆధా చేయడంతో పాటు, శాస్వత ఫలితాలను ఎఫెక్టివ్ గా పొందవచ్చు. మార్కెట్లో అమ్మే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే హోం మేడ్ బ్యూటీ ఫ్రొడక్ట్స్ ఎప్పుడూ మంచి ఫలితాలను అంధిస్తాయి. అటువంటి ఉత్తమ ఫలితాలను అంధించే కొన్ని హోం మేడ్ బాడీ స్ర్కబ్స్ మీకోసం ఈ వారాంతంలో ప్రయత్నించడానికి కొన్నింటిని ఈ క్రింది విధంగా అంధిస్తున్నాం. వీటితో మీ చర్మంను కాంతివంతంగా, మెరుస్తుండేలా చేసుకోండి..

కాఫీ బాడీ స్ర్కబ్

కాఫీ బాడీ స్ర్కబ్

కాఫీ మిమ్మల్ని నిద్రలేపే ఒక టేస్టీ డ్రింక్ మాత్రమే కాదు, ఇందులో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని అద్భుతంగా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

*కాఫీపౌడర్ అరకప్పు, షుగర్ అరకప్పు, ఒక చెంచా ఆలివ్ ఆయిల్, రెండు చెంచాలా కొబ్బరినూనె, ఒక చెంచా ఉప్పు తీసుకొని బాగా మిక్స్ చేసి శరీరం మొత్తాన్నికి పట్టించి రుద్దాలి. 10నిముషాల తర్వాత స్నానం చేయడం ద్వారా చర్మ కాంతి పెంచుకోవచ్చు.

నిమ్మ మరియు షుగర్ స్ర్కబ్

నిమ్మ మరియు షుగర్ స్ర్కబ్

సూర్య రశ్మిలోని యూవీ కిరణాల వల్ల యూవీ కిరణాల వల్ల మన చర్మం టాన్ కు గురి అవుతుంది. సన్ స్ర్కీన్ లోషన్ అప్లై చేయడం ద్వారా తిరిగా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది కానీ, ఉన్న టానింగ్ ను తొలగించదు. నిమ్మరసంలో చర్మం ఎక్స్ ఫ్లోయేట్ చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో పంచదార మిక్స్ చేసే ఫలితం మరింత ఉత్తమంగా ఉంటాయి.

*పంచదార 5కప్పులు, ఆలివ్ ఆయిల్ 2కప్పులు, నిమ్మరసం 2 కాయలు, తేనె3చెంచాలు వీటిని బాగామిక్స్ చూసి టాన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి . తేనె ఉత్తమ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

పుదీనా మరియు దానిమ్మ

పుదీనా మరియు దానిమ్మ

పుదీన మరియు దానిమ్మ మిశ్రమంతో బాడీ స్ర్కబ్. ఇది బాడీ స్ర్కబ్ గానే కాదు ఇది మంచి తాజా వాసన వస్తుంది. ఇది మీ మనస్సును కూడా తాజాగా ఉంచుతుంది:

* 2కప్పులు పంచదార, 1/4కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా పుదీనా ఆయిల్, దానిమ్మ రసం వీటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి శరీరానికి పట్టించి బాగా రుద్ది 20నిముషాల తర్వతా గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. ఇది మీ చర్మానికి సహాజరంగును అందిస్తుంది.

వెనీలా షుగర్ స్ర్కబ్

వెనీలా షుగర్ స్ర్కబ్

బాడీ స్ర్కబ్ కోసం మీకు స్ట్రాంగ్ గా ఉండే వాసనలు మీకు పట్టకపోతే, అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

*రెండున్నర కప్పు పంచదార, 5టేబుల్ స్పూన్ల వెనీలా ఎక్సాక్ట్ మరియు 1/4బాదం ఆయిల్ తీసుకొని, పంచదార పొడి 3/4కప్పు, అన్నింటిని ఒక కప్పులో మిక్స్ చేసి శరీరానికి పట్టించి బాగా రుద్దుకోవాలి. 10-15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెనీలా -కోకోనట్ బాడీ స్ర్కబ్

వెనీలా -కోకోనట్ బాడీ స్ర్కబ్

ఇది మరో గ్రేట్ బాడీ స్ర్కబ్. ఇది చర్మకాంతిని పెంచడంతో పాటు, చర్మానికి తగినంత తేమను అంధిస్తుంది మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది.

*1/2 కప్పు కొబ్బరి నూనె, 1/2 బ్రౌన్ షుగర్, 1/2టీస్పూన్ వెనీలా, అన్నింటిని బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి శరీరానికి పట్టించి బాగా రుద్ది తర్వాత స్నానం చేసుకుంటే చర్మం నునుపుగా మరియు మెరుస్తూ, ప్రకాశవంతంగా ఉంటుంది.

సిట్రస్ స్ర్కబ్:

సిట్రస్ స్ర్కబ్:

సిట్రస్ స్ర్కబ్ మరో బ్యూటిఫుల్ స్ర్కబ్. దీనితోపాటు కొబ్బరి నూనె మీ శరీరాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అదే సమయంలో చర్మాన్నిఎక్స్ ఫ్లోయేట్ చేసి, టాన్ ను తొలగిస్తుంది.

*1కప్పు సీసాల్ట్, 1/2 పంచదార, 1/2కొబ్బరి నూనె, కొన్ని చుక్కల గ్రేఫ్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్, కొన్ని చుక్కల స్వీట్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, కొన్ని చుక్కల లెమన్ ఆయిల్, అన్నింటిని బాగా మిక్స్ చేసి, బాడీ మొత్తం అప్లై చేసి బాడీ మసాజ్ చేసుకోవాలి 15నిముషాల తర్వాత స్నానం చేసుకోవాలి.

బాదం -ఆరెంజ్ స్ర్కబ్

బాదం -ఆరెంజ్ స్ర్కబ్

బాదం నిజంగా చర్మసౌందర్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా వింటర్ లో మరింత ఆరోగ్యకరం. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఆరెంజ్ ను బాడీ స్ర్కబ్ గా ఉపయోగించడం వల్ల ఇది శరీరానికి తాజా ఫీల్ అందిస్తుంది. మరియు గొప్ప ఎక్స్ ఫ్లోయేట్ గా చేస్తుంది.

*గుప్పెడు బాదం, ఒక ఆరెంజ్ తొక్క, ఒక కప్పు ఆలివ్ ఆయిల్. వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం శరీరానికి అప్లై చేసి బాగా మసాజ్ చేసి 10నిముషాల తర్వాత స్నానం చేసుకోవాలి.

చాక్లెట్ స్ర్కబ్

చాక్లెట్ స్ర్కబ్

చాక్లెట్ అంటేనే చాలా మంది అమితంగా ఇష్టపడుతారు. అందుకే ఇది మీ చర్మ సౌందర్యానికి కూడా అంత మేలు చేస్తుంది . చాక్లెట్ మనస్సును ఉల్లాసపరచడంమాత్రమే కాదు, ఇది చర్మానికి పోషకాలను అంధివ్వడంతో పాటు, మాయిశ్చరైజ్ చేసే లక్షణాలు కూడా అద్భుతంగా కలిగి ఉంది.

* పంచదార ½కప్పు, బ్రౌన్ షుగర్ ½డెూ, కానోలా ఆయిల్ ½కప్పు, కోకో ½కప్పు అన్నింటిని బాగా మిక్స్ చేసి , పేస్ట్ తో మొత్తం శరీరానికి మసాజ్ చేయాలి. చర్మానికి మంచి సువాసనతో పాటు, మంచి చర్మకాంతిని, చర్మానికి తేమను అంధిస్తుంది.

స్వీట్ అండ్ స్పైసీ స్ర్కబ్

స్వీట్ అండ్ స్పైసీ స్ర్కబ్

ఇండియన్ మసాలా దినుసులు స్ర్కబ్బింగ్ గా అద్భుతంగా సహాయపడుతుంది. ఈ మసాలా దినుసులను మీ బాడీ స్ర్కబ్ కోసం తీసుకుంటే ఏమవుతుంది?వంటలు ఘాటైన మసాలా సువానను ఎలా అంధిస్తాయో అలాగే చర్మానికి గొప్పగా ఎక్స్ ఫ్లోయేట్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

* 1కప్పు బ్రౌన్ షుగర్, 1 కప్పు, పంచదార, 3/4కప్పు బాదం లేదా కొబ్బరి నూనె, రెండు చెంచాలా దాల్చిన చెక్కపొడి, 2చెంచా అల్లం, రెండుచెంచాలా నట్ మగ్ అన్నింటిని మిక్సీ జార్ లో వేసి మొత్తగా రుబ్బుకోవాలి. ఇది మీ శరీరానికి స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ ను అందిస్తుంది. 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

విటమిన్ ఇ మరియు క్యాన్ షుగర్ స్ర్కబ్

విటమిన్ ఇ మరియు క్యాన్ షుగర్ స్ర్కబ్

చర్మ సంరణకు విటమిన్ ఇ అద్భుతంగా సహాయపడుతుంది. ఇది వింటర్లో మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . పొడిబారిన చర్మాన్ని నివారిస్తుంది మరియు చర్మం ప్యాచ్ లను నివారిస్తుంది.

* ఒక కప్పు కేన్ షుగర్, 1/3కప్పు ఉప్పు, ½కొబ్బరి నూనె,ఒక చెంచా విటమిన్ ఇ ఆయిల్, కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ వేసి అన్నింటిని మిక్స్ చేసి , ఈ మొత్తం మిశ్రమాన్ని బాడీ స్ర్కబ్ గా ఉపయోగించాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

సీసాల్ట్ స్ర్కబ్

సీసాల్ట్ స్ర్కబ్

ఇది ఒక అద్భుతమైన బాడీ స్ర్కబ్. దీన్ని ఇంటి వద్దే తయారుచేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్ ఫ్లోయేట్ ఏజెంట్ మాత్రమే కాదు, మరియు ఇది ఒక ఉత్తమ డిటాక్సిఫై ఏజెంట్.

* ఒక కప్పు కోర్స్ సీ సాల్ట్, అరకప్పు ఆయిల్(కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ లేదా బాదం)సాల్ట్లో నూనెపోసి, బాగా మిక్స్ చేసి 24గంటలా పాటు అలాగే ఉంచాలి. తర్వాత రోజున బాగా మిక్స్ చేసి తర్వాత బాడీ స్ర్కబ్బింగ్ గా ఉపయోగించాలి.

English summary

Top 11 Homemade Body Scrubs

Body scrubs are the best thing to get rid of dirt, dead cells and oil from your body, yet keeping it hydrated, glowing and moisturized. With the growing inflation, beauty products are not lagging behind and the companies are charging enormous amount for such products.
Desktop Bottom Promotion