For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్వీజింగ్ చేయటం మంచిదా లేదా చెడ్డద?

By Super
|

ట్వీజింగ్ అనేది అదనపు జుట్టు తొలగించడం కోసం సాధారణంగా ఉపయోగించే ఒక టెక్నిక్.సాధారణంగా దీనిని కనుబొమ్మలు,గడ్డం,పై పెదవులు లేదా క్రింది పెదాలు మరియు బుగ్గల నుండి జుట్టును తొలగించడానికి ఉపయోగిస్తారు. ట్వీజింగ్ మూలం నుండి జుట్టును తొలగిస్తుంది. ట్వీజింగ్ అనేది పీకే పద్ధతి. దీనిలో లాభాలు,నష్టాలు రెండు ఉన్నాయి. సాదారణంగా చాలా మంది మంచిదా,చెడ్డదా అనే సందేహంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే దీని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అనేక ఇతర తాత్కాలిక జుట్టు తొలగించే పద్ధతులు ఉన్నాయి. ట్వీజింగ్ లో అనేక అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి.

ఇక్కడ ట్వీజర్స్(పట్టకార్లు)ఉపయోగించి జుట్టు తొలగిస్తే వచ్చే కొన్ని లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. మీ అవాంఛిత జుట్టు తొలగించటం కోసం ట్వీజింగ్ టెక్నిక్ ఉపయోగించే ముందు లాభాలు మరియు నష్టాలు గురించి తెలుసుకోవాలి. ట్వీజింగ్( పట్టకార్లు ఉపయోగించి) చేయటం మంచిదా లేదా చెడ్డదా అనే మీ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు క్రింద ఉన్న లాభ,నష్టాలు సహాయపడతాయి.

Tweezing: Good or Bad?

లాభాలు:

సులభం

మీరు మీ అవాంఛిత వెంట్రుకల తాత్కాలిక తొలగింపు కోసం ఉత్సాహంగా ఉంటే ట్వీజింగ్ సులభమైన ఉత్తమ ఎంపికగా ఉంటుంది. పట్టకార్లను నిపుణులు కాని వారు కూడా ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది. ఈ పట్టకార్లు మహిళల ఇష్టమైన జుట్టు తొలగింపు పద్ధతులలో ఒకటిగా ఉన్నది.

చవకైనది

మీ దగ్గర ఒక పట్టకార్లు ఉంటే,అప్పుడు మీరు చవకగా జుట్టు తొలగింపును చేయవచ్చు.మీరు పట్టకార్లు ఉపయోగించి ట్వీజింగ్ లో నిపుణులు అవ్వండి. మీరు జుట్టు తొలగింపు కోసం బ్యూటి పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ట్వీజింగ్ చేయడానికి మీ ఇల్లును సౌకర్యవంతముగా ఉపయోగించవచ్చు.

తక్కువ నొప్పి

నొప్పి గురించి ఆలోచించినప్పుడు మంచిదా లేక చెడ్డదా అనే ప్రశ్న ఏర్పడుతుంది. ట్వీజింగ్ చేయటం వలన వచ్చే నొప్పి థ్రెడ్డింగ్ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ట్వీజింగ్ లో మీరు మీ సౌలభ్యం ప్రకారం జుట్టు తంతువులను తొలగించుకోవచ్చు.

నైపుణ్యం అవసరం లేదు

మీరు మీ సొంతంగా ట్వీజింగ్ చేయడానికి ఒక బ్యుటి ప్రొఫెషనల్ గా ఉండవలసిన అవసరం లేదు. మీకు టెక్నిక్ ఒకసారి తెలిస్తే చాలు. మీరు మొత్తం పరిపూర్ణతతో సొంతంగా ట్వీజింగ్ చేయవచ్చు. ట్వీజింగ్ అనేది మహిళలకు ఇష్టమైన టెక్నిక్ అని చెప్పవచ్చు.

నష్టాలు:

లోపల పెరిగిన జుట్టు

పట్టకార్లు ఉపయోగించేటప్పుడు దట్టమైన కేశ మూలాలు ఉంటే ట్వీజింగ్ మంచి ఆలోచన కాదు.ఇది చివరికి లోపల పెరిగిన జుట్టుకు దారితీయవచ్చు.అంతేకాకుండా వాపు,మీ చర్మంపై మచ్చ మరియు ఎరుపుకు కారణం కావచ్చు.

చర్మం నొక్కడం

మీరు పట్టకార్లు ఉపయోగించేటప్పుడు ప్రధాన సమస్య చర్మం ప్రమాదవశాత్తు నొక్కడం జరుగుతుంది. ఈ సమస్యకు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమ పరిష్కారం.మీకు ఈ టెక్నిక్ తెలిసినప్పుడు ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు.

సమయం

ఇతర జుట్టు తొలగించే పద్ధతులతో పోల్చినపుడు,ట్వీజింగ్ లో కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. ట్వీజింగ్ కు అవసరం అయ్యే సమయం జుట్టు పెరుగుదల ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. ట్వీజింగ్ తాత్కాలిక జుట్టు తొలగించే టెక్నిక్ అయినందున,ఈ విధానాన్ని మరల ఎప్పుడు చేయాలో అనేది మీ జుట్టు పెరుగుదల రేటు మీద ఆధారపడి ఉంటుంది.

కష్టంతో కూడుకున్నది

మీరు ఎక్కువ ప్రాంతంలో అనవసరమైన జుట్టును తొలగించే ప్రణాళిక ఉంటే,అప్పుడు మీకు చాలా కష్టంతో కూడుకున్నా పనిగా ఉంటుంది. ట్వీజింగ్ ఎక్కువ సంఖ్యలో ఉన్న వెంట్రుకలను తొలగించడానికి ఉపయోగపడదు. ఇది మీ వైపు నుండి మరింత సహనంను డిమాండ్ చేస్తుంది.

English summary

Tweezing: Good or Bad?

Tweezing is a technique that is used commonly for removing excess hair. It is generally used to remove hair from eyebrows, chin, upper lips or lower lips and cheeks. Tweezing will remove hair from the root itself.
Desktop Bottom Promotion