For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాక్సింగ్ బొప్పులను నివారించేందుకు మార్గాలు

By Lakshmi Perumalla
|

నేడు మహిళలు జుట్టు తొలగింపు కొరకు ఒక ఎంపికగా వాక్సింగ్ ను ఇష్టపడుతున్నారు. శరీరంలో వృద్ది చెందుతున్న అనవసరమైన జుట్టును తొలగించడానికి సులభమయిన మార్గాలలో ఇది ఒకటి. కానీ దీని వలన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎక్కువ మంది మహిళలలో మొటిమలు లేదా వాక్సింగ్ బొప్పులు అనుభవంలోకి వస్తాయి. ఈ వాక్సింగ్ బొప్పులు అత్యధిక సార్లు నొప్పిలేకుండా ఉంటాయి. కానీ కొన్నిసార్లు బాధాకరముగా మరియు సమస్యాత్మకముగా పరిణమించవచ్చు. వాక్సింగ్ బొప్పులకు వివిధ కారణాలు కనిపిస్తాయి. మీ చర్మంనకు కొన్నిసార్లు వాక్సింగ్ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు ప్రతికూలం కావొచ్చు. ఉష్ణోగ్రత లేదా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

లేకపోతే,మీకు వాక్సింగ్ బొప్పులు నివారణ కొరకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Ways To Avoid Waxing Bumps

1. మృదువైన వాష్

మీరు వాక్సింగ్ బొప్పుల చికిత్స కోసం శోధిస్తూ ఉంటే,అప్పుడు మీరు ఒక వాక్సింగ్ సెషన్ తర్వాత ఒక కఠినమైన స్క్రబ్ ను నివారించవలసిన అవసరం ఉంది. మీరు కేవలం వాక్స్ ప్రాంతంను మృదువుగా మరియు శాంతముగా కడగాలని గుర్తుంచుకోవాలి. ఇది వాక్సింగ్ బొప్పుల నివారణలో ఒకటిగా ఉంది. ఒక సరళమైన ఈ చిట్కాను ఎల్లప్పుడూ అనుసరించండి.

2. కాటన్ మేజిక్

వాక్సింగ్ బొప్పులు చికిత్స కోసం ఎదురుచూస్తున్న సమయంలో మీరు చేయవలసిన తదుపరి విషయంగా కాటన్ బట్టలను ఉపయోగించాలి. కాటన్ బట్టలతో వాక్స్ ప్రాంతంను కవర్ చేయాలి. మీ చర్మం మీద పేరుకున్న మురికిని నివారించండి.ఇది వాక్సింగ్ బొప్పుల నివారణలో ఒకటిగా ఉంది.

3. ఆ ప్రదేశంను వాచ్ చేయండి

వాక్సింగ్ బొప్పులకు చికిత్స ఎలా చేయాలో పాఠం నేర్చుకోండి. ఆ ప్రదేశంను వాచ్ చేయండి. ఒక వాక్సింగ్ సెషన్ తర్వాత మీరు వేడి సమీపంలోకి వెళ్ళకుండా ఒక సౌకర్యవంతమైన స్థానంలో ఉండడం ఉత్తమం. పొయ్యి దగ్గరకు వెళ్ళకూడదు. ఎందుకంటే పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది.

4. నాన్ - ప్రిస్క్రిప్షన్ మందులు

నాన్ ప్రిస్క్రిప్షన్ మందులు వాక్సింగ్ బొప్పుల నివారణలో ఒకటిగా ఉన్నాయి. వాక్సింగ్ బొప్పుల నొప్పి నయం చేయడానికి నాన్-ప్రిస్క్రిప్షన్ మందులను ఉపయోగించండి. వాక్సింగ్ బొప్పుల నివారణ చికిత్స ఎలా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ కేవలం ఇది ఒక ప్రయోజనం మాత్రమే.

5. హైడ్రేట్

మీరు నిజంగా వాక్సింగ్ బొప్పుల చికిత్స మార్గాల గురించి ఆలోచిస్తూ ఉంటే,అప్పుడు మీ చర్మంను హైడ్రేట్ గా ఉంచుకోవటం అనేది ఉత్తమ మార్గం. ఒక వాక్సింగ్ సెషన్ తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్ రాయాలి. ఇది వాక్సింగ్ బొప్పులను తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

6. పోస్ట్ వాక్స్ ఉత్పత్తులు

వాక్సింగ్ బొప్పుల చికిత్సలో ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే పోస్ట్ వాక్స్ ఉత్పత్తులు అని చెప్పవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో అనేక రకాల పోస్ట్ వాక్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా అన్నింటిలో కన్నా ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. అయినప్పటికీ,ఉత్పత్తులు ఎంచుకోవడంలో సలహా తీసుకోవాలి.

7. వాక్సింగ్ బొప్పుల గురించి చెప్పండి

వాక్సింగ్ బొప్పుల చికిత్స చిట్కాలలో ఇది చాలా ముఖ్యమైనది. మీరు తదుపరి వాక్సింగ్ సెషన్ కి వెళ్ళినప్పుడు వాక్సర్ కి మీ సమస్యను తెలియజేయండి. వాక్సింగ్ బొప్పుల గురించి చెప్పండి.వాక్స్ చాలా వేడిగా ఉంటే చూడండి. మీ చర్మంనకు వేరే ఫార్ములా ప్రయత్నించమని మీ వాక్సర్ కి చెప్పండి. మీ చర్మం సున్నితంగా ఉండుట వలన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాక్సింగ్ బొప్పులను వదిలించుకోవటానికి వాటి గురించి చెప్పాలి.

English summary

Ways To Avoid Waxing Bumps

Women, today, prefer waxing as a choice of hair removal. While waxing is one of the easiest ways to remove unwanted hair in the body, there is also a small problems that comes clinging to it.
Desktop Bottom Promotion