For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సన్ టాన్ వేసవిలో చేతులు నల్లబడుతుంటే: చిట్కాలు

|

వేసవికాలంలో చర్మం నల్లబడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలంలో చర్మ సమస్యల్లో సన్ టాన్ అనేది ఒక పెద్ద చర్మ సమస్య. సన్ టాన్ మన శరీరంలో ఏ భాగాలకైనా తాకవచ్చు. బయటకు బహిర్గితం అయ్యే ముఖం, కాళ్ళు, చేతులు ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖం తర్వాత డైరెక్ట్ గా సూర్య రశ్మికి ఎక్స్ పోజ్ అయ్యేది చేతులే, ఫలితంగా సూర్యరశ్మి నేరుగా చేతుల మీద పడి, చేతులు నల్లగా మారుతాయి. అందుకే వేసవికాలంలో చేతుల మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం.

సన్ టాన్ ను నివారించుకోవడానికి మార్కెట్లో వివిధ రకాలా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. కానీ, అవన్నీ కూడా రసాయనాలతో తయారుచేయడం వల్ల చేతలకు మరింత హాని కలిగిస్తాయి. ఆ ఉత్పత్తులను చేతులకు అప్లై చేసి, వెంటనే ఎండలోకి వెలితే వ్యతిరేక ఫలితాలను చూపెడుతాయి. చాలా వరకూ ఈ కమర్షియనల్ ప్రొడక్ట్స్ చేతులకు హానికరమైన బ్లీచ్ గా పనిచేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మానికి నేచురల్ మరియు సురక్షిత పద్దతులను అనుసరించి సన్ టాన్ ను నివారించుకోవడం ఒక ఉత్తమ ఎంపిక.

కొన్ని హోం మేడ్ రెమడీస్ ను ఉపయోగించి, ఎఫెక్టివ్ గా సన్ టాన్ ను నివారించుకోవడం అంత కష్టమైన పని కాదు.

అందువల్ల ఈ క్రింది కొన్ని ప్రభావవంతమైన పద్దతులను మీకోసం అంధిస్తున్నాం...

నిమ్మరసం

నిమ్మరసం

సన్ టాన్ నివారించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి, చాలా మంది బ్యూటీ ఎక్స్ పర్ట్స్ నిమ్మరసంను అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో వినియోగిస్తున్నారు. కాబట్టి, నిమ్మరసాన్ని నేరుగా చర్మానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చేతులకు చాలా ప్రభావంతమైన సన్ టాన్ రిమూవల్. తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవడం వల్ల మీ చర్మం డ్రైగా మార్చదు.

పెరుగు

పెరుగు

సన్ టాన్ నివారించడానికి పెరుగు అద్భుతంగా సహాయపడుతుంది. చేతులకు పెరుగును మర్ధన చేసి 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. సన్ టాన్ స్కిన్ సమస్యలకు ఇది ఒక అద్భుత పరిష్కారమార్గం. పొడి చర్మం కలవారికి నిమ్మరసంతో పోల్చితే పెరుగు చాలా మంచి ఎంపిక.

టమోటో జ్యూస్

టమోటో జ్యూస్

చేతుల మీద సన్ టాన్ నివారించడానికి టమోటో కూడా ఒక ఫర్ ఫెక్ట్ చాయిస్ . టమోటో రసాన్ని చేతులకు అప్లై చేసి 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చేతులు నల్లబడటాన్ని నివారిస్తుంది.

పసుపు మరియు నిమ్మరసం

పసుపు మరియు నిమ్మరసం

సన్ టాన్ నివారించడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా పసుపు తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ ను చేతులకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ుంటుంది. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చిబంగాళదుంప

పచ్చిబంగాళదుంప

బంగాళదుంపలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మంను తేలికపరచడానికి బాగా సహాయపడుతుంది. నల్ల బడ్డ చర్మం తిరిగి తెల్లగా మార్చడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది తాజాగా బంగాళ దుంపను కట్ చేసి చేతులకు మర్దన చేయాలి. కొద్ది సేటి తర్వాత తిరిగి అలాగే చేయాలి. ఇది తక్షణ ఫలితం ఇవ్వకపోయినా ఎఫెక్టివ్ గా నిధానంగా ఫలితాన్ని అందిస్తుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Ways To Remove Sun Tan From Hands

We are extra keen and careful about our skin when it is summer. Among the summer skin problems, sun tan is in the prime position. Sun tan occurs in any part of your body that is exposed to direct sunlight. Hands are generally overlooked while we give more importance to face. But, remember that your hands are also exposed to direct sunlight while you are outdoors. This will result in sun tan on hands, which demands special care.
Story first published: Wednesday, April 23, 2014, 16:08 [IST]
Desktop Bottom Promotion