For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో మొటిమలు మీ ఆరోగ్యం గురించి ఏం చెప్తోంది ?

By Super
|

ఒక చక్కటి ఆదివారం, వాతావరణం హాయిగా వుంది, డేట్ కోసం బయటకు వెళ్ళడానికి మంచి బట్టలు వేసుకున్నారు – హటాత్తుగా మీ ముఖం మీద ఒక పొక్కు గమనించారు. ఏదోలా హడావిడిగా మేకప్ తో చక్కబెట్టేయవచ్చు గానీ, దాన్ని సమీక్షించి అసలు ఏం పొరపాటు జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం. నుదిటి మీద చేయి కొట్టుకునే వాళ్ళలో మీరు ఒకరా? లేదా భయంకరమైన మొటిమలతో మీరు బాధపడుతున్నారా ?

మీ ముఖం పైని ప్రతి మచ్చా మీ శరీరం లోని ఒక నిర్దిష్టమైన భాగానికి, ప్రక్రియలకు అనుసంధానం అయి వుంటుంది, కనుక ఒక చోట ఒక పొక్కు వచ్చిందంటే శరీరంలో ఇంకెక్కడో సమస్య ఉందన్నమాట. మీ మొటిమ మీ ఆరోగ్యం గురించి చెప్తున్న సంగతులివిగో :

మొటిమలకు చికిత్స – మీ మొటిమ మీ గురించి ఏమి చెప్తోంది ?

మీ నుదిటి మీద మొటిమ = ఉదర సమస్యలు

నుదిటి మీద వచ్చే పొక్కులు నేరుగా మీ ఉదరానికి, ఆహార వినియోగానికి సంబంధం కలిగి వుంటాయి. జంక్ ఫుడ్ మానేయండి, చక్కర ఎక్కువగా తీసుకోకండి, ఎక్కువగా నీటిని తాగండి – ఎందుకంటే ఇది కడుపుకు ఇన్ఫెక్షన్ లాంటి పెద్ద సమస్య కూడా కావచ్చు.

కనుబొమల మధ్య మొటిమ – అధికంగా శ్రమిస్తున్న కాలేయం

అవును, మీ కనుబొమల మధ్య వచ్చే ఆ చిన్న మొటిమ మీ కాలేయం అధిక బరువు లాగుతోందని గుర్తు చేస్తోంది. అందువల్ల ఇక మద్యం, మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలి. రాత్రి పూట చిరు తిళ్ళు తగ్గించుకోండి, కంటి నిండా నిద్ర పొండి. వారానికి ఒకసారి మీ శరీరాన్ని ఉత్సాహ పరిచేందుకు సాత్వికాహారం తీసుకోండి. శుభ్రం చేసుకోవడం, పచ్చటి ఆహారం తీసుకోవడం కొత్తగా మొదలు పెట్టె వారికి మంచిది.

What Does Your Pimple Say About Your Health

మీ కంటి చుట్టూ, నొసల దగ్గరా వచ్చే మొటిమలు = అస్థిమితంగా వుండే మూత్రకోశం.

మీ నొసల చుట్టూ, కనులు, కనుబొమల ప్రాంతాల్లో మొటిమలుంటే అవి మీ మూత్రకోశం పిలుస్తోందని గుర్తు, అందువల్ల మీ శరీరాన్ని ఎక్కువగా నీటితో నింపండి. ఒక నీటి సీసా అందుబాటులో ఉంచుకుని, ఖర్బూజా, పుచ్చకాయ లాంటి నీటి శాతం ఎక్కువున్న పళ్ళు తినండి. మీ మొటిమల చుట్టూ నల్లటి వలయాలుంటే అది ఖచ్చితంగా డీ హైడ్రేషన్ అని గుర్తు.

ముక్కు మీద మొటిమ = గుండె సమస్య

మీ ముక్కు మీద మొటిమ వుంటే మీరు ప్రేమలో పడినట్టు కాదు – కానీ అది మీ గుండెకు సంబంధించిన విషయమే. మీ రక్తపోటు ఎక్కువైనా లేక తగ్గిపోయినా, మీకు విటమిన్ బి లోపం వున్నా, మీ ముక్కు ఆ సంకేతాలు చూపిస్తుంది. కనుక కాస్త తాజా గాలి ఆస్వాదించండి, వ్యాయామం చేయండి, విటమిన్ బి సప్లిమెంట్ లు తీసుకుని ఆ మొటిమలు తగ్గించుకోండి.

బుగ్గ మీద మొటిమ – శ్వాసకు సంబంధించిన సమస్యలు.

మీరు పొగ తాగే వారైనా లేక మీకు శ్వాసకోస సమస్యలున్నా, మీ బుగ్గల మీద ఒకటి రెండు మొటిమలు వుంటాయి. మీ ధూమపానం తగ్గించుకోండి, ఉదయాన్నే వ్యాయామం చేయండి – మీ గుండెలను ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే (దోస, పుచ్చ లాంటి పళ్ళ రసాల వంటి) చలువ చేసే ఆహార పానీయాలు మీ ఆహారానికి జోడించి శరీరం నుంచి అధిక ఉష్ణం దూరం చేసుకోండి.

గడ్డం మీద మొటిమ = హార్మోన్ల అసమతౌల్యత

పీ ఎం ఎస్ – అనే మూడు అక్షరాలూ మీ శరీరాన్ని బాగా ఇబ్బంది పెట్టగలవు. కానీ రుతుక్రమం తరువాత కూడా మీకు అస్తమాను మొటిమలు వస్తుంటే మీకు హార్మోన్ల అసమతౌల్యం ఉన్నట్టే. మీ అందమైన చర్మాన్ని తిరిగి పొందడానికి మీ గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళండి.

English summary

What Does Your Pimple Say About Your Health?

it is a fine Sunday morning, the weather is great, you have the perfect outfit picked out for your date and suddenly – you spot a giant zit on your face! While a quick-fix with makeup is always possible, it is important to review and introspect what went wrong.
Desktop Bottom Promotion