For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాగా పొడిబారిన పెదాలకు నేచురల్ గా తేమను అందించే మార్గాలు

|

సీజన్ బట్టి, చర్మంలో మార్పులు సహజం. అయితే వింటర్ సీజన్ లో మాత్రం చర్మ పగుళ్ళు మరింత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చాలా త్వరగా పగుళ్ళు ఏర్పడుతాయి. ఈ పగుళ్ళను గమనించి వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే, పెదాల మీద నుండి రక్తస్రావం అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి. పగిలి పెదాలను నివారించుకోవడం కోసం boldysky.com మీకోసం కొన్ని సులభ చిట్కిలను అందిస్తోంది. ఈ చిట్కాలను రెగ్యులర్ గా ఉపయోగించినట్లైతే పెదాలు సాఫ్ట్ గా మరియు తేమగా ఉంటాయి.

పెదాలకు తగినంత తేమను అందివ్వడం కోసం కొన్ని నేచురల్ పదార్థాలు సహాయపడుతాయి. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . అయితే, మార్కెట్లో వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మన చర్మ సంరక్షణ కోసం నేచురల్ పదార్థాలు, అందులోనూ మన వంటగదిలో నిరంతరం అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరియు ఇవి సురక్షితమైనవి. మార్కెట్లోలోని కాస్మోటిక్ ప్రొడక్ట్స్ తక్షణ ప్రభావం చూపిని, నిధానంగా పెదాలను నల్లగా మార్చుతాయి.

సూచన: ఈ చిట్కాలను ఉపయోగించే వారు ప్యాచ్ టెస్ట్ ను ట్రై చేసి తర్వాత నేరుగా పెదాల మీద అప్లై చేయవచ్చు . నల్లని పెదాలను కలిగిన వారు కూడా ఈ చిట్కాలను నిరభ్యంతరంగా ఉపయోగించచ్చు . ముఖ్యంగా ఈ చిట్కాలను ఉపయోగించే వారు, పెదాలను తరచూ నాలుకతో తడపకుండా ఉండాలి. ఇంకా మాయిశ్చరైజర్స్ కాకుండా రెగ్యులర్ లిప్ బామ్ ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

డ్రైలిప్స్ ను నివారించే హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం:

1. కీరదోసకాయ:

1. కీరదోసకాయ:

కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి, చల్లటి నీటిలో స్టోర్ చేయాలి. 15నిముషాల తర్వాత, ఈ స్లైస్ ను తీసుకొని పెదాల మీద మర్ధన చేయాలి . పెదాలకు నేచురల్ గా తేనెమను అందివ్వడానికి ఇది ఒక వేగవంతమైన మార్గం.

2. బట్టర్:

2. బట్టర్:

పగిలిన మరియు రక్తస్రావం అయ్యే పెదాలను నివారించడంలో బట్టర్ ఒక కామన్ హోం రెమెడీ. బట్టర్ లో ఉండే ప్రోటీన్స్ పెదాలకు తగినంత హైడ్రేషన్ అందిస్తుంది.

3. బాదం ఆయిల్:

3. బాదం ఆయిల్:

బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. కాబట్టి, పగిలిన పెదాలకు చాలా త్వరగా ట్రీట్ చేస్తుంది . స్పూన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, పెదాలకు హాట్ ఆయిల్ మసాజ్ ఇవ్వాలి.

4. పంచదార మరియు తేనె:

4. పంచదార మరియు తేనె:

పంచదార మరియు తేనె మిశ్రమంను పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది పెదాలకు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. డ్రైలిప్స్ నివారిస్తుంది.

5. జ్యూసీ లిప్ మాక్స్:

5. జ్యూసీ లిప్ మాక్స్:

పగిలిన పెదాలకు లిప్ మాస్క్ ఎప్పుడైనా ట్రై చేశారు . మీ పెదాలు డ్రైగా మారినప్పుడు పెదాలకు మీకు నచ్చిన పండుతో లిప్ మాస్క్ వేసుకోవాలి . పండ్లలో ఉండే విటమిన్స్ పెదాలను సాఫ్ట్ గా మార్చడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

6. కలబంద:

6. కలబంద:

డ్రై లిప్స్ ను నివారించడంలో కలబంద గ్రేట్ గా సహాయపడుతుంది. తాజాగా ఉండే అలోవెరా జెల్ ను పెదాలకు లిప్ బామ్ గా అప్లై చేయాలి.

7. సిట్రస్ పీల్ మాస్క్:

7. సిట్రస్ పీల్ మాస్క్:

సిట్రస్ పండ్లు, ఆరెంజ్ మరియు నిమ్మ వంటి సిట్రస్ పండ్ల యొక్క తొక్కను పొడి చేసి పెదాలకు మాస్క్ లా వేసుకొంటే, మంచి ఫలితం ఉంటుంది.

8. కొబ్బరి నూనె:

8. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ . కొద్దిగా నూనెను స్పూన్ లో వేసుకొని వేడి చేసి, పెదాల మీద హాట్ ఆయిల్ మసాజ్ చేయలి. ఈ చిట్కాలను రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

9. ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం:

9. ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం:

ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం రెండు మిక్స్ చేసి పగిలిన పెదాల మీద అప్లై చేయాలి. ఈ మిశ్రమం డార్క్ లిప్స్ ను నివారిస్తుంది. పెదాలకు తేమను అందివ్వడంలో ఇది ఒక ఉత్తమ పద్దతి.

10. అరటి పండ్లు:

10. అరటి పండ్లు:

బాగా పండిన అరటిపండ్లు జ్యూస్ లేదా పేస్ట్ చేసి పగిలిన పెదాల మీద అప్లై చేయాలి. ఇందులో ఉండే ప్రోటీనులు పెదాలకు నేచురల్ గానే తేమను అందిస్తుంది.

English summary

10 Quick Ways To Naturally Hydrate Dry Lips

Usually in Winter the lips get chapped and dry. They also begin to bleed if you do not look after them in time. To hydrate your lips there are certain tips you need to follow. Boldsky shares with you a list of easy tips to hydrate your lips so that they are soft and supple the whole year round.
Story first published: Friday, February 13, 2015, 11:40 [IST]
Desktop Bottom Promotion