For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీద సున్నితమైన చర్మమా..?ఐతే ఈ స్ర్కబ్స్ ను ఉపయోగించండి..

|

మీది సెన్సిటివ్ స్కిన్నా..మరి అయితే మీరు మీ చర్మాన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ తెలిపిన కొన్ని హోం మేడ్ బాడీ స్ర్కబ్ సింపుల్ టిప్స్ ను ఈ వర్షాకాల సీజన్ లో మీరు ప్రయత్నించిం చూడండి.

సాధారణంగా ఈ రైనీ సీజన్ లో డ్రై స్కిన్ తో సమస్య కాదు, అయితే డ్రై స్కిన్ ఉన్నా లేకపోయినా చర్మ సంరక్షణ కొరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

READ MORE: ఇంట్లోనే తయారుచేసుకొనే 11 నేచురల్ బాడీ స్క్రబ్స్

ఈ సెన్సిటివ్ బాడీ స్ర్కబ్స్ ను తేనె, ఉప్పు, పంచదార మరియు నిమ్మరసం వంటి నేచురల్ పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. మీ రెగ్యులర్ స్ర్కబ్స్ లో ఈ పదార్థాలను జోడించినప్పుడు ఇది డ్రై ఫ్లాకీ స్కిన్ ను నివారిస్తుంది మరియు చర్మం యొక్క స్ట్రక్చర్ మరియు స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

ఈ ఎఫెక్టివ్ అండ్ నేచురల్ బాడీ స్ర్కబ్స్ ను మీరు స్నానానికి వెళ్ళే ముందే శరీరాన్ని స్ర్కబ్ చేసి తర్వాత స్నానం చేస్తే చర్మంలో కొత్త మెరుపులు సంతరించుకుంటాయి. ఇది చర్మం యొక్క స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది మరియు ఇది మిమ్మల్ని ఫ్రెష్ గా మరియు వండర్ఫుల్ గా ఉండేందుకు సహాయపడుతుంది . ఈ ఎఫెక్టివ్ మరియు నేచురల్ బాడీ స్ర్కబ్స్ ను వారానికొకసారి ఉపయోగించడం అలవాటుగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

READ MORE: చర్మఛాయను కాంతివంత చేసే టాప్ 10 బాడీ స్ర్కబ్స్

సన్ టాన్, శరీరంలో మచ్చలు, అవాంఛిత రోమాలు తొలగించడం మరియు చర్మం యొక్క క్వాలిటిని మెరుగుపరుస్తుంది. మరియు ఇంకెదుకు ఆలస్యం...అవేంటో తెలుసుకుందాం...

మెలోన్ స్ర్కబ్:

మెలోన్ స్ర్కబ్:

మెలోన్ ఫ్రూట్స్(వాటర్ మెలోన్, మస్క్ మెలోన్) వంటి ఫ్రూట్స్ చాలా అద్భుతమైన వాసన కలిగి ఉంటాయి. వీటిలో ఏదోకదాన్ని తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత అందులో అరకప్పు పాలు పోసి బాగా మిక్స్ చేసి శరీరం మొత్తం అప్లై చేసి స్ర్కబ్బర్ లా ఉపయోగించాలి . ఇది డ్రై అయినప్పుడు మీ శరీరంను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేప స్ర్కబ్బింగ్:

వేప స్ర్కబ్బింగ్:

వేపఆకు ముఖంలో మచ్చలు మరియు మొటిమలను నివారిస్తుంది. వేపాకును పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి శరీరానికి మర్దన చేయాలి. 20నిముషాల తర్వాత స్నానం చేసుకుంటే వీపులో ఎలాంటి మచ్చలు మరియు స్కార్స్ అనేటి ఉండవు.

ఓట్స్ స్ర్కబ్:

ఓట్స్ స్ర్కబ్:

ఓట్స్ సెన్సిటివ్ స్కిన్ కు ఒక ఎఫెక్టివ్ బాడీ స్ర్కబ్ . ఈ ఓట్స్ స్క్రబ్ చర్మం మీద ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది . మరియు ఇది స్కిన్ కాంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది.

సాల్ట్ స్ర్కబ్:

సాల్ట్ స్ర్కబ్:

ఇది మీ శరీరంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది ముఖ్యంగా పదాలు తడిచేసి, సాల్ట్ చిలకరించి స్ర్కబ్ చేయాలి . సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది మరియు బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది.

కాపీ స్ర్కబ్:

కాపీ స్ర్కబ్:

కాఫీ స్క్రబ్ కూడా చాలా ఎఫెక్టివ్ బాడీ స్ర్కబ్. ముఖ్యంగా సెన్షిటివ్ స్కిన్ కలవారికి కాఫీ స్ర్కబ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాఫీ పౌడ్ లో కొద్ది నిమ్మరసం మిక్స్ చేసి శరీరానికి స్క్రబ్బింగ్ చేయాలి. ఇది సన్ టాన్ నివారిస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరుస్తుంది.

పసుపుతో స్క్రబ్:

పసుపుతో స్క్రబ్:

ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు మూడు చెంచాలా పసుపు ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను శరీరానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మంలోని ముడుతలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

English summary

6 Body Scrubs For Sensitive Skin: Beauty Benefits in Telugu

These sensitive body scrubs are made along with natural ingredients like honey, salt, sugar and lemon juice. When these ingredients are added to the scrubs it not only helps to remove dry flaky skin but also improves the texture and complexion on your body.
Story first published: Tuesday, June 23, 2015, 11:23 [IST]
Desktop Bottom Promotion