For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్ళ సమస్యలకు 7 సులభ మార్గాలు

|

శరీరంలో ముఖం తర్వాత అందరూ గమనించేది చేతులు. తర్వాత చేతివేళ్ళు, గోళ్ళు. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవ్వడమే కాకుండా గోళ్ళు కట్ అయిపోతుంటాయి. అటువంటి గోళ్ళు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా ‘మెనిక్యూర్' చేయాలి. ప్రతిరోజూ చేతి, కాలి వేళ్లమీద పేరుకునే మృత కణాలను తొలగిస్తుండాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరినూనెతో మునివేళ్లను మర్దనా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

గోళ్లపై మచ్చలు, గుంటలు, పగుళ్లు, గోరు చుట్టూ చీము పుట్టడం.. లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్‌, ఎగ్జిమా మొదలైన చర్మ వ్యాధులతో పాటు ఫంగస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల అందమైన గోళ్లు పాడవుతుంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయటం వల్ల గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్‌ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్లు నానడం, కడిగిన గిన్నెలనే పదే పదే కడగటం చేసే స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ.

గోరింటాకు

గోరింటాకు

మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకొని గోళ్లకు రాత్రి పూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని తెల్లగుడ్డను చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీని వల్ల ఫంగస్‌ ఏర్పడిన పిప్పి గోళ్లు, పగుళ్లు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.

బంగాళదుంప

బంగాళదుంప

పై పొరను తీసిన బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి ఉదయాన్నే కడగాలి. ఇలా చేస్తే ఫంగస్‌ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.

పసుపు

పసుపు

కొద్దిగా పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి ముద్దగా చేసి వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి రాత్రి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

నిమ్మరసం

నిమ్మరసం

రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొద్దిసేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు రావు. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా ఉంటుంది.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం

పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.

దోసకాయ

దోసకాయ

కూరల్లో వాడుకునే దోసకాయ ముక్కల్ని తరచుగా తింటుంటే పిప్పి గోళ్లు, గోళ్ల పగుళ్లు, మచ్చలు తగ్గిపోతాయి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

స్వచ్చమైన ఆలివ్ నూనె గోళ్ళ సంరక్షణ తో సహా చాలా సౌందర్య సూత్రాలకు సంప్రదాయంగా గృహ చికిత్సలో భాగంగా వాడబడుతోంది. మీ చేతి లేదా కాలి వేళ్ళ గోళ్ళు అందంగా ఉండాలన్నా, మేర్వాలన్నా వాటి మీద రోజూ ఆలివ్ నూనె రాస్తూ వుంటే చాలా గుణం కనబడుతుంది.

English summary

7 Easy Ways To Maintain Healthy Nails: Beauty tips in Telugu

Nails give us a better idea of what is going on inside. This will act as a window for the overall well-being of a person. Science also support this fact and there are many studies related to the topic. Normal nails are rose in colour. Red nails, pale nails, yellow nails, black nails or nails with white marks!!All these indicates abnormal health conditions.
Story first published: Saturday, September 26, 2015, 14:40 [IST]
Desktop Bottom Promotion