For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో ఇబ్బంది పెట్టే నోస్ హెయిర్ తొలగించడానికి 7 సులభ మార్గాలు

By Super
|

ముక్కులో ఉన్న వెంట్రుకలు మన ముక్కులో ప్రవేశించే దుమ్మూ ధూళి ని ఒడిసిపట్టి వ్యాధి నిరోధకం గా పనిచేసినా ఒక్కోసారి మగవారికి ఈ వెంట్రుకలు చాలా ఇబ్బందికరం గా పరిణమిస్తాయి. గరుకుగా ఉన్న వెంట్రుకలు ముక్కు లో నుండి బయటకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పరచవచ్చు. మగవారు పలు రకాలుగా ఈ వెంట్రుకలు కత్తిరించుకోవడానికి ప్రయత్నిస్తారు.

వీటిని రకాలుగా మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా వదిలించుకోవచ్చు.ముక్కులో చెవిలో మొలిచే వెంట్రుకలు జన్యుపరం గా వచ్చి జీవితాంతం ఉంటాయి. వీ సరైన విధం గా ట్రిం(పొట్టిగా కత్తిరించడం) చెయ్యడమే సులభమైన విధానం.

ముక్కులో ఇబ్బంది పెడుతున్న వెంట్రుకలని వదిలించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెప్తారు. కానీ ముక్కు చాలా సున్నితమయిన శరీర భాగం కాబట్టి ముక్కులో ఉన్న వెంట్రుకలని కత్తిరించేటప్పుడు చాలా జాగ్రత్త గా ఉండాలి.ఒక్కోసారి ముక్కులో ఇన్ ఫెక్షన్ వచ్చి రక్తస్రావం కూడా జరగవచ్చు.

అందం గా గ్లామరస్ గా కనిపించాలనుకునే మగవారు తమ ముక్కులో పెరిగే వెంట్రుకలని ని తొలగించుకోవాలనుకుంటారు.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ రోమాలని ని తొలగించుకునే 7 ఉత్తమ మార్గాలివిగో

ట్రిమ్మర్

ట్రిమ్మర్

హెయిర్ ట్రిమ్మర్ వాడి ముక్కులో పెరిగే వెంట్రుకలను తొలగించవచ్చు.మార్కెట్టులో ప్రస్తుతం అనేక రకాల ట్రిమ్మర్లు లభ్యమవుతున్నాయి.బ్యాటరీలు లేని ట్రిమ్మర్ ఉపయోగించి జాగ్రత్త గా ముక్కులో జుట్టు ని ట్రిం చేయవచ్చు.ట్రిమ్మర్ వాడి అవాచిత రోమాలని తొలగించుకుని అందం గా మరియూ ఆరోగ్యం గా ఉండచ్చు.

కత్తెర:

కత్తెర:

చాలా కాలం నుండీ ముక్కులో వెంట్రుకలని తొలగించడానికి కత్తెర ఒక సాధనం.ఇప్పటికీ ఈ పద్ధతే ఉపయోగిస్తారు మగవారు,ఎందుకంటే ఇది చాలా సులభమైన పద్ధతి.ఈరోజుల్లో ముక్కులో వెంట్రుకలని ట్రిం చేసుకునే కత్తెరల అంచులు గుండ్రం గా ఉన్నవి లభ్యమవుతున్నాయి.అంచులు పదునుగా లేకపోవడం వల్ల వాడేటప్పుడు భద్రత ఉంటుంది

వ్యాక్సింగ్

వ్యాక్సింగ్

ముక్కులో పెరిగే వెంట్రుకలని వ్యాక్సింగ్ ద్వారా మగవారు తొలగించుకుంటారు.ముక్కులో వ్యాక్సింగ్ ని స్పా లో లేదా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి.మార్కెట్టులో కూడా ఇంట్లోనే చేసుకోగలిగే అనేక రకాల వ్యాక్సింగ్ కిట్ లు లభిస్తున్నాయి.

ఎలెక్ట్రిక్ షేవర్ అటాచ్ మెంట్:

ఎలెక్ట్రిక్ షేవర్ అటాచ్ మెంట్:

ఈ మధ్య కాలం లో ఎలెక్ట్రిక్ షేవర్ లతో అదనం గా ముక్కులో వెంట్రుకలని తొలగించుకునే సాధనాలు లభిస్తున్నాయి. దీనివల్ల షేవింగ్ చేసుకునేటప్పుడే ముక్కులో వెంట్రుకలని తొలగించుకోవడం వీలవుతుంది.ఇది మీ సమయాన్నే కాక డబ్బుని కూడా ఆదా చేస్తుంది

ట్వీజర్లు

ట్వీజర్లు

ఇప్పటికీ చాలా మంది ట్వీజర్ల ద్వారా ముక్కులో వెంట్రుకలని తొలగించుకుంటూ ఉంటారు.ట్వీజర్లు వాడేటట్లయితే నాణ్యమయినా మరియు శుభ్రమయిన వాటినే వాడటం మరచిపోవద్దు. ట్వీజర్ ద్వారా ముక్కులో వెంట్రుకలని తొలగించుకునేటప్పుడు తగినంత వెలుతురు వచ్చే చోట అద్దం ముందు నిలబడాలి. కానీ ట్వీజర్ వాడకం వల్ల ముక్కులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉన్నందువల్ల వైద్యులు ట్వీజర్ వాడమని సూచించరు

క్రీములు

క్రీములు

కాళ్ళూ చేతులకీ ఉన్న అవాచిత రోమాలు తొలగించడానికి క్రీములున్నట్లే ముక్కులో వెంట్రుకలని తొలగించడానికి కూడా క్రీములున్నాయి.ఈ క్రీములు సహజ సిద్ధమైన పదార్ధాలు మరియు తేలికపాటి వాసనతో ఉంటాయి.ముక్కులో వెంట్రుకల నివారణకి ఇది ఒక ఉత్తమ విధానం.

లేజర్ ట్రీట్మెంట్

లేజర్ ట్రీట్మెంట్

ముక్కుకి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ముక్కులో వెంట్రుకలని శాశ్వతం గా నిర్మూలించవచ్చు.కానీ వెంట్రుకలని పూర్తిగా నిర్మూలించడానికి పలు దఫాలుగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది.ముక్కు చాలా సున్నితమయిన శరీర భాగం. అందువల్ల ఈ లేజర్ ట్రీట్మెంట్ ని నిపుణుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇవండీ ముక్కులో రోమాలని తొలగించుకోవడానికి 7 ఉత్తమ విధానాలు. వీటిలో ఏదో ఒక విధానం ద్వారా ముక్కులో అవాఛిత రోమాలని సులభం గా మరియు భద్రంగా తొలగించుకోండి.

English summary

Seven Ways For Men To Trim Nose Hair: Beauty Tips in Telugu

Nasal hair is sometimes a difficult problem for men, despite its biological functions. Actually, nose hair acts as a natural immune system by avoiding dust or other pollutants from entering our body through nose.
Desktop Bottom Promotion