For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్చిన చెక్కలో దాగి ఉన్న సౌందర్య రహస్యం

|

అందమైన అమ్మాయిని చూడగానే ‘చక్కని చుక్కలా' ఉందనడం సహజమే..కానీ అలా చుక్కలా మెరిసిపోవాలంటే ఉన్న అందాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిందే. సౌందర్య సంరక్షణలో భాగంగా ఇంట్లో లభించే రకరకాల పదార్థాలు మనం ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే వంటింట్లో మసాలా దినుసులలో ఎక్కువగా ఉపయోగించే దాల్చిన చెక్క కూడా అందాన్ని పెంపొందించడానికి ఉపకరిస్తుందని మీకు తెలుసా? అవునండీ..దాల్చిన చెక్క సౌందర్యపరంగా ఎలా ఉపయోగపడుతుంది? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

దాల్చిన చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే అందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వాటితో పాటు ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, రిబోఫ్లెవిన్, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ సి, ఎ..మొదలైనవన్నీ సౌందర్యపరంగా చక్కని ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలో దాల్చిన చెక్క ఉపయోగించి ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని ప్యాక్స్ గురించి తెలుసుకుందాం...

Beauty Benefits Of Cinnamon

మొటిమలు తగ్గడానికి :
ముందుగా దాల్చిన చెక్కని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మొటిమలు, నల్లమచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమంగా చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుముఖం పడుతాయి.

నిమ్మరసం ఉపయోగించడం ఇబ్బంది అనుకుంటే, దానికి బదులుగా తేనెను కూడా ఉపయోగించవచ్చు. చెంచా దాల్చిన చెక్క పొడికి మూడు చెంచాలా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. అలా రాంత్రంతా ఉంచి పొద్దున్న లేవగానే శుభ్రం చేసుకోవచ్చు. ఒక వేళ అలా ఇబ్బంది అనుకున్న వారు అప్లై చేసుకున్న 20నిముషాల తర్వాత శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ విధంగా వారానికోసారి చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

పొడి చర్మానికి:
దాల్చిన చెక్క పొడి చర్మానికి మంచి స్ర్కబ్ లా కూడా పనిచేస్తుంది. అంతే కాదు..పొడి చర్మంతో బాధపడే వారు దాల్చిన చెక్క పొడికి రాళ్ల ఉప్పు, బాదంనూనె, ఆలివ్ ఆియల్, తేనె జత చేసి మొత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుంటే చర్మం పొడిబారడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు.

జుట్టు పెరుగుదలకు:
ఒక గుడ్డు సొనలో, దాల్చిన చెక్క పొడి ఒక చెంచా, ఆలివ్ ఆయిల్ ఒక చెంచా, తేనె ఒక చెంచా వేసి మిక్స్ చేయాలి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు మాస్క్ లా వేసుకోవాలి. 20నిముషాలు బాగా ఆరిన తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల జుట్టు తొందరగా పెరగడమే కాకుండా ఒత్తుగా కూడా పెరుగుతుంది.

కుదళ్ళ పోషణకు :
దాల్చిన చెక్క పొడి ఒక చెంచా, గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ పావు చెంచా, తేనె చెంచా సరిపడిన మోతాదులో తీసుకొని అవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రామాన్ని కుదుళ్ళకు అంటుకునేలా జాగ్రత్తగా, మ్రుదువుగా మర్దన చేస్తూ అప్లై చేయాలి. 15నిముషాలు ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. దాల్చిన చెక్క పొడి కుదళ్లను శుభ్రం చేయడమే జుట్టు పెరగడానికి అవసరమయ్యే పోషకాలను అందించి ఊడిపోయిన కేశాలు తిరిగి ఎదిగేలా చేస్తుంది.

మరికొన్ని ప్రయోజనాలు: చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనపించడం
చర్మానికి ఎలాంటి అలర్జీలు రాకుండా చేయడం
గాయాలు మొటిమల వల్ల ఏర్పడే మచ్చల్ని తగ్గించడం..
వయస్సు మీద పడుతున్న లక్షనాలు కనిపించకుండా చేయడం..
దాల్చిన చెక్కను సౌందర్య సంరక్షణలో భాగంగా ఉపయోగించడం వల్ల ఇలాంటి లాభాలు మరెన్నో ఉన్నాయి...

English summary

Beauty Benefits Of Cinnamon

The sweet, spicy scent of cinnamon is one of our favorite winter fragrances, but it’s more than just a scent or a topping for a latte. Cinnamon is also a powerful beauty ingredient with plenty of benefits for your skin. Below, we explain the beauty benefits of cinnamon, and this is just scratching the surface!
Story first published: Friday, January 30, 2015, 18:07 [IST]
Desktop Bottom Promotion