For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ళ పగుళ్ళు, కాళ్ళ మీద డ్రై స్కిన్ నివారించడం ఎలా

By Super
|

కాళ్ళపై పొడి చర్మం అనేది చర్మ వ్యాధి నిపుణుల ద్వారా పిలువబడే గ్జిరోసిస్ లేదా ఆస్తియతోసిస్ అనే చర్మ సమస్య. అయితే, దీన్ని చాలా సాధారణంగా “శీతాకాల దురద” అంటారు. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువ ఉండడం వాళ్ళ ఇది తరచుగా వస్తుంది. కాళ్ళమీద పొడిబారడం అనేది ఏ వయసువారికైన రావచ్చు, దానివల్ల చర్మం చాలా గట్టిగా, పొరలుగా ఔతుంది. చాలా కేసులలో చర్మానికి పగుళ్ళు కూడా ఏర్పడవచ్చు. కాళ్ళపై ఉన్న పొడి చర్మాన్ని నయం చేయడానికి కింద ఇచ్చిన నిబంధనలతో కూడిన వివరాలను చదవండి.

దశలు:

1. వైద్య కారణాలు తోసిపుచ్చండి

1. వైద్య కారణాలు తోసిపుచ్చండి

పొడి చర్మం కొన్ని జబ్బులకు కారణం కావచ్చు, కొన్ని ఔషధాల ప్రభావం కూడా కావచ్చు. మీ చర్మం పొడిబారుతుంది వైద్యం లేదా మందుల వల్ల కాదని మొట్టమొదట వైద్యుడిని సంప్రదించి నిర్ధారించుకోవడం చాలా అవసరం.

2. సరిగా స్నానం చేయడం

2. సరిగా స్నానం చేయడం

కాళ్ళ మీద పొడి చర్మాన్ని నయంచేయడానికి ప్రయత్నించేటపుడు ముందు అది ప్రమాదకరం కాదనేది నిర్ధారించుకోండి. తరచుగా లేదా తక్కువ సమయంలో ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల సమస్య మరింత పెరిగి చర్మం ఎక్కువ పొడిగా తయారవుతుంది. వేడి నీళ్ళు, సబ్బులు రెండూ చర్మానికి అవసరమైన హైడ్రేటెడ్ నూనెను, తేమను పోగొడుతుంది. స్నానం ఒకసారి 10 నిమిషాలకంటే ఎక్కువసేపు చేయడం, రోజులో ఒకసారి కంటే ఎక్కువ సార్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చేయకూడదు. తేమతో కూడిన సబ్బును వాడండి లేదా అసలు వాడొద్దు.

3. స్నానం తరువాత సరిగా తుడుచుకోండి

3. స్నానం తరువాత సరిగా తుడుచుకోండి

స్నానం తరువాత, త్వరగా అరబెట్టుకోవడమే కాదు, సరిగా తుడుచుకోవడం కూడా చాలా అవసరం. టవల్ తో మీ చర్మాన్ని తుడుచుకోవడం కంటే, అద్దుకోవడం మంచిది. అలా ఎక్కువ సేపు తుడవడం వాళ్ళ చర్మం నుండి తేమ ఎక్కువగా తొలగిపోతుంది.

4. స్నానం తరువాత మాయిస్చార్ వాడండి

4. స్నానం తరువాత మాయిస్చార్ వాడండి

స్నానం చేసిన 3 నిమిషాలలోగా, ఏదైనా మాయిశ్చరైజర్ పట్టించండి దానివల్ల స్నానం చేసినందు వాళ్ళ వచ్చిన తేమ ఏదైనా ఉంటె మీ శరీరంలో నిలిచిపోతుంది. మీరు మీ కాళ్ళపై ఏదైనా మాయిశ్చరైజర్ లోషన్ లేదా బేబీ ఆయిల్ అయినాసరే లేదా పెట్రోలియం జెల్లీ వాడండి.

5. తరచుగా మాయిశ్చరైజర్ రాయండి

5. తరచుగా మాయిశ్చరైజర్ రాయండి

ఒక చిన్న కంటైనర్ లేదా లోషన్ ని మీతో తీసుకువెళ్ళండి, రోజంతా దానిని అప్లై చేయండి. మీ చర్మంపై కఠినమైన సుగంధ లోషన్లకు బదులుగా వాసనలేని మాయిస్చరైసర్ ను వాడడం మంచిది.

6. ఎర్రటి దద్దుర్లను గమనించండి

6. ఎర్రటి దద్దుర్లను గమనించండి

కాలి చర్మంపై ఎక్కువ పొడిబారితే దాని ఫలితంగా ఎర్రటి దద్దుర్లు వస్తాయి; ఈ స్థితిని ఎగ్జిమాటిస్ అంటారు. ఈ దద్దుర్లని బైట దొరికే కార్టిసోన్ క్రీమ్ తో చికిత్స చేయాలి, ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటే ఈ దద్దుర్లు పోవడానికి స్తేరాయిడ్ ఆయింట్ మెంట్ ఇచ్చిన వైద్యునికి చూపించండి.

7. తేమను పెంచుకోండి

7. తేమను పెంచుకోండి

ఇంటి వాతావరణం తేమగా ఉంటే మీ చర్మం తేమను పొందగలుగుతుంది. పొడి, వేడి గాలి మీ చర్మం నుండి తేమను లాగేస్తుంది; ఒక చిన్న హ్యుమిడిఫయ్యర్ ని రాత్రిపూట మీ పడకగదిలో ఉంచితే చాలా తేడా తెలుస్తుంది.

English summary

How to Heal Dry Skin on Legs

Dry skin on the legs is a dermatological problem called xerosis or asteatosis by dermatologists, though it is most commonly known as "winter itch." It most often occurs in the winter months, when there is less humidity in the air.
Desktop Bottom Promotion