For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ హోం రెమెడీస్ తో సున్నితమైన...అందమైన పాదాలు మీ సొంతం

|

మహిళల శరీరంలో అందమైన భాగాల్లో పాదాలు కూడా ఒకటి. బ్యూటీ విషయంలో పాదాలు కూడా ప్రధాణ పాత్రను పోషిస్తాయి. అందమైన పాదాలు కలిగిన వారు వారి వ్యక్తిత్వాన్ని మరియు అందానికి ప్రతీక. ముఖం చూస్తే చాలా అందంగా..కాంతివంతంగా మరియు పాదాలు చూసినప్పుడు బాగోలేకపోతే చాలా ఇబ్బందికరంగా...అసహ్యంగా ఉంటుంది.

ముఖానికి తీసుకొనే జాగ్రత్తలు మరియు ఫేషియల్ వంటివాటిలో పాదాల గురించి కొద్దిగా తీసుకుంటే మొత్తం శరీరం యొక్క సౌందర్యం ఇనుమడిస్తుంది. అందుకు స్పాలు, సెలూన్లకు వెళ్ళాల్సిన పనిలేదు . సెలూన్స్ లో పాదాలకోసం చేసే పెడిక్యూర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువ ఖరీదు చేయాల్సి వస్తుంది.

READ MORE: అందవిహీనంగా మారిన పాదాలకు ఇవిగో అద్భుతం చిట్కాలు...!

కొద్దిగా సమయం మరియు కొద్దిగా శ్రమపడితే మనం ఇంట్లోనే అందమైన పాదాలను పొందవచ్చు. మీ పాదాలను సాఫ్ట్ గా మరియు పపెల్ గా , మెరుస్తుండేలా మంచి ఫెయిర్ నెస్ తో ఉండేందుకు కొన్ని హోం రెమెడీస్ అద్భుతంగా సహాయపడుతాయి. సెలూన్లకు వెళ్ళి డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండానే అందమైన పాదాలను మీ సొంతం చేసుకోవచ్చు.

READ MORE: అందమైన సున్నిత పాదాలకు 10 సులభ చిట్కాలు

ఈ నేచురల్ హోం రెమెడీస్ చాలా సింపుల్ గా మరియు సలభంగా మనకు అందుబాటులో ఉంటాయి. మనం ఇంట్లోనే అందమైన పాదాలకోసం చేసుకొనే కొన్ని సింపుల్ పెడిక్యూర్ టిప్స్ ను ఈ క్రింది విధంగా ఉన్నాయి ఓ లుక్ వేయండి...

లెమన్ అండ్ సాల్ట్:

లెమన్ అండ్ సాల్ట్:

నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మచెక్క మీద ఉప్పు చిలకరించి పాదాల మీద 10-15నిముషాల పాటు స్క్రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ స్ర్కబ్:

ఓట్ స్ర్కబ్:

ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ లో ఒక చెంచా పంచదార మిక్స్ చేసి రెండు చెంచాలా పాలు జోడించి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి పాదాలకు అప్లై చేసి 15 నిముషాల పాటు బాగా మర్ధన చేయాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సాఫ్ట్ అండ్ ఫెయిర్ ఫీట్ ను మీరు పొందవచ్చు.

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, తర్వాత పౌడర్ గా చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ పౌడర్లో ఒక చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేసి పాదాలకు పట్టించాలి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా మరియు షాంపు:

బేకింగ్ సోడా మరియు షాంపు:

4 చెంచాల బేకింగ్ సోడా తీసుకొని ఒక టబ్ గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి పాదాలను ఈ నీటిలో డిప్ చేయాలి. అదే టబ్ లో కొద్దిగా షాంపును కూడా వేసి నిధానంగా రుద్ది కడగాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్ళలో వేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి పాదాల మీద పోయాలి తర్వాత సాఫ్ట్ బ్రెష్ తో మర్ధన చేసి, మంచి నీటితో కడిగితే షైనీ అండ్ సాఫ్ట్ పాదాలు మీ సొంతం అవుతాయి. ఇది సాఫ్ట్ అండ్ ఫెయిర్ ఫీట్ పొందడానికి ఇది ఒక నేచురల్ పద్దతి.

హైడ్రోజన్ పెర్ ఆక్సైడ్:

హైడ్రోజన్ పెర్ ఆక్సైడ్:

రెండు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఒక టబ్ వాటర్లో మిక్స్ చేసి అందులో మీ పాదాలను 15 నిముషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అందమైన పదాలను మీరు పొందవచ్చు.

లెమన్, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్:

లెమన్, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్:

ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా గ్లిజరిన్ మరియు అరచెంచా రోజ్ వాటర్ ను మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి సాక్సులు వేసుకొని పడుకోవాలి . ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా మరియు పాదాల పగుళ్ళు లేకుండా మార్చుకోవచ్చు.

మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్ తీసుకొని మీ పాదాలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడానికి ముందు షాంపులో కొద్దిసేపు పాదాలను నానబెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Make You Feet Soft And Fair At Home: Beauty Tips in Telugu

Make You Feet Soft And Fair At Home. Beauty Tips in Telugu. Taking care of your feet is as important as taking care of your facial skin. You go to salons for expensive treatment of feet. These salons do expensive pedicure and cost you a lot of bucks.
Story first published: Thursday, July 23, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion