For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై అండ్ రఫ్ హ్యాండ్స్ ను సాప్ట్ గా.. యంగ్ గా కనిపించేలా చేసే రెమెడీస్

|

మన శరీరంలో నిరంతరం బిజీగా ఉండేవి చేతులు, నిద్రలేచినప్పటి నుండి చేతులతో వివిధ రకాల పనులు చేస్తుంటాము. అలాంటి చేతుల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, చేతులు డ్రై మరియు రఫ్ గా మారుతాయి . అలాంటి చేతులను ఎవరైనా చూస్తే వయస్సైనవారి చేతులుగా గుర్తిస్తారు.

చేతులు అందంగా లేకపోవడానికి లేదా డ్రై గా మారడానికి వివిధ కారణాలున్నాయి. చేతులకు పొడిగాలులు, చల్లని వాతావరణం, తక్కువ హుముడిటి, సన్ ఎక్స్ ఫ్లోజర్, ఎక్కువగా చేతులను నీటితో శుభ్రం చేసుకోవడం లేదా చేతులను నిరంతర నీటిలో తడపటం, హానికరమైన కెమికల్స్ ను ఎక్స్ ఫోజ్ అవ్వడం, క్లోరైడ్ పూల్స్ లో స్విమ్మింగ్ వల్ల మరియు సోప్ బార్స్ వల్ల కూడా చేతులు డ్రైగా మారుతాయి.

డ్రై అండ్ రఫ్ హ్యాండ్స్ కు మరికొన్ని మెడికల్ స్కిన్ కండీషన్స్ అంటే సోరియోసిస్, మరియు ఎక్జిమా, అదే విధంగా అలర్జీలు మరియు కొన్ని మెడికేషన్స్ వంటివి డ్రై హ్యాండ్స్ కు దారితీస్తుంది.

అయితే నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి., మీ చేతులు సాఫ్ట్ గా ఉండటానికి సరైన ప్రొడక్ట్స్ తో రొటీన్ గా తగిన పోషణను అందివ్వాలి. మీరు ఇంకా కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ఉపయోగించి చేతులను సాఫ్ట్ గా యంగ్ లుకింగ్ తో ఉండేట్టు చేసుకోవచ్చు.

డ్రై అండ్ రఫ్ హ్యాండ్స్ నివారణకు 10 హోం రెమెడీస్

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్లో హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి డ్రై హ్యాండ్స్ ను సాఫ్ట్ గా మార్చుతాయి. ఇది మీ చర్మాన్ని సాఫ్ట్ గా.. సపెల్ గా మరియు మాయిశ్చరైజ్ చేస్తాయి . అదే విధంగా ఇందులో యాంటీఏజింగ్ స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొద్దిగా గోరెవచ్చని ఆలివ్ ఆయిల్ ను చేతిలోకి తీసుకొని చేతులకు అప్లై చేయాలి. రోజులో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చేతులు సాఫ్ట్ గా మరియు సపెల్ గా మారుతాయి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

డ్రై అండ్ రఫ్ హ్యాండ్స్ కు ఓట్ మీల్ మరో గ్రేట్ హీలర్. ఇది నేచురల్ క్లెన్సింగ్ గా మరియు ఎక్సఫ్లోయేటింగ్ గా పనిచేస్తుంది. ఇది చేతులను డ్రైగా మార్చదు . ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మంలో తేమ కోల్పోకుండా చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

రెండు చెంచాలా ఓట్ మీల్ పౌడర్లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి, కొద్దిగా నీరు చేర్చి పేస్ట్ లా చేయాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

డ్రై స్కిన్ కు కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. రఫ్ హ్యాండ్స్ ను నివారించడానికి , స్కిన్ డ్యామేజ్ ను నివారించడానికి , హానికరమైన యూవీ కిరణాల నుండి చేతులకు రక్షణ కల్పించడానికి కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెను చేతులకు అప్లై చేయాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు చేతికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.

మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్ లో ఉండే హై ఫ్యాట్ కంటెంట్ నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . దాంతో డ్రై అండ్ రఫ్ హ్యాండ్స్ ను నివారించుకోవచ్చు. మిల్క్ క్రీమ్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ డ్రై స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి, స్కిన్ పిహెచ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

 తేనె:

తేనె:

తేనె ఒక నేచురల్ మాయిశ్చరైజర్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్స్ మరియు హ్యుమక్టాంట్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చేతులకు తగిన మాయిశ్చరైజర్ ను అందివ్వడానికి, చేతులకు అదనపు సాఫ్ట్ నెస్ ను స్మూత్ గా మార్చడానికి ఇది సహాయపడుతుంది. తేనెను చేతులకు పట్టించి 10 నిముషా తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ ఒకటి రెండు సార్లు చేస్తుంటే చేతులు సాఫ్ట్ గా మారుతాయి.

అలోవెర:

అలోవెర:

అలోవెర: అలోవెరలో నేచురల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చేతులకు మాయిశ్చరైజర్ ను అందివ్వడంతో పాటు చేతులను సాఫ్ట్ గా మార్చుతుంది. ఇది చర్మానికి రక్షణ కల్పించడంతో పాటు స్కిన్ టోన్ మార్చుతుంది.

అలోవెరాను లీఫ్ ను కట్ చేసి జెల్ తీసి చేతులకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం: నిమ్మరసం స్కిన్ క్లెన్సర్ గా ఉపయోగిస్తారు. అది చేతును సాఫ్ట్ చేయడంతో పాటు స్మూత్ గా మార్చుతుంది. అదే సమయంలో ఇది స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది మరియు చేతుల మీద ఉండే స్కిన్ స్పాట్స్ ను నివారిస్తుంది.

నిమ్మరసం, తేనె, బేకింగ్ సోడా సమంగా తీసుకొని మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి, ఒక నిముషం మసాజ్ చేయాలి . 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్తీ లుకింగ్ హ్యాండ్స్ పొందవచ్చు.

పెరుగు:

పెరుగు:

పెరుగు మరో నేచురల్ హైడ్రేటింగ్ ఏజెంట్ ఇది డ్రై అండ్ రఫ్ హ్యాండ్స్ ను నివారిస్తుంది. అదే విధంగా పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ నేచురల్ క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది మరియు ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

చిక్కగా ఉండే పెరుగును చేతులకు అప్లై చేసి 5నిముషాలు మసాజ్ చేయాలి. 10 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

. బాగా పండిన అరటిపండ్లు:

. బాగా పండిన అరటిపండ్లు:

బాగా పండిన అరటిపండ్లను సాప్ట్ హ్యాండ్స్ కు ఒక గ్రేట్ హోం రెమెడీ . ఇది డ్రై అండ్ రఫ్ స్కిన్ నివారిస్తుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ముఖంలో ముడుతలు, ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది. బాగా పండిన అరటిపండును మెత్తటి పేస్ట్ లా చేసి చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

 అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో విటమిన్, ఎ, సి మరియు ఇ, ఇంకా మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి డ్రై స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా మీ చేతులను చూడటానికి యంగ్ గా కనబడుతాయి. అరకప్పు అవొకాడో పేస్ట్ లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి చేతులకు పట్టించి 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Top Ten Home Remedies for Dry and Rough Hands

Top Ten Home Remedies for Dry and Rough HandsYour hands are one of the busiest parts of your body, used for several tasks throughout the day. Many people do not take proper care of their hands and they end up dry and rough, looking as though they belong to someone older.
Story first published:Wednesday, November 25, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion