For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోచేయి నలుపును నివారించడానికి 9సులభ చిట్కాలు

|

కొంతమందికి శరీరం మొతం తెల్లగా, మృదువుగా ఉన్నా మోచేతుల దగ్గర చర్మం నల్లగా, గరుకుగా ఉంటుంది. అక్కడి చర్మం మొద్దుబారిపోయి చూడ్డానికి చాలా ఇబ్బందిగా, మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం... అప్పటి వరకు ఏదో పనిచేస్తూ అనాలోచితంగా దగ్గరో ఏదో ఒకటి సపోర్ట్ గా దొరికితే దాని మీద మోచేతులు పెట్టి కూర్చోవడమో, నిల్చోవడమో చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఆ సమయంలో విశ్రాంతి పొందవచ్చు అని భావిస్తారు.

READ MORE: ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు

కానీ ఇదే సంఘటన పదే పదే జరిగినప్పుడు మోచేతుల దగ్గర చర్మం మొద్దుబారినట్లుగా నల్లగా కమిలిపోతుంది. మరికొన్ని రోజులకు గరుకుగా అవుతుంది. ఈ నలుపు పోయి తిరిగి మోచేయి మామూలుగా రావాలంటే వివిధ రకాల మార్గాలున్నాయి. మోచేయి నలుపు తగ్గించుకోవడానికి కేవలం నిమ్మరసం రాస్తే సరిపోదు, దాంతో పాటు మరికొన్ని సులభమైన ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

షుగర్ స్ర్కబ్:

షుగర్ స్ర్కబ్:

చేతులను చల్లటి నీటితో కడి, తర్వాత పంచదార చిలకరించి స్క్రబ్ చేయాలి. ముఖంగా మోచేతుల దగ్గర స్ర్కబ్ చేయడం వల్ల నలుపుతగ్గతుంది.

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీసెస్టిక్ గుణాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి, పసుపులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేసి మోచేతులకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత, బాగా రుద్ది, తర్వాత నీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మతొక్కను పంచదార లేదా ఉప్పు లో డిప్ చేసి, మోచేతుల మీద స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరగా మార్పు వస్తుంది.

పుదీనా:

పుదీనా:

పసుపులో యాంటీసెస్టిక్ గుణాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి, పసుపులో కొద్దిగా తేనె మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేసి మోచేతులకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత, బాగా రుద్ది, తర్వాత నీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి.

పుదీనా జ్యూస్ విత్ నిమ్మరసం:

పుదీనా జ్యూస్ విత్ నిమ్మరసం:

పుదీనాను కొద్దిగా నీటిలోవేసి మరిగించి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి మోచేతులకు అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ మరియు పాలు:

బేకింగ్ సోడ మరియు పాలు:

బేకింగ్ సోడా మరియు పాలు రెండింటిని చిక్కటి పేస్ట్ గా చేసి ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి 10 నిముషాల తర్వాత సర్కులర్ మోషన్ లో బాగా రుద్ది తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. పాలలోని ల్యాక్టిక్ యాసిడ్ మోచేతులు నలుపును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బేకింగ్ సోడా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

 కొబ్బరి నూనె మరియు నిమ్మరసం :

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం :

ఒక చెంచా కొబ్బరి నూనె మరియు అర చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి 20నిముషాల తర్వాత టిష్యు పేపర్ తో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి నూనె చర్మానికి తగినంత తేమను అందించి, నేచురల్ బ్లీచర్ గా పనిచేస్తుంది.

పెరుగు మరియు వెనిగర్ లేదా నిమ్మరసం :

పెరుగు మరియు వెనిగర్ లేదా నిమ్మరసం :

రెండు చెంచాలా పెరుగు మరియు రెండు చెంచాల నిమ్మరసంను మిక్స్ చేసి మోచేతులకు అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద :

కలబంద :

మన ఇంటి ఆవరణలో లేద పెరట్లో ఉండే కలబంద వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అలొవెరా జెల్ ను అప్లై చేయడం ద్వారా స్కిన్ పిగ్న్మెంటేషన్ ను తొలగిస్తుంది. అలోవెరా జెల్ మోచేతులకు అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేస్తే, చర్మం కాంతివంతంగా మారుతుంది.

English summary

9 Ways to Get Rid of Dark Elbows

You can easily get rid of these dark elbows using various home remedies.
Story first published: Thursday, April 16, 2015, 12:46 [IST]
Desktop Bottom Promotion