For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మర్మావయవాలపై సబ్బును ఎందుకు ఉపయోగించకూడదు !!

By Super
|

చాలామంది ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఆ ఆలోచనతో శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి, మనం వివిధ సౌందర్య సాధనాలు, సబ్బులు, షాంపూలు వాడతాము, కాని ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో మీకు తెలుసా? మర్మవయావాలపై సబ్బును వాడకూడదని!

మనం శరీరం మొత్తాన్ని ఎంతో శుభ్రంగా ఉంచాలని చిన్నప్పటి నుండి నేర్చుకున్నాం, అందువల్ల మన శరీరంలోని ప్రతి చిన్న భాగాన్ని ఎంతో జాగ్రత్తతో బాగా శుభ్రం చేయాలనీ ప్రయత్నిస్తాం.

కానీ మర్మావయవాలను కేవలం నీటితో మాత్రమే శుభ్రం చేయాలనీ ఆరోగ్య, సౌందర్య నిపుణుల సూచన. అంతేకాకుండా, మర్మావయవాలను శుభ్రంగా ఉంచుకోవడానికి చివరికి టాల్కం పౌడర్ ని కూడా వాడకూడదుట.

మీ ముఖంపై సబ్బును ఎందుకు వాడకూడదో అందరికీ తెలుసు. సబ్బులు చర్మాన్ని పొడిగా చేస్తాయి. మర్మావయవాలపై సబ్బును ఎందుకు వాడకూడదో ఏదైనా కారణం ఉందా?

అవును, ఈ విషయం గురించి ప్రస్తావిద్దాం.

సేబమ్

సేబమ్

మీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా సబ్బును ఎందుకు వాడకూడదో మీకు తెలుసా? సరే, మీ శరీరంపై ఉన్న సహజ తేమ బైటికి వెళ్ళిపోవడం వల్ల, శరీరానికి అంటువ్యాధులు కలిగించే కొన్ని సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా శరీరంలోని సహజ రక్షణ దెబ్బతింటుంది.

పొడిబారడం

పొడిబారడం

ప్రతిరోజూ మీరు మర్మావయవాలను సబ్బుతో కడిగితే, కణజాల భాగం పూర్తిగా పోడిబారిపోతుంది. దీనివల్ల వాపులు, పగుళ్ళు వస్తాయి.

నీరు

నీరు

మీ మర్మావయవాలను గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను ఉప్పు వేసి శుభ్రం చేయండి.

పిల్లలకు

పిల్లలకు

చిన్న పిల్లలకు తల్లితండ్రులు శుభ్రం చేసేటపుడు, గాఢత కలిగిన సబ్బులు చర్మానికి చికాకు కలిగిస్తాయి కాబట్టి చిన్నపిల్లలా మర్మావయవాలకు సబ్బును ఉపయోగించ కూడదని గుర్తుంచుకోవడం చాలా అవసరం. మీరు సబ్బును ఉపయోగించకుండా ఆ శరీర భాగాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోవడానికి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.

ఓడర్లు

ఓడర్లు

మీ శరీర దుర్గంధాన్ని పోగొట్టుకోడానికి, తక్కువ గాఢత కలిగిన లేదా కొద్ది సబ్బును మీ శరీరానికి వాడండి. కానీ వీటిని మీ మర్మావయవాల దగ్గర వాడొద్దు.

English summary

Why You Shouldn't Use Soap On Privates

Most of us would always want to be clean and healthy. In an attempt to keep the body clean, we use various beauty products, soaps and shampoos but do you know what the health experts are saying? Well, don't use soap on your private parts!
Desktop Bottom Promotion