బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవ్వడానికి స్నానానికి ముందు వాడాల్సిన 10 బాడీ మసాజ్ ఆయిల్స్ ..!

గతంలో బాడీ మసాజ్ ఆయిల్స్ ను చాలా ప్రత్యేకంగా కొన్ని హెర్బల్ మొక్కలను నుండి తయారుచేస్తారు.కేవలం ఒక్క చర్మ సంరక్షణలో కాదు, బాడీ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇతర అండర్ లైయింగ్ ప్రొబ్లెమ్స్ ను నివారిస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

గతంలో బాడీ మసాజ్ ఆయిల్స్ ను చాలా ప్రత్యేకంగా కొన్ని హెర్బల్ మొక్కలను నుండి తయారుచేస్తారు. వీటినే చర్మానికి అప్లై చేస్తుంటారు. అయితే ప్రతస్తుత కాలంలో రెగ్యులర్ గా ఉపయోగించే ఎసెన్షియల్ ఆయిల్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉండే కొన్ని రకాల నూనెలు చర్మానికి పోసణ, హైడ్రేషన్ అందివ్వడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే అదే నూనెలో ఆరోగ్యానికి కూడా తగినన్ని ప్రయోజనాలను అందిస్తాయి.

ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ను కూడా కరెక్ట్ గా ఎంపిక చేసుకోవడంతో ఫర్ఫెక్ట్ గా పనిచేస్తాయి . కాంతి వంతమైన చర్మసౌందర్యాన్ని అందిస్తాయి. కొన్ని బాడీ మసాజ్ ఆయిల్ చాలా తేలికగా ఉంటాయి. ఇవి చర్మంలోకి చాలా సులభంగా శోషింపబడుతాయి. స్కిన్ లేయర్స్ కు కావల్సిన పోషణను అందివ్వడతో పాటు స్కిన్ సెల్స్ రిలాక్స్ అవుతాయి. కేవలం ఒక్క చర్మ సంరక్షణలో కాదు, బాడీ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇతర అండర్ లైయింగ్ ప్రొబ్లెమ్స్ ను నివారిస్తుంది. మైండ్ ను ప్రశాంత పరుస్తుంది.

కొన్ని బెస్ట్ బాడీ మసాజ్ ఆయిల్స్ ను ఈక్రింది విధంగా పరిచయం చేయడం జరిగింది...

ల్యావెండర్ ఎసెన్సియల్ ఆయిల్ :

ల్యావెండర్ ఎసెన్సియల్ ఆయిల్ ను చర్మానికి ఉపయోగించడం చాలా మంచిది. ల్యావెండర్ ఆయిల్ స్కిన్ ను స్మూత్ గా మరియు లైట్ స్ట్రక్చర్ ను అందిస్తుంది. ఈ ఎసెన్సియల్ ఆయిల్ నాడీవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, మెచ్యుర్డ్ అండ్ సాగింగ్ చర్మానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది .

జర్మేనియం ఎసెన్షియల్ ఆయిల్ :

జర్మేనియం ఎసెన్షియల్ ఆయిల్ స్కిన్ ఎలాసిటి పెంచడానికి స్కిన్ ను టైట్ గా మార్చడానికి సహాయపడుతుంది. శరీరం మొత్తం చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. యూత్ ఫుల్ స్కిన్ అందిస్తుంది.

శ్యాండిల్ ఉడ్ ఎసెన్షియల్ ఆయిల్ :

శ్యాండిల్ ఉడ్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చర్మానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. ఇది ఫ్రీ సెల్స్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఏజింగ్ ప్రొసెస్ ను నివారిస్తుంది.

రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ :

రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. దాంతో చర్మ సమస్యలు, చర్మ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. రీసెర్చ్ ప్రకారం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఫ్రీరాడికల్స్ ను నాశనం చేయడానికి ఉపయోగిస్తుంటారు. అలాగే శరీరం మీద ఏజింగ్ లక్షణాలు కనబడనివ్వకుండా క్రమబద్దం చేస్తుంది.

ప్యాచోలి ఎసెన్సియల్ ఆయిల్ :

ప్యాచోలీ ఎసెన్సియల్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . ఇరిటేడ్ స్కిన్ కు దీన్ని ఉపయోగించడం చాలా సులభం. చర్మ సమస్యలైన ఎగ్జిమా, ఫోరియోసిస్, డెర్మటైటిస్, మరియు ఇతర సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

నెరోలి ఎసెన్షియల్ ఆయిల్ :

నెరోలి ఎసెన్సియల్ ఆయిల్ వివిధ రకాల బాడీలోషన్స్, బాడీ క్రీమ్స్ లో ఉపయోగిస్తుంటారు. ఇవి చర్మంలో పెద్దగా ఏర్పడ్డ చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ :

ఈ టీట్రీ ఎసెన్సియల్ ఆయిల్ మొటిమల చర్మానికి అధికంగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మంలోని మొటిమలు మచ్చలను తొలగిస్తుంది. వీటిని ఎక్కువగా స్కిన్ క్రీమ్స్, లోషన్స్, ఫేస్ వాష్ లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు .

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ లీవ్స్ నుండి ఫ్రెష్ గా ఆయిల్ ను తయారుచేస్తారు. ఇందులో ఉండే ఔషధ, ఆరోమా గుణాల వల్ల దీన్ని ఎక్కువగా చర్మ సంరక్షణకోసం ఉపయోగిస్తుంటారు, యూకలిప్టస్ ఆయిల్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. సూర్యుని నుండి వెలువడే హానికరమైన యూవీకిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ ను డ్రై అయిన బాదం పప్పు నుండి తయారుచేస్తారు, దీన్ని చర్మానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. బాదం ఆయిల్లో నేచురల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మంను తేమగా, మాయిశ్చరైజింగ్ గా మార్చుతుంది. బాదం ఆయిల్ డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మానికి రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే ముడతలను మాయం చేస్తుంది.

శ్యాండిల్ ఉడ్ ఆయిల్ :

గందం నూనెలో అద్బుతమైన ప్రయోజనాలున్నాయి. క్యాన్సర్ నివారించే గుణాలు కూడా అధికమే, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది చర్మంను రిలాక్స్ చేస్తుంది. మరియు స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. మైల్డ్ మరియు ప్లీసెంట్ ఫ్రాగ్రెన్స్ ను అందిస్తుంది.

English summary

10 Body Massage Oils To Rejuvenate Your Mind & Body

If you are planning on relaxing yourself and want to rejuvenate your senses, we bring 10 body massage oils that could do the trick for you. Take a look.
Please Wait while comments are loading...
Subscribe Newsletter