For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ రాషెస్ ను మాయం చేసే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

|

ఛాతిక్రింద రాషెష్ ఏర్పడటం సాధారణ సమస్య. ఇది చాలా వరకూ చర్మం ముడుతలు పడటం వల్ల చర్మం ముడతులు పడిన ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్ కు గురై, రాషెష్ ఏర్పుడుతాయి. బ్రెస్ట్ రాషెష్ కు అత్యంత ముఖ్యమైన కారణం, ముడుతలు పడిన ప్రదేశంలో చెమట ఎక్కువగా పట్టడం, వేడి, సరిగా గాలితోలకపోవడం మరియు బిగుతుగా ఉండే బ్రాలు ధరించడం, బ్రెస్ట్ వద్ద రాసుకోవడం వల్ల రాషెష్ ఏర్పడుతాయి.

అంతే కాదు, వాతావరణంలో వేడి మరియు ఊబకాయం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇలాంటి సమయంలో ఆ ప్రదేశంలో ఈస్ట్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్, వాతావరణ ప్రభావం వల్ల జర్మ్స్ పెరుగుతాయి. కొన్ని సార్లు, అలర్జీ వల్ల కూడా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. టైట్ బ్రాలు ధరించడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం, రఫ్ గా ఉన్న దుస్తులు ధరించడం ఇవన్నీ కూడా బ్రెస్ట్ రాషెస్ కు కారణమవుతుంది. దీని వల్ల ఆ ప్రదేశంలో రెడ్ ప్యాచెస్, మంటగా ఉండటం, దురదపెట్టడం, పొడిభారడం మరియు ఎక్కువ అసౌకర్యంగా ఉంటుంది. బ్రెస్ట్ క్రింద బాగంలో రాషెస్ కు కారణాలు తెలుసుకున్నారు కదా?

ఈ సమస్య నుండి బయటపడాలంటే కొన్ని సింపుల్ నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ సమస్యల నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా చాతీక్రింద ఉండే రాషెష్ ను తగ్గించడానికి 10 ఉత్తమ మార్గాలున్నాయి.

1. కొబ్బరి నూనె:

1. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్స్ ఉన్నందు వల్ల పవర్ఫుల్ గా పనిచేస్తుంది, ఇది ఫంగస్ ను నివారిస్తుంది. స్కిన్ రాషెస్ తగ్గించి ఆ ప్రదేశంలో స్కిన్ స్మూత్ గా మార్చుతుంది.

కావల్సినవి:

కొబ్బరి నూనె: 1టేబుల్ స్పూన్ , కాటన్ బాల్స్ : కొన్ని

ఎలా పనిచేస్తుంది: కొబ్బరినూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి,అందులో కాటన్ బాల్ డిప్ చేసి ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి, రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2.అలోవెర:

2.అలోవెర:

ఇది పురాత కాలం నుండి ఉపయోగిస్తున్న హోం రెమెడీస్. బ్రెస్ట్ క్రింద ఏర్పడ్డ రాషెస్ ను నివారిస్తుంది.యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఫంగల్ ప్రొపర్టీస్ ను నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేయడం మాత్రమే కాదు, స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

కావల్సినవి:

అలోవెర జెల్ : 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ : 5 టేబుల్ స్పూన్స్

ఎలా పనిచేస్తుంది: అలోవెర జెన్ మరియు ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి, అందులో కాటన్ బాల్ డిప్ చేసి ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని, తడి పూర్తిగా తుడిచేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. టీట్రీ ఆయిల్ :

3. టీట్రీ ఆయిల్ :

ఆయుర్వేదిక్ రెమెడీస్ లో టీట్రీ ఆయిల్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది బ్రెస్ట్ క్రింద రాషెస్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కావల్సినవి:

టీట్రీ ఆయిల్ : 5చుక్కలు, ఆలివ్ ఆయిల్ : 1 టేబుల్ స్పూన్ , కొబ్బరి నూనె : 1/2టీస్పూన్

ఎలా పనిచేస్తుంది: పైన సూచించన అన్ని పదార్థాలను మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. స్నానం చేసిన తర్వాత, రాత్రి నిద్రించడానికి ముందు ఈ మిశ్రమాన్ని బ్రెస్ట్ క్రింది బాగంలో అప్లై చేయాలి. ఇది చర్మంలోకి బాగా గ్రహించడం వల్ల ఈ సమస్యను త్వరగా తగ్గుతుంది.

4. తులసి:

4. తులసి:

తులసిలో ఉండే టెర్రిఫినాల్ మరియు లిమెనోన్ వంటి నేచురల్ ఆయిల్స్ సకిన్ రీజనరేట్ ను ప్రోత్సహిస్తుంది, పగుళ్ళను నివారిస్తుంది. దురద తగ్గిస్తుంది

కావల్సినవి: ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకలు, కొద్దిగా రోజ్ వాటర్

ఎలా పనిచేస్తుంది: తులిసి ఆకులను పేస్ట్ చేసి, అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, బ్రెస్ట్ రాషెస్ మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రంగా కడిగి, తడిని పూర్తిగా ఆర్పాలి. ఈ చిట్కాను రోజుకొక్కసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. వెల్లుల్లి:

5. వెల్లుల్లి:

బ్రెస్ట్ రాషెస్ ను నివారించడంలో మరో హోం మేడ్ మాస్క్ వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రాషెస్ ను నయం చేయడం మాత్రమే కాదు, ఇది ఇక ముందు రాషెస్ ఏర్పడకుండా నివారిస్తుంది.

ఎలాపనిచేస్తుంది: రెండు మూడు వెల్లుల్లిరెబ్బలు తీసుకుని పేస్ట్ చేసిన నేరుగా రాషెస్ మీద అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బర్నింగ్ సెన్షేషన్ , స్కిన్ ఇరిటేషన్ ఉన్నట్లైతే వెంటనే చన్నీంటితో శుభ్రం చేసుకోవాలి.

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అసిటిక్ యాసిడ్స్ స్కిన్ బ్యాక్టీరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కావల్సినవి: ఆపిల్ సైడర్ వెనిగర్ 1/2కప్పు, నీళ్ళు : 1కప్పు

ఎలా పనిచేస్తుంది: వెనిగర్ ను వాటర్ లో మిక్స్ చేసి , ఆ వాటర్ ను రాషెస్ మీద అప్లై చేయాలి.

7. చమోమెలీ టీ:

7. చమోమెలీ టీ:

మరో సింపుల్ రెమెడీ . చమోమెలీ టీలో బిసబలల్ , ఫ్లెవనాయిడ్స్ మరియు పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి చాలా వరకూ స్కిన్ డిసీజ్ ను నివారిస్తాయి

ఎలా పనిచేస్తుంది: చామంతి ఆకులు లేదా పువ్వుల రేకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత రూమ్ టెంపరేచర్ లో చల్లారిన తర్వాత కాట్ బాల్ తో ఆనీటిని రాషెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. వెంటనే దురద తగ్గిస్తుంది, బ్రెస్ట్ రాషెస్ నివారిస్తుంది .

పసుపు:

పసుపు:

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి స్కిన్ రాషెస్ ను గ్రేట్ గా నివారిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: ఒక టీస్పూన్ పసుపును గ్లాసు నీటిలో వేసి వేడి చేయాలి. చల్లారిన తర్వత ఈనీటిని బ్రెస్ట్ రాషెస్ మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత కాటన్ తో శుభ్రంగా తుడిచేయాలి.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడాలో ఉండే ఆల్కలైన్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. రాషెస్ ను మాయం చేస్తుంది.

కావల్సినవి: బేకింగ్ సోడ : 1/4కప్పు బేకింగ్ సోడ, వెనిగర్ : 1/2టేబుల్ స్పూన్

ఎలా పనిచేస్తుంది: బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి రాషెస్ మీద అప్లై చేయాలి, అరగంట తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

కార్న్ స్టార్చ్

కార్న్ స్టార్చ్

బ్రెస్ట్ రాషెస్ ను నయం చేయడంలో కార్న్ స్టార్చ్ ఒకటి, ఇది నేచురల్ గా రాషెస్ మాయం చేస్తుంది. కార్న్ స్టార్చ్ అప్లై చేయడం వల్ల దురద, స్కిన్ ఇరిటేషన్, ఇన్ఫెక్షన్, నివారిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: మొదట సోపుతో బ్రెస్ట్ శుభ్రం చేసుకోవాలి. తర్వాత టవల్ తో పూర్తిగా తేమ తుడిచి,. ఆ తర్వాత కార్న్ స్టార్చ్ ను చిలకరించాలి, తేమ మీద వేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. మరో సమస్య మొదలవుతుంది, కాబట్టి పూర్తిగా తేమను తుడిచి వేసుకోవాలి,

English summary

10 Home Remedies To Treat Rashes Under Breast

Bacteria is just about anywhere, and its special hot spot to set shop is between the folds of your skin. Check. If you find a scaly red sweat patch accompanied by painful blisters under your breasts, then you have the suspected breast rashes. And it is the last area you want to get toxic chemicals on. What you need is safe, natural and effective home remedies to treat rashes under breasts.
Desktop Bottom Promotion