సౌందర్యవంతులుగా మారడానికి ఆలివ్ ఆయిల్ చెప్పే రహస్యాలు..!

Subscribe to Boldsky

పాదాల పగుళ్లు మొదలుకుని, గోళ్ళను స్ట్రాంగ్ గా మార్చే వరకూ ఆలివ్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ రెమెడీ.

క్రమం తప్పకుండా ఆలివ్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేస్తుంటే, ఖచ్ఛితంగా ఇప్పటికే మీ స్కిన్ స్ట్రక్చర్ లో తప్పనిసరిగా మార్పులు కనబడుతాయి. అందానికి ఉపయోగించే ఆలివ్ ఆయిల్లో బ్యూటీ బెనిఫిట్స్ చాల ఉన్నాయి!

ఆలివ్ ఆయిల్ మీ రెగ్యులర్ బ్యూటి కేర్ లో లేదంటే ఖచ్చితంగా అందానికి సంబంధించిన ప్రయోజనాలను చాలానే కోల్పోతున్నారు! ఆలివ్ ఆయిల్ ను నేరుగా చర్మానికి అప్లై చేసినా, లేదా ఇతర సౌందర్య ఉత్పత్తులతో మిక్స్ చేసి అప్లై చేసినా, నేరుగా చర్మంలోకి గ్రహించి అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది.!

ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మ సమస్యలను నయం చేస్తుంది. స్కిన్ డ్యామేజ్ ను రిపేర్ చేస్తుంది. చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది.

అంతే కాదు, ఆలివ్ ఆయిల్లో జింక్, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్ లు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. డెడ్ స్కిన్ క్లియర్ చేస్తుంది. చర్మరంద్రాలు తెరచుకునేలా చేసి, కొత్తగా చర్మ కణాలు పునర్జీవంపచేస్తుంది. ఆలివ్ ఆయిల్లో విటమిన్ బి పుష్కలంగా ఉంది, ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ ను ఎలా ఉపయోగిస్తే చర్మం గార్జియస్ గా మారుతుందో తెలుసుకుందాం..

మాయిశ్చరైజింగ్ మాస్క్

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూన్ తేనె, మరియు ఒక టీస్పూన్ పాల క్రీమ్ మిక్స్ చేయాలి. ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గోళ్ళు పెరగడాన్ని మెరుగుపరుస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను లైట్ గా గోరువెచ్చగా చేసి, కాటన్ డిప్ చేసి, నెయిల్ కు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉండనిచ్చి, ఉదయం క్లీన్ చేసుకుంటే, త్వరగా , మంచి ఆకారంలో గోళ్ళు పెరుగుతాయి.

డ్రై స్కిన్ రెమెడీ:

స్నానం చేసిన వెంటనే కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను , ఆలివ్ ఆయిల్ కు మిక్స్ చేసి, చర్మానికి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. ఎక్కువగా అప్లై చేయకూడదు. కొద్దిగా మాత్రమే అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ సాప్ట్ గా మారుతుంది

డిటాక్స్ బాత్:

స్నానం చేసే నీటిలో 5 చుక్కల ఆలివ్ ఆయిల్, 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. 15నిముషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఈ సింపుల్ బ్యూటీ టిప్ వల్ల చర్మం బేబీ సాప్ట్ స్కిన్ గా మారుతుంది. చర్మం రేడియంట్ గా మారుతుంది!

బాడీ లోషన్ :

డ్రైస్కిన్ సమస్య అధికంగా ఉంటే, చర్మానికి తగినంత న్యూట్రీషియన్స్ అందివాలని కోరుకుంటే, ఈ సింపుల్ ట్రిక్ ప్రయత్నించండి, కొన్ని చుక్కల ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని బాడీ లోషన్ లాగే రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మేకప్ రిమూవర్:

కాటన్ పాడ్ కు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ తీసుకుని ముఖానికి అప్లై చేసి, సున్నితంగా తుడిచేస్తే మేకప్ తొలగిపోతుంది. ఫ్రెష్ కాటన్ ప్యాడ్ తీసుకుని, మేకప్ పూర్తిగా తొలగిపోయే వరకూ తిరిగి ఇలానే చేయాలి.!

బాడీ స్ర్కబ్ :

రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని, అందులో అదే క్వాంటిటి సీసాల్ట్ మిక్స్ చేయాలి. దీన్ని బాడీ మొత్తానికి అప్లై చేసి, సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 10 నిముషాలు అలా చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ ఆలివ్ ఆయిల్ ను వారానికొకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

పాదాల పగుళ్ళను నివారిస్తుంది.

కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను పెట్రోలియం జెల్లీలో మిక్స్ చేయాలి. దీన్ని పగిలిన పాదాలకు అప్లై చేసి,మసాజ్ చేయాలి. తర్వాత కాటన్ సాక్స్ లు వేసుకుని, రాత్రంతా అలాగే ఉండనిచ్చి, ఉదయం క్లీన్ చేసుకోవాలి.

English summary

Amazingly Easy Ways To Use Olive Oil For A Gorgeous You!

Olive oil contains a good amount of vitamin E, which makes for a powerful antioxidant that can heal, repair and hydrate your skin. Not just that, it contains a high quotient of minerals like zinc, magnesium, sulphur and iron, which protects the skin against free radicals, clears out dead skin cells, unclogs pores and promotes the regeneration of new skin cells.
Please Wait while comments are loading...
Subscribe Newsletter