For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాచి, గార పట్టి.. అసహ్యంగా మారిన పళ్లను తెల్లగా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ..!!

రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి.

By Swathi
|

ముఖానికి అందం చిరునవ్వు... చిరునవ్వుకి ఆకర్షణ మెరిసే పళ్లు. అందంగా కనిపించాలన్నా.. ఆకట్టుకునేలా నవ్వాలన్నా.. పళ్ల వరుస ఎట్రాక్టివ్ గా ఉండాలి. మిళమిళ మెరిసే తెల్లటి పళ్లు ఉండాలి. నలుగురిలో హాయిగా నవ్వడానికి.. ఆకర్షణీయంగా కనపడటానికి పళ్ల పాత్ర చాలానే ఉంది. కాబట్టి పళ్లు అందంగా.. ఎట్రాక్టివ్ గా.. ఉండాలి.

 2-Ingredient Paste

రోజూ బ్రష్ చేసినా.. కొంతమందికి పళ్లు పచ్చగా.. అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి ఆల్కహాల్, స్మోకింగ్ కారణంగా పళ్లు గారపట్టింటాయి. గారపట్టిన పళ్ల వల్ల నలుగురిలో హాయిగా నవ్వలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. గారపోగొట్టుకోవడానికి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా కొంతమందికి పచ్చగానే కనిపిస్తూ ఉంటాయి.

న్యాచురల్ పదార్థాలు పళ్లను తెల్లగా మారుస్తాయి. వాటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ ఫలితాలను ఇస్తుంది. బేకింగ్ సోడాతో పళ్లను స్క్రబ్ చేస్తే.. కలర్ ని మారుస్తారు. అలాగే అల్కలైన్ పీహెచ్ లెవెల్స్ ని పళ్లపై బ్యాలెన్స్ చేస్తాయి. ఇక నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల పాచిని తొలిగిస్తుంది. మరి బేకింగ్ సోడా, నిమ్మరసంతో పళ్లను తెల్లగా మార్చడానికి ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం..

స్టెప్ 1

స్టెప్ 1

పావు టీస్పూన్ బేకింగ్ సోడాని ఒక గిన్నెలో తీసుకోవాలి. బేకింగ్ సోడాలో ఉండే క్రిస్టల్స్, యాసిడ్ పళ్లపై ఎనామిల్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి.. దీన్ని అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు.

స్టెప్ 2

స్టెప్ 2

5 చుక్కల నిమ్మరసంను బేకింగ్ సోడాలో కలిపి.. ఫోర్క్ తో బాగా కలపాలి. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. నిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల నోట్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

1 స్ట్రాబెర్రీ గుజ్జుని ఈ మిశ్రమంలో కలపాలి. స్ట్రాబెర్రీలో ఉండే న్యాచురల్ ఎంజైమ్ ని మాలిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఇది పళ్లను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అన్ని పదార్థాలూ మిక్స్ చేస్తే.. రెడ్ పప్లీ పేస్ట్ తయారవుతుంది.

స్టెప్ 4

స్టెప్ 4

ముందుగా నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముందు పళ్లపై ఏదైనా తడి ఉంటే.. తుడిచేయాలి. టిష్యూ లేదా క్లాత్ తో తుడిచేసుకోవాలి.

స్టెప్ 5

స్టెప్ 5

పాత బ్రష్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పళ్లకు అప్లై చేయాలి. 5 నిమిషాలు వదిలేయాలి. ఇది మంచి బ్యాక్టీరియాకి ఏమాత్రం హాని చేయదు.

స్టెప్ 6

స్టెప్ 6

తర్వాత, గుండ్రంగా ఒక నిమిషంపాటు పళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత నోట్లో గోరువెచ్చటి నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఈ రెమెడీని వారానికి రెండుసార్లు పడుకునే ముందు అప్లై చేయాలి.

మరో టిప్ - స్టెప్ 1

మరో టిప్ - స్టెప్ 1

మీరు చాలా బిజీగా ఉంటే.. సింపుల్ గా ఈ టిప్ ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను ఒక కప్పులో తీసుకోవాలి. కొబ్బరినూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ పళ్లపై బ్యాక్టీరియాని తొలగిస్తుంది.

స్టెప్ 2

స్టెప్ 2

ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం కుడి నుంచి ఎడమ వైపుకి అప్లై చేయాలి. తర్వాత బయటకు ఉమ్మేయండి. గోరువెచ్చని నీటితో నోరు పుక్కిలించాలి. ఈ టేస్ట్ మీకు నచ్చకపోతే.. రెమెడీ ట్రై చేసిన తర్వాత 1 లేదా రెండు తులసి ఆకులను నమిలితే.. తాజాగా అనిపిస్తుంది.

English summary

Apply This 2-Ingredient Paste On Yellow Teeth & Say Hello To Pearly White Teeth!

Apply This 2-Ingredient Paste On Yellow Teeth & Say Hello To Pearly White Teeth. Quick, easy and safe way to whiten your teeth!
Story first published: Saturday, December 10, 2016, 11:02 [IST]
Desktop Bottom Promotion