For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పాదాల సంరక్షణపై ఓ లుక్కేయడం మరవకండి..!

By Swathi
|

వర్షం ఎప్పుడు పడుతుందో.. ఎప్పుడు ఎండ వస్తుందో తెలియని విధంగా ఉంటుంది వర్షాకాలం. మబ్బులు కమ్ముక్కొస్తూ.. ఉన్నట్టుండి వర్షాలు పడిపోతాయి. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవాళ్లు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ.. ఇతర సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి.

వీధులన్నీ వర్షపు నీటితో నిండినప్పుడు వర్షంలోనే నడవాల్సి రావడం కాస్త ఇబ్బందికరమైనది. ఇలా చేయడం వల్ల పాదాల ఆరోగ్యం, ఆకర్షణపై దుష్ర్పభావం చూపుతుంది. మాయిశ్చరైజర్ తగ్గిపోవడం, గాలిలో హ్యుమిడిటీ పెరగడం వల్ల.. పాదాలకు చాలా సమస్యలు ఎదురవుతాయి.

ఈ సమయంలో ఎక్కువగా ఫంగల్, ఇన్ఫెక్షన్స్ పాదాలకు సోకే ప్రమాదం ఉంటుంది. వర్షాకాలంలో పాదాల్లో హానికారక బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయని నిపుణులు చెబుతారు. కాబట్టి ముఖ్యంగా పాదాలను వర్షాకాలంలో చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి వర్షాకాలంలో పాదాల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇఫ్పుడు చూద్దాం..

ఎప్పుడూ శుభ్రంగా

ఎప్పుడూ శుభ్రంగా

కనీసం రోజుకి రెండుసార్లు పాదాలు శుభ్రం చేసుకోవాలి. ఇన్ఫెక్షన్స్, ఫంగస్ దరిచేరకుండా జాగ్రత్తపడాలి. సరైన విధంగా శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలు స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారతాయి.

ఓపెన్ ఫుట్ వేర్

ఓపెన్ ఫుట్ వేర్

వర్షాకాలంలో ఓపెన్ ఫుట్ వేర్ ఎంచుకోవాలి. పాదాలు కప్పి ఉండే చెప్పులు, షూ ధరించడం వల్ల.. చర్మానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి.. కాస్త గాలి తగిలేలా ఉండే చెప్పులు ధరించాలి.

ఎక్స్ ఫోలియేట్

ఎక్స్ ఫోలియేట్

రెగ్యులర్ గా పాదాలను ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల.. మంచి ఫలితం ఉంటుంది. స్క్రబ్బింగ్ ప్యాడ్ లేదా ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి.. పాదాలను రోజూ శుభ్రం చేసుకోవాలి. అలాగే పాదాలపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకోకుండా.. హెల్తీ ఫూట్ పొందేలా జాగ్రత్త పడాలి.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

పాదాలను ఎప్పుడూ మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవడం వల్ల.. పాదాల చర్మం, పగలకుండా ఉంటుంది. స్నానం చేసిన వెంటనే, రాత్రి పడుకోవడానికి ముందు రెండుసార్లు లైట్ మాయిశ్చరైజర్ పాదాలకు రాసుకోవాలి.

పెడిక్యూర్

పెడిక్యూర్

పార్లర్ కి వెళ్లినా సరే, ఇంట్లోనే అయినా సరే పాదాలపై శ్రద్ధ తీసుకోవాలి. పాదాల్లో అన్ని భాగాల్లో పేరుకున్న మురికి తొలగించడానికి పెడిక్యూర్ కంపల్సరీ చేయించుకోవాలి. అలాగే తరచుగా ఇంట్లోనే పాదాలను ఉప్పు నీటిలో నానబెడుతూ ఉండాలి.

టాల్కమ్ పౌడర్

టాల్కమ్ పౌడర్

వర్షాకాలంలో పాదాలను స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంచుకోవడానికి ఇదో సింపుల్ ట్రిక్. పాదాలు దుర్వాసన రాకుండా, ఆయిలీగా మారకుండా నివారించడానికి టాల్కమ్ పౌడర్ అప్లై చేయడం మంచిది.

ఫుట్ వేర్ శుభ్రత

ఫుట్ వేర్ శుభ్రత

ఫుట్ వేర్ దుమ్ము, ధూళితో కూడి ఉంటే.. వర్షాకాలంలో బ్యాక్టీరియా, క్రిములను ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి.. పాదరక్షలు శుభ్రంగా, డ్రైగా ఉండేలా జాగ్రత్త పడాలి.

English summary

Simple Tips To Take Care Of Feet During Monsoon

Simple Tips To Take Care Of Feet During Monsoon. Monsoon has officially arrived and has given us the much-required relief from the scorching heat.
Story first published:Tuesday, June 28, 2016, 12:25 [IST]
Desktop Bottom Promotion