For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు, చర్మానికి బాదం ఆయిల్..!! అద్భుతమైన ప్రయోజనాలు..!

బాదం ఆయిల్ లోని ప్రయోజనాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. అయితే బాదం ఆయిల్ కు రెగ్యులర్ ఆయిల్ ను మిక్స్ చేసి స్కిన్, హెయిర్ కు అప్లై చేయడం వల్ల రిజల్ట్ డబుల్..

|

బాదం నూనె గురించి అందిరికీ తెలిసిన విషయమే. ఇందులో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. బాదం నూనెను బ్యూటిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీని రెట్టింపు చేసే గుణాలు బాదం నూనెలో గొప్పగా ఉన్నాయి. అందువల్ల ఈ నూనెకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ముఖ్యంగా మహిళలు ఆ ఆయిల్ ను బ్యూటిని మెరుగుపరుచుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

చర్మ సంరక్షణ కోసం ఎన్నో బ్యూటీ క్రీములు, జుట్టుకోసం అనేక ప్రోడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే వీటన్నింటిని కెమికల్స్ తో తయారుచేయడం మాత్రమే కాదు, మీ పర్స్ ను కాలీ చేస్తుంది. కాబట్టి, వీటన్నింటికి ప్రత్యామ్నాయంగా బాదం ఆయిల్ ను ఉపయోగించడం మంచిది.

10 Amazing Benefits Of Almond Oil For Skin And Hair

ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా స్కిన్ అండ్ హెయిర్ ప్రొబ్లమ్స్ ను నివారిస్తుంది. ముఖ్యంగా చర్మంలో మొటిమలు, మచ్చలు, చుండ్రు, డార్క్ సర్కిల్స్, చిట్లిన జుట్టును నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నేచురల్ ాయిల్ ను రెగ్యులర్ బ్యూటీని మెరుగుపరచుకోవడంలో ఉపయోగించడం వల్ల తప్పనిసరిగా మార్పును మీరే గమనిస్తారు.

ఆల్మండ్ ఆయిల్, పాల మిశ్రమాన్ని జుట్టుకి పట్టిస్తే పొందే బెన్ఫిట్స్

అయితే ఆ అద్భుతమైన మార్పులేంటో, బాదం ఆయిల్ లోని ప్రయోజనాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. అయితే బాదం ఆయిల్ కు రెగ్యులర్ ఆయిల్ ను మిక్స్ చేసి స్కిన్, హెయిర్ కు అప్లై చేయడం వల్ల రిజల్ట్ మరింత డబుల్ గా ఉంటుంది . ఆలస్యం చేయకుండా అదెలాగో తెలుసుకుందాం..

డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది:

డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది:

బాదం ఆయిల్లో ఉండే స్మూతింగ్ ఎఫెక్ట్ కళ్ల క్రింద నల్లటి వలయాలను నివారిస్తుంది. కళ్ల ఉబ్బు తగ్గిస్తుంది. బాదం ఆయిల్ తీసుకుని, కాటన్ డిప్ చేసి, కళ్ల క్రింద వలయాల మీద అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఆ మ్యాజికల్ రిజల్ట్ ఏంటో మీరే గమనిస్తారు.

ముడుతలను, చారలను తగ్గిస్తుంది

ముడుతలను, చారలను తగ్గిస్తుంది

బాదం నూనెలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, ఇది ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ముఖ్యంగా వయస్సును తెలిపే ముడుతలను, ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది. దీనికి తేనె మిక్స్ చేసి అప్లై చేయాలి.

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది

ఈ పర్టిక్యులర్ నేచురల్ ఆయిల్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మం క్రింది బాగంలో లోపలి బాగంలో ఉన్న డెడ్ స్కిన్ నివారిస్తుంది. అలాగే బ్రేక్ అవుట్స్ ను , మచ్చలను తొలగిస్తుంది.

మలినాలను మరియు మురికిని తొలగిస్తుంది

మలినాలను మరియు మురికిని తొలగిస్తుంది

బాదం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాల్లో దాగున్న మురికిని తొలగిస్తుంది. మరియు ఇతర స్కిన్ సమస్యలను నివారిస్తుంది.

 ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది

ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది

బాదం నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. డ్రై స్కిన్ ఉన్నవారు, బాదం నూనెను వారంలో రెండు సార్లు ఈ నూనెను అప్లై చేస్తే చాలు, చర్మం సాప్ట్ గా మారుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

బాదం ఆయిల్ జుట్టు రాలడం తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మరియు హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. ఈ బాదం ఆయిల్ ను వారంలో ఒకసారి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు స్రాంగ్ గా...ఒత్తుగా పెరుగుతుంది.

చుండ్రును నివారిస్తుంది

చుండ్రును నివారిస్తుంది

బాదం నూనె జుట్టు కావల్సిన పోషణను అందిస్తుంది , చుండ్రు నివారిస్తుంది. సాధారణ జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. సాధారణంగా వచ్చే జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం నిమ్మరసంను కూడా బాదం ఆయిల్ తో మిక్స్ చేసి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

జుట్టు చిట్లకుండా నివారిస్తుంది:

ఈ నూనెను జుట్టు చివర్ల వరకూ అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా నివారిస్తుంది. ఈ నేచురల్ ఆయిల్ ను వారంలో ఒకసారి అప్లై చేస్తే చాలు జుట్టు చిట్లడం తగ్గుతుంది.

జుట్టు వాల్యూమ్ పెరుగుతుంది

జుట్టు వాల్యూమ్ పెరుగుతుంది

మంచి ఒత్తైన , కాంతివంతమైన జుట్టును మీరు పొందాలంటే, మీ జుట్టుకు బాదం నూనెను అప్లై చేయాలి. బాదం ఆయిల్లో ఉండే గుణాలు జుట్టు రాలడం తగ్గిస్తుంది.

కండీషనర్ గా పనిచేస్తుంది :

కండీషనర్ గా పనిచేస్తుంది :

బాదం ఆయిల్లో ఉండే ప్రోటీన్స్ జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. బాదం ఆయిల్ ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా జుట్టుకు ఎక్కువ ఉపయోగించడం వల్ల ఇందులోని న్యూట్రీషియన్ గుణాలు హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.

English summary

10 Amazing Benefits Of Almond Oil For Skin And Hair

Almond oil is a powerhouse of nutrients and vitamin E that can significantly improve the health and appearance of your skin and tresses. That is why, it is used extensively by women all around the world for treating skin and hair-related problems.
Desktop Bottom Promotion