For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని, తొడల వద్ద భయంకరమైన దద్దుర్లను నివారించే హెర్బల్ రెమెడీస్ ..!

శరీరంలో కొన్ని ప్రదేశాల్లో గాలి, ఎండ తగలకు స్కిన్ రాషెస్ కు కారణం అవుతుంది. స్కిన్ రాషెస్ మాత్రమే కాదు, ఆ ప్రదేశంలో దురద, చిన్న చిన్న గుల్లలవంటివి నొప్పికి గురిచేస్తాయి.

By Lekhaka
|

శరీరంలో కొన్ని ప్రదేశాల్లో గాలి, ఎండ తగలకు స్కిన్ రాషెస్ కు కారణం అవుతుంది. స్కిన్ రాషెస్ మాత్రమే కాదు, ఆ ప్రదేశంలో దురద, చిన్న చిన్న గుల్లలవంటివి నొప్పికి గురిచేస్తాయి. ఆ ప్రదేశంలో ఏమాత్రం గోళ్ళు తగిలినా, గోళ్లలో స్ర్కబ్ చేసినా రాషెస్ భయంకరంగా మారుతాయి. కొన్ని సందర్బాల్లో గోకడం వల్ల రక్తం కూడా వస్తుంది. ఇటువంటి స్కిన్ రాషెస్ ఉన్నవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. సమస్య తక్కువగా ఉన్నప్పుడు కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది.

Herbal Remedies For Groin Rash!

మొదటి ఇటువంటి భయంకరమైన దద్దుర్లు ఏప్రదేశంలో వచ్చాయి, లక్షణాలు ఎలా ఉన్నాయని గుర్తించాలి. దురద, మంట పెట్టడం , లైట్ రక్తస్రావం వంటి లక్షణాలు ఉన్నయేమో గమనించాలి?

ఇటువంటి లక్షణాలున్నప్పుడు వెంటనే డాక్టర్ ను కలిసి మందులు తీసుకోవడం మంచిది. సమస్య చిన్నదైతే ఇంట్లోనే కొన్ని హోం మేడ్ రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు. వీటితో ఖచ్చితంగా మార్పు కనబడుతుంది.!

బహుమూలల్లో గజ్జల్లో దురద, దద్దుర్లు వస్తుంటాయి? వీటికి కారణం ఓవర్ వెయిట్, టైట్ గా ఉండే అండర్ వేర్స్ వేసుకోవడం, ఎక్కువ చెమటలు పెట్టడం, పర్సనల్ హైజిన్ లేకపోవడం, వ్యాధినిరోధకత లోపం వల్ల రాషెస్ కనబడుతాయి.

అందుకు ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితి కంటిన్యుగా వస్తుంటే, మీ వ్యక్తిగత వస్తువులు (బ్రాలు, అండర్ వేర్స్ ఇతరులు వేసుకోకుండా) జాగ్రత్త పడాలి. అలాగే వదలుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించాలి. ఆ ప్రదేశంలో తడిలేకుండా ఎప్పుడూ డ్రైగా ఉంచుకోవాలి.

ఇటువంటి భయంకరమైన దద్దుర్లను నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

టీట్రీ ఆయిల్

టీట్రీ ఆయిల్

టీట్రీ ఆయిల్లో నేచురల్ యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టీట్రీ ఆయిల్ దురదను నివారిస్తుంది. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మూడు చుక్కల టీట్రీ ఆయిల్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. కాటన్ బాల్ తీసుకుని ఈ నూనెలో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. చర్మంలోనికి డీప్ గా అబ్సార్బ్ అయ్యే వరకూ అప్లై చేయాలి. ఈ రెమెడీని రోజుకు రెండు సార్లు ఫాలో అయితే, లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి.

అలోవెర

అలోవెర

కలబందలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అలోవెర ను తీసుకుని చివర్లు కట్ చేసి, లోపల ఉన్న జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. దీన్ని రిఫ్రిజరేటర్లో పెట్టాలి. చల్లగా మారిన తర్వాత బయటకు తీసి, దద్దుర్లున్న ప్రదేశంలో అప్లై చేసి, మసాజ్ చేయాలి. చర్మంలోకి బాగా షోషింపబడేవరకూ అప్లై చేయాలి. ఇలా రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే త్వరగా నయం అవుతుంది.

తేనె

తేనె

తేనెలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రాషెస్ ను తగ్గించడం మాత్రమే కాదు, బ్లిస్టర్స్ ను స్మూత్ గా మార్చుతుంది. చర్మంలో దద్దుర్లు త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది.

తేనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తర్వాత పొడి బట్టతో తేమలేకుండా తుడవాలి. ఇలా రోజుకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది గ్రోయిన్ రాషెస్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. 5, 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని అరకప్పు ఆలివ్ ఆయిల్లో వేసి వేడి చేయాలి. 5 నిముషాలు వేడి చేసిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. తర్వాత వడగట్టి, రాషెస్ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు అప్లై చేస్తుంటే గజ్జల్లో దద్దుర్లును ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

వెనిగర్

వెనిగర్

వెనిగర్ లో ఉండే అసిడిక్ నేచర్ రాషెస్ ను డ్రైగా మార్చుతుంది. స్కిన్ కు ఏ మాత్రం ఇరిటేషన్ కలగించదు. ఒక పార్ట్ వెనిగర్ ను నాలుగు బాగాల నీళ్ళు మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసి, ఈ నీటితో మొటిమలున్న ప్రదేశంను శుభ్రం చేసుకోవాలి.ఈ నీటితో కడిగిన తర్వాత తిరిగి వేరే నీళ్ళతో కడగకూదు. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆల్కహాల్ ను అప్లై చేయాలి

ఆల్కహాల్ ను అప్లై చేయాలి

ఆల్కహాల్ స్ట్రాంగ్ డ్రైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, ఇది రాషెస్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు, మైక్రోబ్స్ ను నాశనం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఆల్కహాల్లో కాటన్ బాల్ ను డిప్ చేసి స్కిన్ రాషెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. త్వరగా డ్రైగా మారుతుంది. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే రాషెస్ లక్షణాలు తొలగిపోతాయి. !

English summary

Herbal Remedies For Groin Rash!

Is the area down there itchy, red with painful small bumps? Then youhave the dreaded groin rashes, which is why we have curated these herbalremedies.
Desktop Bottom Promotion