For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు మరియు చర్మానికి బీర్..!! ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు..?

బీర్ ఆరోగ్యానికే కాకూండా చర్మం మరియు జుట్టు సమస్యలకు చాలా ప్రయోజనకారిగా ఉంటుందని నిరూపణ జరిగింది. చర్మం మరియు జుట్టు సమస్యలకు బీర్ ని ఎలా ఉపయోగించాలో ఈ వ్యాసంలో చెప్పుతున్నాం.

By Lekhaka
|

ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే పానీయాలలో బీర్ ఒకటి. కొంత మంది వేడి బీర్ ను,మరి కొంత మంది చల్లని బీర్ ని ఇష్టపడతారు. బీర్ ను సమయోచితంగా చర్మం మరియు జుట్టు సమస్యలకు ఉపయోగిస్తే చాలా ప్రయోజకరిగా ఉంటుంది.

బీర్ త్రాగే వారి ప్రకారం,తగు మోతాదులో బీర్ త్రాగితే శక్తిని పెంచటానికి సహాయపడటమే కాకూండా ఒక రిఫ్రెష్ పానీయం గా కూడా పనిచేస్తుంది.

బీర్ త్రాగితే గొప్ప ప్రయోజనాలే పొందవచ్చు

బీర్ ఆరోగ్యానికే కాకూండా చర్మం మరియు జుట్టు సమస్యలకు చాలా ప్రయోజనకారిగా ఉంటుందని నిరూపణ జరిగింది. చర్మం మరియు జుట్టు సమస్యలకు బీర్ ని ఎలా ఉపయోగించాలో ఈ వ్యాసంలో చెప్పుతున్నాం.

 How Beer Benefits Your Skin And Hair

కాబట్టి, చర్మం మరియు జుట్టు మీద బీర్ ని ఉపయోగించే మార్గాల గురించి ఈ వ్యాసాన్ని చదవండి. ఈ వ్యాసంలో జుట్టు మరియు చర్మానికి గల ప్రయోజనాలు ఉన్నాయి.

మృదువైన మరియు ప్రకాశించే చర్మం కోసం

మృదువైన మరియు ప్రకాశించే చర్మం కోసం

బీర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన పేస్ మాస్క్ లకు బాగా సహాయపడుతుంది. బీర్ లో ఉండే విటమిన్-బి,ప్రోటీన్స్ నిస్తేజంగా,పొడిగా మారిన చర్మానికి బాగా సహాయపడుతుంది. ఒక బౌల్ లో గుడ్డు తెల్ల సొన,కొన్ని చుక్కల బాదాం నూనె, 2 నుంచి 5 స్పూన్ల బీర్ ని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.

చర్మ ఎక్స్ ఫ్లోట్ కు సహాయం

చర్మ ఎక్స్ ఫ్లోట్ కు సహాయం

బీర్ బ్లాక్ హెడ్స్ మరియు అడ్డు పడే రంద్రాల చికిత్సలో సహాయపడి చర్మ ఎక్స్ ఫ్లోట్ కి సహాయపడుతుంది. అందువలన కణ పెరుగుదలను ప్రోత్సహించడం మరియు జుట్టు నుండి మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకోని మెత్తని గుజ్జుగా చేసి దానిలో కొన్ని స్పూన్ల బీర్ కలిపి చర్మానికి రాసి మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.

స్కిన్ టాన్ ని తొలగిస్తుంది

స్కిన్ టాన్ ని తొలగిస్తుంది

వేసవి కాలంలో వచ్చే స్కిన్ టాన్ మరియు ఇతర సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. ఒక బౌల్ లో కొంచెం బీర్, నిమ్మ రసంమరియు బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ స్కిన్ టాన్ మరియు వేసవి సమస్యలను తగ్గించటమే కాక ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

మృదువైన జుట్టు

మృదువైన జుట్టు

మీ జుట్టును వారంలో రెండు సార్లు బీర్ తో ప్రక్షాళన చేస్తే మృదువైన పట్టు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. కొంచెం బీర్ తీసుకోని జుట్టు మూలలను బాగా పట్టించి 15 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు మృదువుగా మరియు నునుపుగా మారటానికి సహాయపడుతుంది.

 జుట్టు స్ట్రైట్ గా ఉండటానికి సహాయపడుతుంది

జుట్టు స్ట్రైట్ గా ఉండటానికి సహాయపడుతుంది

మీకు సహజంగా జుట్టు స్ట్రైట్ మరియు దట్టంగా కావాలంటే బీర్ సహాయపడుతుంది. బీర్ లో సహజ ఎంజైమ్లు మరియు విటమిన్స్ ఉండుట వలన జుట్టు గ్రీవములో చైతన్యం నింపటానికి సహాయపడుతుంది. అంతేకాక జుట్టు దట్టంగా పెరగటానికి సహాయపడుతుంది. బీర్ మరియు నీటిని సమాన బాగాలుగా తీసుకోని బాగా కలిపి జుట్టు మూలాలకు పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.

జిడ్డు సమస్యకు చికిత్స

జిడ్డు సమస్యకు చికిత్స

మీరు తరచుగా జిడ్డు సమస్యతో బాధ పడుతూ ఉంటే బీర్ ని ఉపయోగించండి. బీర్ తల మీద చర్మంపై pH స్థాయి సమతుల్యంనకు సహాయపడుతుంది. అలాగే అధిక చమురు ఉత్పత్తిని నిరోధిస్తుంది. నూనె కారణంగా అడ్డు పడిన రంద్రాలను తెరుచుకొనేలా చేస్తుంది. రెండు స్పూన్ల పాలకు రెండు స్పూన్ల బీర్ కలిపి జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. పాలు, బీర్ లో ఉండే ఆమ్ల సమ్మేళనాల కారణంగా సమస్య తొందరగా తగ్గుతుంది.

కాంతివంతమైన జుట్టు

కాంతివంతమైన జుట్టు

జుట్టు కాంతివంతంగా ఉండటానికి బీర్ చాలా బాగా సహాయపడుతుంది. బీర్ లో ఉండే యాక్టివ్ ఎంజైములు జుట్టును కాంతివంతంగా చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్,బీర్ రెండింటిని సమ పాలలో తీసుకోని దానిలో 2 చుక్కల నిమ్మ ఎస్సేన్షియాల్ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

 అలసిన పాదాల చికిత్సకు సహాయం

అలసిన పాదాల చికిత్సకు సహాయం

ఎక్కువగా నడవటం వలన పాదాలు పొడిగా,నిస్తేజంగా మారి పాదాల పగుళ్ళకు దారి తీస్తుంది. బీర్ ని ఉపయోగిస్తే చర్మం చైతన్యం పొంది పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాల పగుళ్ల చికిత్సకు ఒక టబ్ లో గోరు వెచ్చని నీరు మరియు నిమ్మ రసం,కొంచెం బీర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పాదాలను కొంతసేపు ఉంచాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.

English summary

How Beer Benefits Your Skin And Hair

Beer is one among the most consumed beverages in the world. Some prefer cold beer, while some others prefer hot beer. Not just that, when beer is topically applied onto the skin and hair, it does provide a lot of benefits.
Desktop Bottom Promotion