For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీ అందాన్ని రెట్టింపుచేసే 10 అమేజింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

బ్యూటీ ఎన్హాన్స్ చేసే 10 అమేజింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని రోజూ తినడం వల్ల తల నుండి కాళ్ళ వేళ్ళ వరకూ అద్భుతమైన మార్పులను తీసుకొచ్చి హ్యాపిగా ఫీలయ్యేలా చేస్తా

|

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పైకి ఫేస్ ప్యాక్స్, స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు. అలా చేస్తే ఫలితాలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. అలా జరగకుండా చర్మం ఆరోగ్యంగా ..అందంగా ...కనబడాలంటే అంతర్గతంగా కూడా చర్మానికి కావల్సిన పోషకాలను, న్యూట్రీషియన్స్ ను అందివ్వాలి. అందుకు మనం రెగ్యులర్ గా తినే పండ్లు, కూరగాయలు గ్రేట్ గా సమాయపడుతుంది.

ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, అందాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. ఫ్రెష్ గా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే న్యూట్రీషియన్స్, హెయిర్, స్కిన్, నెయిల్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. అదే విధంగా బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతాయి.

బ్యూటీ ఎన్హాన్స్ చేసే 10 అమేజింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని రోజూ తినడం వల్ల తల నుండి కాళ్ళ వేళ్ళ వరకూ అద్భుతమైన మార్పులను తీసుకొచ్చి హ్యాపిగా ఫీలయ్యేలా చేస్తాయి. మరి అటువంటి హ్యాపీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏంటో తెలుసుకుందాం...

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్స్ లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తాయి. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ తో పాటు, మామిడి పండ్లు, బొప్పాయి వంటి వాటిని కూడా చేర్చుకోవాలి. యూవీ కిరణాల నుండి రక్షణ కల్పించడంలో క్యారెట్స్ గొప్పగా సహాయపడుతాయి. అంతే కాదు ఇవి తలలో చుండ్రు నివారించి, జుట్టు రాలకుండా హెల్ప్ అవుతాయి.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో విటమిన్ సి కనుగొనడం జరిగింది. ఇది చర్మంలో ముడుతలను నివారిస్తుంది. డ్రైనెస్ ను నివారిస్తుంది . స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. దానిమ్మ స్కిన్ టైట్ గా మార్చుతుంది. చర్మంలో కాంతి తీసుకొస్తుంది.ముడుతలను రాకుండా ఆలస్యం చేస్తుంది.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో కూడా విటమిన్ సి అధికం. ఇంకా విటమిన్ ఇ మరియు ఆర్బిటాన్ వంటివి చర్మ రంగును మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడుతాయి. ఈ రెండూ విటమిన్స్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, స్కిన్ టోన్ ను బ్రైట్ గా మార్చుతుంది.

కాలే:

కాలే:

మరో స్కిన్ బ్యూట్రీ న్యూట్రీషియన్ ఫుడ్ కాలే . ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఈ రెండు సూపర్ న్యూట్రీషియన్స్ హానికరమైన ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా చర్మాన్ని రక్షణ కల్పిస్తాయి.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూల్ టో వివిధ రకాల న్యూట్రీషియన్స్ , విటమిన్స్, మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా బీట్ రూట్ తీసుకోవడం వల్ల చర్మంలో మొటిమలు, ఆయిల్ నెస్ ను తగ్గించి, స్కిన్ గ్లో పెంచుతుంది. ఇది హెయిర్ లాస్ నివారిస్తుంది,. ముడుతలను నివారిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. డార్క్ సర్కిల్స్ నివారించబడుతాయి. చర్మంను లైట్ గా మార్చుతాయి.

ద్రాక్ష:

ద్రాక్ష:

ద్రాక్షలో కూడా విటమిన్ సి, ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి. ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు పెరగడానికి సహాయపడుతాయి. ఇంకా మెటబాలిజంను మెరుగుపరుస్తుంది, చర్మం యంగ్ గా, ఫ్రెష్ గా మరియు రేడియంట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. గ్రేప్ సీడ్ ఆయిల్ ను ముఖానికి మర్ధన చేయడం వల్ల చర్మం సాప్ట్ గా మార్చుతుంది. కళ్ళ క్రింద ఉబ్బును తగ్గిస్తుంది. స్కార్స్ నివారిస్తుంది .

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ లో స్కిన్ ఎన్హాసింగ్ న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. చర్మంను తెల్లగా మార్చే లక్షణాలు అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. చర్మాన్ని మాత్రమే కాదు, వీటిని రెగ్యులర్ గా తింటుంటే దంతాలు తెల్లగా మారుతాయి. స్ట్రాబెర్రీ జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో ఆయిల్ నెస్ తగ్గుతుంది. కళ్ళ క్రింద ఉబ్బు తగ్గుతుంది.

గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ :

గ్రేఫ్ ఫ్రూట్ స్కిన్ బ్యూటీని మెరుగుపరచడం మాత్రమే కాదు, ఇది స్లిమ్ గా , బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రేప్ ఫ్రూట్ లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల మెటబాలిజం రేటును గ్రేట్ గా పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఆకలి తగ్గిస్తుంది, ఫ్యాట్ కరిగిస్తుంది.

అరటిపండ్లు :

అరటిపండ్లు :

పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, బి12 మరియ ఇలు అధికం. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల కళ్ళ డ్రైనెస్ తగ్గుతుంది. చర్మంను, జుట్టును సాప్ట్ గా మార్చుతుంది. అరటిపండు గుజ్జు, లేదా తొక్కతో ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో మొటిమలు తగ్గి, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో విటమిన్ బి, సి, ఇ, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మరియు ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఆకుకూరల్లో ఉండే లూటిన్ కళ్ళు మెరిసేట్లు , కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

English summary

Top 10 Fruits and Vegetables that can Make You Look Beautiful

Check out the list of 10 fruits and vegetables that will make you look and feel beautiful from head to toe. Happy eating!
Desktop Bottom Promotion