For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘చుండ్రా’.. తరిమికొట్టండిలా..!!

|

Dandruff
అత్యధిక మంది యువతను బాధిస్తున్న సమస్య 'చుండ్రు'.. ఈ ప్రభావం కారణంగానే వెంట్రుకలు తెల్లబడటం, బలహీనపడి ఊడిపోవటం జరుగుతుంది.. షాంపూలు వాడుతున్నప్పటికి చుండ్రు నుంచి ఉపశమపనం కొంత మేరే లభిస్తుంది.

ప్రకృతిలో మనకు లభ్యమవుతున్న సహజసిద్ధమైన ఔషుధ వనరులు ఎటువంటి దుషప్రభావం కలిగించకుండా సత్ఫలితాన్నిస్తాయి. చుండ్రు నివారణకు పలు ప్రకృతి చిట్కాలు మీ కోసం.. కప్పు నీటిలో అర చెంచా నిమ్మరసం కలిపి తలకు పట్టించండి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే నిదానంగా చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.

కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు దిట్టంగా పెట్టి మాలిష్ చేసుకోండి. కొంత సమయం జుట్టునారనిచ్చి తల స్నానం చేస్తే మీ తలకు పట్టిన చుండ్రు మటుమాయం. గోరు వెచ్చగా వేడి చేసిన కొబ్బరి నీటిలో, ఒక చెంచా నువ్వుల నూనె, ఒక వెల్లులి పాయ కలిపి, ఆ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు మటుమాయమవటంతో పాటు వెంట్రుకలు ధృడపడతాయి.

English summary

How to Cure Dandruff Naturally | ‘చుండ్రా’.. తరిమికొట్టండిలా..!!

Dandruff is an annoying skin disorder of the scalp that causes itching. An itchy scalp itself is annoying enough, but when you itch, you dislodge those dreaded white flakes.
Story first published:Sunday, August 21, 2011, 17:04 [IST]
Desktop Bottom Promotion