For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మూడింటితో జుట్టు రాలడాన్ని పూర్తిగా అరికట్టవచ్చు

|

సాధారణంగా మనం ఒక రోజుకు దాదాపు నూరు వెంట్రుకల వరకూ కోల్పోతుంటాం. ఇది చాలా సాధారణ సమస్యే. అయితే అదే పినిగా జుట్టు ఊడిపోవడం ఎక్కడికి దారితీస్తుందోనని, తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని చాలా మంచి ఆందోళపడుతుంటారు. వారి ఆందోళన తీరాలంటే చేయాల్సిదేమిటంటే .జుట్టుకు అవసరమైన మూడు అంశాలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. అవి కురులకు కావాలసిన జింక్, ఐరన్, విటమిన్ సి ఈ మూడూ పోషకాలు జుట్టు పాలిట మూడు ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ మూడు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

జింక్ కోసం : జుట్టుకు అవసరమైన జింక్ కోసం.. ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్ తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషేన్ సిఫార్సు చేస్తోంది. జింక్ కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే. ఇక దానితో పాటు సీఫుడ్, డార్క్ చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలో జింక్ పాళ్ళు ఎక్కువ. వీటితో పాటు పుచ్చకాయ తింటూ వాటి గింజలను ఊసేయకండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే...

జింక్ కోసం

జింక్ కోసం

జుట్టుకు అవసరమైన జింక్ కోసం.. ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.

ఐరన్ కోసం

ఐరన్ కోసం

మన ఆహారంలో పుష్కలమైన ఐరన్ కోసం గుడ్డు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీపుడ్స్, వంటి వాటిపై ఆధారపడవచ్చు. ఇక మాంసాహారంలో

విటమిన్ సి

విటమిన్ సి

మనకు లభ్యమయ్యే అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో నాణ్యమైన విటమిన్ సి పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్

ఐరన్ కోసం: మన ఆహారంలో పుష్కలమైన ఐరన్ కోసం గుడ్డు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీపుడ్స్, వంటి వాటిపై ఆధారపడవచ్చు. ఇక మాంసాహారంలో అయితే కాలేయం. కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువని తెలుసుకుని మీ ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలాచూసుకోండి.

విటమిన్ సి: మనకు లభ్యమయ్యే అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో నాణ్యమైన విటమిన్ సి పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బత్తాయి, నారింజ పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం ఒకింత తక్కువే. ఇవన్నీ తీసుకుంటూ జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేస్తూ ఉన్నా జుట్టు రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్ ను లవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత జుట్టు రాలే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటిదేదైనా ఉంటే దాన్ని డాక్టర్లు పరిష్కరిస్తారు.
ఒక వేళ స్వాభావికంగానే ఈ సమస్య లేకుండా చూసుకోవాలంటే చేపలు ఎక్కువగా తినేవారిలో థైరాక్సిన్ అసమతౌల్యత సమస్య చాలా తక్కువని గుర్తుంచుకోండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్ లు లేదా ట్రైకాలజిస్ట్ ల వంటి నిపుణులను కలవాల్సి ఉంటుంది.

English summary

3 Best Food to Stop Hair Loss... | జుట్టు రాలడాన్ని పూర్తి గాఅరికట్టే ఆ మూడు...


 Eat Best Foods to Promote Hair Growth. Many of us spend a fortune on expensive hair products for healthier tresses. However, the truth is, beautiful hair starts with our diets. Healthy hair is nourished hair – and that means supplying our bodies with the nutrients they need. For shiny, strong and slinky locks, check out these top hair foods to add to your shopping list.
Desktop Bottom Promotion