For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కురులను సువాసనభరితంగా ఉంచే 10 చిట్కాలు...!

|

జుట్టు సంరక్షణకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. జుట్టు సంరక్షణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. జుట్టు సంరక్షణలో భాగంగా చుండ్రు వదిలించుకోవడం, జిడ్డు వదిలించుకోవడం, ఆరోగ్యంగా, మంచి మెరుపుతో ఉండటానికి ఏవేవో ట్రీట్మెంట్లు మరియు నూనెలు ఉపయోగిస్తుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కూడా కేశాలు మంచి వాసన కూడా రావాలి. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉన్నట్లు. అయితే ఒకే సమయంలో కేశాలు ఆరోగ్యకరమైన లుక్ తో మరియు మంచి సువాసనతో ఉండటం అంత సులభం కాదు. మీ జుట్టు మంచి వాసన రావాలంటే ముందుగా మీ జుట్టు నుండి చెడు వాసన ఎందుకొస్తోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మీ కేశాలు మంచి లేదా చెడు వాసన కలిగి ఉంటుంది. కానీ, తలకు చాలా రోజుల వరకూ తలస్నానం చేయకపోవడం, వల్ల జిడ్డైన వాసనకు దారితీయవచ్చు.

కాబట్టి, రెగ్యులర్ తలస్నానం చేయడం వల్ల ఇటువంటి నూనె, జిడ్డు వాసనను తొలగించుకోవచ్చు. చెమట వల్ల కూడా మీ తల, కేశాల నుండి దుర్వాసన రావడానికి కారణం కావచ్చు. మీకు అధికంగా చెమట పడుతున్నా, లేదా చెమట పట్టి తలలో, తల మాడు మీద గ్రహించబడుతుంది, దాంతో తేమ వాసన వస్తుంది. తలలో చెమట దుర్వాసనతో పోరాడాలంటే, కొన్ని ఆరోమాటిక్ ఆయిల్స్ ను ఉపయోగించాలి. సాధారణంగా ఆరోమాటిక్ ఆయిల్స్ ను పువ్వులను నీళ్ళలో వేసి కాచి, చల్లార్చుతారు. ఈ రసాన్ని ఆరోమాటిక్ ఆయిల్స్ లో ఉపయోగిస్తారు. దాంతో మీ తల, జుట్టు మంచి సువాసనభరితంగా ఉంటుంది మరియు జుట్టుకు తగినంత పోషణ కూడా అంధిస్తాయి. కాబట్టి, ఒక్కసారిగా మీరు రెండు ప్రయోజనాలను పొందవచ్చనమాట.

కొన్ని సార్లు కొన్ని హెయిర్ ప్యాక్స్ మరియు హెయిర్ మాస్క్ లు కూడా మీ తల, మరియు జుట్టు కూడా దుర్వాసనకు దారితీస్తాయి. ఉదాహరణకు: కోడి గుడ్డు మీ కేశాలను నునుపుగా మరియు మెత్తగా మార్చడానికి బాగా సహాయపడుతాయి. అయితే కోడి గుడ్డును తలకు పెట్టుకొన్నా సరిగా శుభ్రం చేయకపోతే దుర్గంధాన్ని వెదజల్లుతుంది. అందువల్ల, మీ కేశాలు మంచి సువాసన భరింతంగా ఉండాలంటే, మీరు గుడ్డుతో హెయిర్ ప్యాక్స్ వేసుకొన్న తర్వాత కొన్నిట్రిక్స్ ను ప్రయత్నించడం.

కేశాలు మంచి సువాసనతో ఉండాలంటే, అందుకు కొన్ని నేచురల్ పద్దతులు ప్రయత్నించడం వల్ల ఇవి ఎల్లప్పుడు సురక్షితం మరియు ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి, మీ కేశాలు సువాసన పొందాలంటే ఈ చిట్కాలను పాటించండి...

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

రెగ్యులర్ వాష్: మీ కేశాలకు రోజు విడిచి రోజు తలస్నానం చేస్తుండాలి. దాంతో కాలుష్యం దుమ్ము, ధూళి వల్ల పాడైన జుట్టును శుభ్రపరుచుకోవడానికి ఆల్టర్ నేట్ డేస్ లో తలస్నానం చేయడం చాలా ముఖ్యం. అలా కుదరనప్పుడు కనీసం రెండు రోజుకొకాసారైనా ప్రయత్నించాలి. ఇలా ఎప్పటికప్పుడు తలస్నానం చేయడం వల్ల కేశాలు శుభ్రపడటంతో పాటు మంచి వాసనను కలిగి ఉంటాయి.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

నిమ్మరసం: నిమ్మరసం నేచురల్ సిట్రస్ స్మెల్ కలిగి ఉంటుంది. ఇది మీ కేశాలకు మంచి సువాసన కలిగి ఉండేలా చేస్తుంది. చుండ్రును వదిలించడంలో నిమ్మరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని తలకు పట్టించి, 10-15నిముషాల తర్వాత నాణ్యమైన షాంపూతో తలస్నానం చేసేసుకోండి.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

రోజ్ వాటర్: రోజు వాటర్ ఒక మంచి ఆస్ట్రిజెంట్ లా పనిచేస్తుంది. ఇది మీ చర్మ సంరక్షణకు ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరి కేశాలకు, రోజ్ వాటర్ తో కేశాలకు అధనపు ప్రయోజనాలంటూ ఏమీ లేవు. అయితే, రోజు వాటర్ ను తలకు అప్లై చేయడం వల్ల సువాసన భరితంగా ఉంటుంది.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

జాస్మిన్ ఆయిల్: జాస్మిన్(మల్లెపువ్వు)సువాసనలిచ్చే పువ్వుల్లో మల్లెపూల ప్రత్యేకత ఏంటో మనకు తెలిసిందే. కాబట్టి జాస్మిన్ ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం వల్ల మీ కేశాలు సువాసన భరితంగా ఉంచడమే కాదు, జుట్టు పెరుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

పువ్వులు: చాలా మంది మహిళలు తమ కురులకు సువాసన వచ్చేందుకు పువ్వులను ఎక్కువగా పెట్టుకుంటుంటారు. అయినప్పటికీ ఇవి కేశాలకు తగినంత నాణ్యమైన ప్రభావాన్ని కలిగించవు. ఇవి పెట్టుకొన్నప్పుడు, తర్వాత కొంత సమయం మాత్రమే వాసనను కలిగి ఉంటాయి.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

మందార నూనె: మీ కేశాలకు మందార నూనె ఒక ఆరోగ్యకరమైన నూనె అని చెప్పవచ్చు. ఈ నూనె వల్ల మీ కేశాలను నల్లగా మార్చుతుంది. ఈ నూనె మీ కేశాలను నల్లగా మార్చడంతో పాటు, జుట్టు మూలలను బలోపేతం చేస్తుంది. మందార నూనెలో నేచురల్ సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి మీ కేశాలకు సహజ సువానను అందిస్తుంది.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

స్మోక్డ్ ఎసెన్స్: ఆరోమా థెరఫీలో, ఆరోమాటిక్ ఆయిల్స్ ను బర్న్ చేస్తారు. బర్న్ చేసినప్పుడు వచ్చే పొగలో నేచురల్ వాసనలు వెదజల్లుతాయి. ఈ ఉపాయం పురాతన కాలం నుండి వస్తున్నది. కేశాలను సువాస భరితంగా మార్చుకోవడానికి, కొన్ని మూలికలు, లేదా పువ్వులు నిప్పులు మీద వేసి పొగబెట్టి పొడివాటి, మందపాటి కురులకు తగిలేలా చేసేవారు.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

హెన్నా: కొంత మందికి హెన్నా వాసన అంటే మహా ఇష్టం మరి కొందరికేమో అయిష్టం. కాబట్టి, అది మీ వ్యక్తిగత ఎంపిక. హెన్నాను తలకు పట్టించడం ద్వారా కురులు అందంగా మరియు రెడ్ కలర్ మరియు చాలా ప్రత్యేకమైన వాసనను కూడా కలిగి ఉంటుంది.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

టీ ఆకులు: మీకు డార్జిలింగ్ టీ యొక్క వాసన మీకు నచ్చుతుందా? మీకు నచ్చేటట్లైతే మీ కురులను లిక్కర్(టీఆకులను ఉడికించిన నీటితో)తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కేశాలను నల్లగా మార్చుతుంది మరియు ప్రత్యేక సువాసనను అంధిస్తుంది.

ఆహా...సిల్కీ హెయిర్.నైస్ స్మెల్...!

వేడికి దూరంగా ఉండాలి: వేడి వల్ల మీ తలలో ఎక్కువగా చెమట పడుతున్నట్లైతే, పైన చెప్పిన మార్గాలు ఏవీ మీ జుట్టును మంచి వాసన కలిగి ఉంచేందుకు సహాయపడుతాయి. కాబట్టి మీ జుట్టుకు వేడి తగలకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మరియు సాధ్యమైనంత వరకూ మీ తలను చల్లగా ఉంచుకునేలా చూసుకోవాలి.

English summary

10 Natural Ways To Make Hair Smell Good

It is not enough for your hair to look good. Hair must also smell good. But it is not easy to get hair that looks and smells lovely at the same time. To make your hair smell good, you have to first know why it could smell bad.
Story first published: Saturday, July 13, 2013, 13:53 [IST]
Desktop Bottom Promotion