For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు.. చర్మ కాంతి మెరుగులు...!

|

సాధారణంగా మన ఇంటి ఆవరఫంలో ప్రతి నిత్యం కనిపించే సాధారణ మొక్కలను మనం అంతగా పట్టించుకోం. మన ఆరోగ్యంతో పాటు సౌందర్యాన్ని పెంచేందుకు ఈ మొక్కల ఆకులు ఎంతగానో దోహద పడతాయి. వీటిలో ఉండే అనేక ఔషధ గుణాలు మనుకు చాలా మేలు చేస్తాయి.

మన ఇంటి ఆవరణంలో ఉండే కొన్ని రకాల మొక్కల ఆకులు చర్మ సంరక్షణకు మాత్రమే కాదు, శిరోజ సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖంలో మొటిమలు, మచ్చలు నివారించి చర్మాన్ని కాంతి వంతగాం మార్చుతాయి. అలాగే ముఖంలో ముడుతలు, వయస్సు పైబడనియకుండా అడ్డుకుంటాయి. మొత్తానికి మేనిఛాయను మెరుగు పరిచేందుకు బాగా సహాయపడుతాయి...

వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు చర్మసంరక్షణకు ఏలా ఉపయోగపడుతయో.. శిరోజ సంరక్షణలోనూ బాగా సహాయపడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుండి నివారణ కల్పించబడుతుంది. శిరోజాలు నిగనిగలాడేందుకు ఇవి ఉపయోగపడతాయి. మరి ఇటు చర్మ సంరక్షణలో, అటు శిరోజ సంరక్షణలో ఉపయోగపడే ఆ పెరటి మొక్కలేంటో ఒక సారి చూద్దాం....

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

పుదీనా: ఈ ఆకులను మెత్తగా నూరి ముఖంపై ‘ప్యాక్' వేసుకుంటే మొటిమల సమస్య పోతుంది. చర్మం కాంతివంతమవుతుంది. జిడ్డు చర్మంతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

తులసి: ముఖంలో మృత కణాలను తొలగించి, ముఖ చర్మాన్ని కోమలంగా ఉండేలా తులసి ఆకుల రసం పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. నిత్యం కనీసం ఏడు తులసి ఆకులను తింటే శరీరానికి మంచిది. తులసి పౌడరు, గుడ్డులోని తెల్లసొన కలిపి తలకి పట్టించి పావుగంట ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇది తల వెంట్రుకలకు మంచి కండీషనరు గా పనిచేస్తుంది. తులసి ఆకులను నూరి, కొబ్బరి నూనె కలిపి పొట్ట పైన రాస్తే ముడతలు పోతాయి. తులసి ఆకులను ఎండబెట్టి చూర్ణంచేసి శరీరానికి రాసుకుంటే చర్మం కాంతితో నిగనిగలాడు తుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

మెంతి: చర్మ సౌందర్యానికి, కురుల పోషణకు మెంతి ఆకులను వాడతారు. వీటి ఆకులను మెత్తగా రుబ్బి, కురులకు పట్టిస్తే చుండ్రు సమస్య తీరుతుంది. జట్టు రాలడాన్ని క్రమంగా అరికడుతుంది. మెంతి ఆకుల రసాన్ని, శనగపిండి కలిపి మెడకు రాయాలి. 20నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకుంటే మెడ అందంగా మెరిసిపోతుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

మందారం: మందారం ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకొని కురులకు పట్టిస్తే మంచి నిగారింపు వస్తుంది. ఆకులను, లేదా మందరా పువ్వులను బాగా ఎండబెట్టి కొబ్బరినూనెలో వేయాలి. ఆ తర్వాత నూనెను తలకు రాసుకుంటే శిరోజాలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి. జట్టు రాలడం కూడా తగ్గుతుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

గోరింటాకు: గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎంతగా ముద్దొస్తాయో అందరికీ తెలుసు. దీన్ని పక్కనపెడితే గోరింటతో ఇతర ఉపయోగాలు ఉన్నాయి. సాధారణంగా గోరింటాకు శిరోజాలకు చక్కని ‘కండిషనర్'గా పనిచేస్తుంది. అంతే కాదు శరీరంలో వేడిని తగ్గించి, చర్మాన్ని చల్లబరిచే గుణం ఈ ఆకుల్లో ఉంది. గోరింటాకును మెత్తగా పేస్ట్ చేసి శిరోజాలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

వేపఆకులు: వేపాకుతో మీ అందాన్ని మరింత కాంతివంతం చేసుకోవచ్చు. కాంతి తగ్గిన చర్మానికి, మొటిమలు తేలిన ముఖానికి ఈ ఆకుల మెత్తగా పేస్ట్ చేసి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. తాజాగా ఉండే వేపాకు పేస్ట్ ను జుట్టు కుదుళ్లకు, కేశాలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కురులు తళతళలాడతాయి. పేలు, చుండ్రు వంటి సమస్యలకు కూడా వేపాకు రసం బాగా పని చేస్తుంది. వేపాకు రసాన్ని ప్రతి వారం రాస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా వుంటాయి.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

యూకలిప్టస్(నీలగిరి): నీటిలో ఈ ఆకులను వేసి మరగించాలి. అపుడు వెలువడే వేడిని ముఖానికి పట్టుకుంటే ఉపశమనం ఉంటుంది. ముఖం, చర్మం కాంతివంతమయ్యేలా ఈ ఆకులను వాడవచ్చు.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

కరివేపాకు: మొటిమలకు కరివేపాకు చిగుళ్ళు, పసుపు, వేపాకు కలిపి నూరి పెడితే తగ్గుతాయి. ముఖం మీద ముడతలు వున్నవారు కరివేపాకు అకులను పాలల్లో నూరి అందులో కాస్త ముల్తానమట్టిని కలిపి రాస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. కురులు వొత్తుగా పెరిగేందుకు, తళతళలాడేందుకు ఈ ఆకులతో ‘హెయిర్ ప్యాక్' వేసుకోవాలి. కేశాలు గట్టిపడతాయి.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

కర్పూరం: ఈ ఆకుల్లో ‘యాంటిసెప్టిక్',‘యాంటీ బాక్టీరియల్' లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖానికి వేసుకునే ‘ప్యాక్'లో రెండు చుక్కల కర్పూరం ఆకుల రసాన్ని కలిపితే మొటిమలు త్వరగా పోతాయి. చర్మం కోమలంగా తయారవుతుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

నిమ్మ: స్నానించే నీటిలో నిమ్మ ఆకులు వేసుకుంటే తాజాగా వుంటుంది. లేతగా ఉండే నిమ్మ ఆకులు రుబ్బి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. కొద్ది సేపు అలా వదిలేసి, గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారడమే మాకుండా, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలతో బాధపడేవారు నిమ్మ ఆకులపొడిని తల స్నానానికి గంట ముందు తలకి పట్టిస్తే ఫలితం వుంటుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

తేయాకు: సాధారణంగా ప్రతి రోజూ మనం వాడేసి వడకట్టిన తేయాకు జుట్టు రాలడాన్ని చాలా వరకు అరికడుతుంది. తేయాకుపొడి వేసి వడకట్టిన ఆరు కప్పుల నీటిని సబ్బుకు బదులుగా ఉపయోగించి తలస్నానం చేయాలి. తర్వాత ఎక్కువ నీటిని ఉపయోగించి తల రుద్దుకోవాలి. దీని వల్ల జుట్టు మృదువుగా అందంగా పట్టులా మెరుస్తుంది.

గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

క్యాబేజీ: మనం కర్రీ, ఫ్రై గా ఉపయోగించే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాబేజీ. ఈ క్యాబేజీ రసం మంచి స్కిన్‌ టోనర్‌గా పని చేస్తుంది. చర్మానికి నిగారింపు తెచ్చి, యవ్వన అందాలను స్వంతం చేస్తుంది. చర్మంపై ముడుతలు నివారించి, చర్మానికి మంచి బిగింపు తెస్తుంది.

English summary

12 Natural Home Remedies for Hair Growth | గ్రీన్ లీఫ్ తో కురుల సిరులు..!

Slow hair growth is a problem faced by many people. Some people on the other hand, just want their hair to grow as quickly as possible so that they can experiment with it or keep it nice and long.
Story first published: Monday, February 11, 2013, 16:31 [IST]
Desktop Bottom Promotion