For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి జుట్టు, రఫ్ హెయిర్ ను తగ్గించే ఎఫెక్టివ్ టిప్స్

|

మనలో చాలా మందికి జుట్టు సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకరి జుట్టురాలేసమస్య, మరొక్కరికి చుండ్రు, ఇంకొంతమందికేమో దురద, డ్రైహెయిర్ బ్రేకేజ్, డ్రైహెయిర్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్ని మన జుట్టు పొడి బారినట్లు, ఎండినట్లు నిర్జీవంగా కలతప్పి ఉన్నట్లైతే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడిబారడానికి కాలుష్యం, హార్డ్ వాటర్ వంటివి కూడా ముఖ్య కారణం కావచ్చు. కాబట్టి పొడి జుట్టును వదిలించుకోవడానికి ఇదే మచం సమయం. పొడి జుట్టును సున్నితంగా, నునుపుగా మార్చుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో జుట్టురాలే సమస్యలు, హెయిర్ బ్రేకేజ్ లేదా జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఉండవు . పొడి జుట్టు సమస్య పొడావాటి కేశాలు ఉన్న వారిలో సాధారణంగా ఎదురయ్యే సమస్య. పొడవు జుట్టు ఉన్న కొంత మంది మహిలళకు జుట్టు పొడిబారడంతోపాటు తల మీద హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్ అయ్యి, పల్చగా ఉంటాయి.

డ్రై హెయిర్(పొడి జుట్టు)సమస్య ఉన్నవారు, కేశాలలోనికి త్వరగా ఇంకే నేచురల్ ఆయిల్స్ ను అప్లై చేయాలి . అలాగే సరైన నేచురల్ హెయిర్ షాంపును కూడా ఉపయోగించడం వల్ల జుట్టు మూలాల నుండి పోషన లభించి పొడిబారడాన్ని తగ్గిస్తాయి. వీటితో పాటు మీకు ఆశ్చర్యం కలిగించే 12 నేచురల్ పద్దతులను పాటించడం వల్ల కూడా మీపొడి జుట్టును తగ్గించుకోవచ్చు. ఈ పన్నెండు చిట్కాలు పొడి జుట్టుకు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మరియు ఎక్కువ సమయం పట్టదు. డ్రై హెయిర్ నిర్మూలించడానికి ఈ సింపుల్ చిట్కాలను నెలకొకసారైనా పాటించి, ఫలితాలను గమనించండి..

నేచురల్ షాంపు:

నేచురల్ షాంపు:

మీకు పొడి జుట్టు ఉన్నప్పుడు నేచురల్ షాంపును ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. నేచురల్ షాంపు అంటే శీకాకాయ్ చాలా ఉత్తమ ఎంపిక. ఇది మీ జుట్టుయొక్క ఆకారాన్ని అందంగా ఇస్తుంది.

నేచురల్ కండీషనర్:

నేచురల్ కండీషనర్:

డ్రై హెయిర్ నిర్మూలించడానికి హెయిర్ వాష్ తర్వాత నేచురల్ కండీషనర్ అప్లై చేయాలి. అందుకు మొయోనైజ్ ను అప్లై చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మరయు స్మూత్ గా తయారవుతుంది. ఒక టేబుల్ స్పూన్ మయోనైజ్ ను జుట్టుకు మసాజ్ చేసి, పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ రూట్ కేర్:

నేచురల్ రూట్ కేర్:

డ్రైహెయిర్ సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా జుట్టు మూలాల కొరకు ప్రత్యేకంగా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. అందుకు ఉల్లిపాయ రసాన్ని తల మాడుకు బాగా పట్టించాలి. ఈ ఆనియన్ జ్యూస్ కొత్త జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది.

జుట్టు చివర్లు చిట్లాడన్ని అరికట్టాలి:

జుట్టు చివర్లు చిట్లాడన్ని అరికట్టాలి:

పొడవాటి జుట్టు ఉన్న మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్య జుట్టు చివర్లు చిట్లడం. డ్రై హెయిర్ వల్ల జుట్టు చిట్లడం చాలా సహజం కాబట్టి మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో తలదువ్వడానికి నివారించాలి. జుట్టు చిట్లాడాన్ని నిరోధించడానికి మీ పొడి జుట్టుకు ఉత్తమ చికిత్సా పద్దతి ఇది.

రఫ్ హెయిర్ :

రఫ్ హెయిర్ :

పొడి జుట్టు కారణంగా జుట్ట రఫ్ గా తయారవుతుంది. రఫ్ హెయిర్ ను స్మూత్ గా ఉంచుకోవడానికి టమోటో జ్యూస్ ను అప్లై చేసి 15నిముషాలు ఉంచి తర్వత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారంలో రెండు సార్లు ప్రయత్నించి మీ రఫ్ హెయిర్ ను స్మూత్ గా మార్చుకోండి.

నేచురల్ మాయిశ్చరైజర్:

నేచురల్ మాయిశ్చరైజర్:

జుట్టుకు నేచురల్ మాయిశ్చరైజ్ చేసుకోవడం వల్ల పొడి జుట్టును నివారించుకోవచ్చు. నేచురల్ మాయిశ్చరైజర్ అంటే జోబాబా అమరియు షీ బటర్ వంటి వాటిని ఎంపిక చేసుకొని, మీ పొడి జుట్టుకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

హెయిర్ ప్యాక్:

హెయిర్ ప్యాక్:

మీ జుట్టుకు హెయిర్ ప్యాక్ చాలా ఆరోగ్యకరం. కాబట్టి మీ జుట్టుకు ఫ్రూట్ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి. స్ట్రాబెర్రీ పండ్లకు కొన్న రోజాపువ్వు రేకులను మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి, తలకు ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డల్ హెయిర్:

డల్ హెయిర్:

పొడి జుట్టు నిర్జీవంగా మారినప్పుడు, ఆ జుట్టును ఆరోగ్యంగా మరియు మంచి షైనింగ్ తో ఉండేలా చేయాలనుకుంటే బాదం పేస్ట్ ను తలకు పట్టించడం చాలా ఉత్తమమైన పద్దతి. బాదం పేస్ట్ తలకు పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మంచి షైనింగ్ తో పాటు సిల్కీగా ఉంటుంది.

హెయిర్ వ్రాప్:

హెయిర్ వ్రాప్:

వేడినీటిలో డిప్ చేసి కాటన్ టవల్ ను మీ జుట్టుకు పూర్తి కవర్ చేసి 10నిముషాలు చుట్టడం వల్ల మీ జుట్టు మందంగా మరియు బెటర్ గా కనబడుతాయి. ఈ హెయిర్ కేర్ టిప్ ను వారానికొకసారి పాటించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

తల స్నానం :

తల స్నానం :

తలకు పాయిశ్చరైజ్డ్ మిల్క్ తో షాంపుతో స్నానం చేయడం వల్ల కేశాలు నునుపుగా, స్మూత్ గా మారుతాయి. కాబట్టి వారానికొకసారి పాలతో కేశాలను శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ ఆయిల్స్:

నేచురల్ ఆయిల్స్:

డ్రై హెయిర్ ను నివారించడం కోసం గోరువెచ్చని కొబ్బరి నూనె మరియు ఆలివ్ ఆయిల్ వంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నూనెలతో తలకు మసాజ్ చేసిన ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ కేశాల ఆక్రుతి మారడంలో అద్భుతాను చూడవచ్చు.

పొడి బారడం:

పొడి బారడం:

తలస్నానం చేసిన తర్వాత రఫ్ గా ఉన్న టవల్ తో తలను తుడవడం లేదా తలఆర్పుకోవడానికి డ్రైయ్యర్ ఉపయోగించడం వల్ల జుట్టు మరింత డ్రై గా మారే అవకాశం ఉంది కాబట్టి, జుట్టునుండి నీటిని పూర్తిగా పిండి, నేచురల్ గా తల ఆరేలా జాగ్రత్త తీసుకోవాలి.

English summary

12 Ways To Treat Dry Hair

Dry hair is one of the main problems we all somehow try to avoid at some point in time. But when we develop dry hair due to natural reasons like pollution and usage of hard water, we need to take extra after care.
Story first published: Tuesday, September 24, 2013, 12:16 [IST]
Desktop Bottom Promotion