For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలకుండా..బాధ్యత వహించే పౌష్టికహారాలు ఇవే..!

|

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగినటు వంటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాగే చర్మ, కేశాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా పౌష్టికాహారం చాలా అవసరం. ముఖ్యంగా పౌష్టికాహార విషయంలో తాజా పండ్లు, కూరగాయలు బాగా సహాయపడుతాయి. మనిషి ఆరోగ్య పరంగాను, అందం పరంగాను మనల్ని కాపాడే ప్రకతి దివ్వౌషదాలు ఇవి. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. పోషకాలు లేని ఆహారం ఎంత తిన్నా నిరుపయోగమే. అదే విధంగా సమయ పాల పాటించని వారికి ఆరోగ్యంతో పాటు అందం కూడా తగ్గిపోతుంది. పౌష్టికాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు, చర్మ, కేశ సంబంధిత సమస్యలు కూడా అధికం అవుతాయి.

పౌష్టి లక్షణాలు పుష్కలంగా ఉండే ఆహారాలు, చర్మ, కేశ సంరక్షలో బాగా సహాయపడి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా బాధత్య వహించేవి చాలానే ఉన్నాయి. ఉదాహరణకు: అరటి పండు. అరటి పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ కేశ సంరక్షణలో ది బెస్ట్ ఆహారంగా చెప్పుకోవచ్చు. అలాంటివే మరికొన్ని తాజా కూరగాయలు, ఆకుకూరలు, బ్రొకోలీ, క్యారెట్ వంటివి కేశాలకు చాలా ఆరోగ్యకరం.

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది ఒక్క మహిళలల్లోనే కాదు, పురుషుల్లో కూడా అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా అందుకు కారణం వంశపారంపర్యం, ఒత్తిడి, ఆహార అసమతుల్యతలు మరియు ఎక్కువ స్థాయిలో డిహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉండటం. ఈ కారణాల చేత జుట్టు రాలిపోతుంటే కనుక మీరు మీ జుట్టును కాపాడుకోవడానికి తిరిగి కొత్త జుట్టు పెరగడానికి పండ్లు బాగా సహకరిస్తాయి. ప్రతి రోజూ ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలకు ఎలా ఉపయోగపడుతాయో... అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన పండ్లను తినడం వల్ల కేశ సంపదను కాపాడుకోవచ్చు.ప్రతి రోజూ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పండ్లలో ఉన్న విటమిన్స్ మరయు మినిరల్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ ఇ లు కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. అటువంటివి కొన్ని మీకోసం.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

ఆరెంజ్: కురుల పెరుగుదలకు బయోప్లెవనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణను అంధించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి మీరు తినేటటువంటి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రికాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

గ్రేప్ ఫ్రూట్: సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు రాలడాన్ని అరికడతుంది.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

నిమ్మపండు: నిమ్మతో అందం మాత్రమే కాదు హెయిర్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే. జుట్టురాలడాన్ని అరికట్టడానికి, అందుకు కారణం అయ్యే చుండ్రు, పొడిబారే వెంట్రులకలు, దురద వంటి అన్ని సమస్యలకు అద్భుత ఔషదం నిమ్మ.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మంచి పోషకాహారం ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు, చర్మ మరియు జుట్టు సంరక్షణకు బాగా సహాయపడుతాయి. విటమిన్ సి బలమైన కురుల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా అంటే విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

చెర్రీస్: చెర్రీస్ లో బయోఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి హెయిర్ లాస్ ను అరికడుతాయి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

ప్లమ్: ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్లమ్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు రాలడాన్ని అరకట్టాలనుకొంటే తప్పని సరిగా ప్లమ్ హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

అరటి: మెగ్నీషియం కూడా ఆరోగ్యకరమైన కురుల పెరుగుదలకు బాగా దోహదపడుతుంది. అందుకు అరటి పండులో కావల్సినన్ని మినిరల్స్ అందుతాయి. తర్వాత అత్తిపండ్లు మరియు ఆర్టిచోక్స్ లో కూడా అధికంగా మెగ్నీషియం ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. బాగా పండిన అరటి పండును చిదిమి(జుట్టు పొడవును బట్టి) అందులో కొద్దిగా పెరుగు మరియు నిమ్మరసం, వేసి బాగా పేస్ట్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో, మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. దాంతో కురులు మెరుస్తూ, సున్నితంగా పట్టుకుచ్చులా తయారవుతాయి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

జామకాయ: జామకాయలోని విటమిన్ ఎ మరియు విటమిన్ సిలు కూడా అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. విటమిన్ ఎ కొత్తగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. బాగా పండిని జామపండును తీసుకొని మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం(చుండ్రు ఉంటేనే) కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించి పదిహేను నిముషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. జామ మరియు తేనె హెయిర్ మాస్క్. ఇది మరొక అద్భుతమైన హెయిర్ మాస్క్. తేనె కురులకు మంచి మెరుపు నివ్వడమే కాకుండా కురులను స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

బొప్పాయి: బొప్పాయి ఆరోగ్యపరంగాను, చర్మ, కేశ సంరక్షణలోనూ అద్భుతంగా సహాయపడుతంది. బొప్పాయి మరియు పాలు బాగా పండిన బొప్పాయి కురుల సంరక్షణకు మరియు చర్మ సంరక్షణకు అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. అటువంటి గుణాలు బొప్పాయిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి తేనె కూడా చేర్చి హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి తలకు, కురులకు బాగా పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

పీచెస్: ఇందులో ఐరన్, హీమోగ్లోబిన్ పెంచడానికి ఎసెన్సియల్స్, ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ అందించుటలో ఈ ప్రూట్స్ బాగా ఉపయోగపడుతాయి. అనీమియాతో బాధపడేవారికి కావలసినంత ఐరన్ ను అందిస్తుంది. జుట్టు పెరగుదలకు, వెంట్రుకలకు కావలసిన విటమిన్స్ అందజేస్తుంది. తల శుభ్రంగా లేకపోవడం వల్లే నూటికి తొంబై శాంతం జుట్టు రాలడానికి కారణం. మరి, తలను శుభ్రంగా ఉంచుకోవాలంటే పీచెస్ తో హెయిర్ ప్యాక్ వేసుకోవడం అవసరం.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

అవొకాడో: అవొకాడోలో 25 రకాల న్యూట్రిషియన్స్ కలిగి ఉంటుాయి. ముఖ్యంగా అందులో విటమిన్ ఇ మరియు బి అధికంగా ఉంటాయి. పచ్చి అవొకాడోను మెత్తని పేస్ట్ లా తయారు చేసి తల మాడుకు అప్లై చేసి కొద్ది సేపటి తర్వత తలను శుభ్రం చేసుకోవాలి. దాంతో కురులు క్లీన్ గా ఫ్రెష్ గా.. మెరుస్తూ ప్రకాశవంతంగా కనబడుతాయి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

కివి/విటమిన్ ఇ: విటమిన్ ఇ వల్ల తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణకు కావల్సినంత ఆక్సిజన్ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు మామిడి పండ్లు, కివి పండ్లు రెండూ అధిక శాతంలో విటమిన్ ఇ కలిగి ఉండి. కురుకు పెరగడానికి దోహదం చేస్తుంది.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు. ఈ పండులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి మరియు సి, ఫోలిక్ ఆసిడ్స్, జింక్, సోడియం, మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం ఇందులో కంటే అరటిపండులో 80శాతం అధికంగా ఉంటుంది. ఈ పండులో ఉన్నా ఈ విటమిన్స్, న్యూట్రిషయన్స్ అన్నీ కూడా కురులు పెరగడానికి బాగా దోహదపడుతాయి.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

క్యారెట్/ బీటా కెరోటీన్: శరీరంలో బీటాకెరోటీన్ విటమిన్ ఎ' గా మార్చి శరీరానికి అందజేస్తుంది. విటమిన్ ఎ, లేదా బీటా కెరోటిన్ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను)సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్ క్యాన్టలూపే(దోసకాయలో)అధికంగా ఉంటుంది.

జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

కీరదోసకాయ/ఇన్ అసిటోల్: విటమిన్ బి సంబంధితమైనది ఇన్ అసిటోల్. దీని తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ అసిటోల్ పుష్కలంగా ఉండేటటువంటి దోసకాయ, ఆరెంజ్, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్ పండ్లను తీసుకోవడం మంచిది.

English summary

15 Fruits To Treat Hair Loss Naturally | జుట్టు రాలిపోతోందని టెన్షన్ ఎందుకు...?

We all have heard about the importance of having fresh fruits and vegetables. A healthy diet must include fruits and vegetables that are not only good for the body but also for the skin and hair. No one can deny the fact that your diet affects the skin and hair. Unhealthy foods not only make you look dull but also lead to several hair problems like hair loss and hair damage.
Desktop Bottom Promotion