For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!

|

సాధారణంగా మహిళల్లో లాగే పురుషుల్లో కూడా ఫ్రిజ్జీ హెయిర్, పెళుసైన జుట్టు, జుట్టు రాలడం, బ్యాడ్ హెయిర్ గ్రోత్, మరియు తలలో జిడ్డు చర్మం ఇలా తరచూ ఏదే ఒక రకమైన జుట్టు సమస్యలు పురుషులు కూడా ఎదుర్కొంటున్నారు. జట్టు సంరక్షణ కోసం మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. పురుషులు కూడా వారి ఒత్తిడిని తగ్గించుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే , మగవారిలో కూడా జుట్టు సంబంధిత సమస్యలను సులభంగా నివారించవచ్చు. అందుకు మేము 20బెస్ట్ హోం రెమడీస్ ను లిస్ట్ చేశాము . అవిపురుషుల జుట్టుసమస్యలను నివారించి వారి ఆరోగ్యకరమై జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం...

పురుషుల్లో చుండ్రు: నిమ్మతో నివారణా చిట్కాలు:క్లిక్ చేయండి

ఆయిల్ మసాజ్

ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు, కేశ కణాలకు తగినంత న్యూట్రీషియన్లు అందుతాయి. మరియు జుట్టును డ్యామేజ్ చేసే వాటికి వ్యతి రేకంగా పోరాడుతుంది. అందుకు మంచి ఆయిల్స్ బాదాం, ఆలివ్, మరియు కొబ్బరి నూనెలను ఎంపిక చేసుకోవాలి. హెయిర్ మసాజ్ ను వారంలో రెండు సార్లు చేసుకోవడం చాలా మంచి పద్దతి.

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు కేశాలకు పోషణ ఇస్తుంది మరయు జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, ఇది మృదువైన జుట్టు తయారు చేయడానికి సహాయపడుతుంది.

అలోవెరా జెల్:

మీ కేశాలకు బలోపేతం చేయలానుకంటే కలబంద జెల్ కు షీన్ ను మిక్స్ చేసుకోవచ్చు. ఆలోవెరా జెల్ ను తల మాడుకు మసాజ్ చేయాలి. వారంలో రెండు సార్లు తలకు అలోవెరాతో మసాజ్ చేయడం వల్ల, జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. మరియు పొడి జుట్టును రిపేర్ చేస్తుంది లేదా ఇన్ఫెక్షన్ జుట్టును నిరోధిస్తుంది.

వేపపేస్ట్:

ఔషధ గుణాలున్న వేప పేస్ట్ తలకు పట్టించడం వల్ల తల మాడుకు ఆల్కలీన్ ను బ్యాలెన్స్ చేస్తుంది దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా బెటర్ గా పనిచేయాలంటే ఈ వేపపేస్ట్ కు ఆలివ్ ఆయిల్ లేదా తేనె ను మిక్స్ చేసి తలకు పట్టించాలి.

గుడ్డు:

కేశాలకు ప్రోటీన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. మీకు బలమైన మరియు మందమైన జుట్టు కలిగి ఉండాలకొటే, ఈ ప్రోటీన్ చికిత్సను వారంలో మూడు-నాలుగు సార్లు చేసుకోవాలి . అందుకు మీరు చేయాల్సిందల్లా గుడ్డును పగులగొట్టి మీ తడి జుట్టుకు గుడ్డు సొనను అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

మెంతులు:

రెండు మూడు చెంచాల మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి. ఉదయం వాటిలో నీరు వంపేసి మెత్తగా పేస్ట్ చేసి తలమాడుకు బాగా పట్టించాలి. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టడం మాత్రమే కాదు..జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. చుండ్రు నుండి విముక్తి కలిగిస్తుంది.

అవొకాడో:

అవొకాడోను బాగా మెత్తగా చేసి దానికి అరటి పండు కూడా చేర్చి రెండింటిని మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకొని, తల మాడుకు బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవడం వల్ల మీరు మీ జుట్టులో మార్పులను గమనించవచ్చు. కేశాలు ఆరోగ్యకరంగా మరియు మందంగా మారుతాయి.

ఆరెంజ్ జ్యూస్:

మీరు ఆయిల్ స్లాప్ మరియు చుండ్రుతో బాధపడుతున్నట్లైతే అందుకు ఇక్కడ ఉంది పరిష్కారం. ఫ్రెఫ్ గా ఉన్న ఆరెంజ్ తొక్కను మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా తయారు చేసి, ఆ గుజ్జును తలకు హెయిర్ ప్యాక్ లా తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల మీ కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.

హెన్నా:

మీకు మందమైన నేచురల్ హెయిర్ కావాలని కోరుకుంటున్నట్లైతే, హెన్నా పేస్ట్ ను తలకు పట్టించాలి. హెన్నా పెట్టుకొన్న తర్వాత మూడు గంటల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఫ్లాక్ సీడ్స్:

రెండు మూడు చెంచాల ఫ్లాక్ సీడ్స్ ను ఒక బౌల్లో వేసి నీరుపోసి ఐదు రోజుల పాటు నానబెట్టాలి. ఐదు రోజుల తర్వాత ఈ నీటిని చేతి వేళ్ళతో లేదా కాటన్ బాల్స్ తో తలమాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

నిమ్మరసం:

ఒక భాగం నిమ్మరసానికి రెండు బాగాల కొబ్బరి నూనె మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తల మాడుకు కేశాలకు రెగ్యులర్ గా అప్లై చేయాలి. ఇది రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేయవచ్చు. లేదా మూడు నాలుగు గంటలు అలే ఉంచి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.

జోజోబా ఆయిల్:

ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల నిలకడగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది మరియు చివరలు సున్నితంగా ఉంచుతుంది. ఇది జుట్టును పొడిబారనియ్యకుండా..ఎండిపోకుండా చేస్తుంది.

మయోనైజ్:

హెయిర్ డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ ను రిపేర్ చేస్తుంది. మీ పొడి జుట్టుకు మయోనైజ్ అప్లై చేయవచ్చు. మయోనైజ్ అప్లై చేసిన తర్వాత తలను ప్లాస్టిక్ కవర్ తో చుట్టేసుకోవాలి. కనీసం అరగంట అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

గుడ్డు మరియు మయోనైజ్:

ఈ హోం రెమడీ జుట్టును సున్నితంగా మరియు మెరిసేలా మార్చుతుంది. కాబట్టి ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట అలాగే ఉంచి, తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

తేనె:

జుట్టు ఆకర్షించే విధంగా మంచి మెరుపుతో మరియు ఆరోగ్యంతో కనబడాలంటే హనీ రెమడీని ఖచ్చితంగా ఉపయోగించాలి. తేనె మరియు ఆలివ్ ఆయిల్ ను సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి తల మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి -మందారం-కరివేపాకు:

మీ కేశాలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలనుకుంటే, మందారం ఆకులు మరియు కరివేపాకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి తర్వాత ఉదయాన్నే తలస్నానం చేసుకోవాలి.

ఉసిరి-శీకాకయ, రీట మరియు బ్రింగరాజ్ పౌడర్:

ఈ నాలిగింటి కాబినేషన్ కి పెరుగు మరియు నిమ్మరసం కూడా చేర్చి తలకు పట్టించడం వల్ల ఆరోగ్యకరమైన మెరిసేటి జుట్టు మీ సొంతం అవుతుంది.

పెరుగు మరియు బ్లాక్ పెప్పర్:

ఈ రెమడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మూడు చెంచాల పెరుగులో రెండు చెంచాల బ్లాక్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి, తలమాడు మీద బాగా రుద్దాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

వెనిగర్:

వెనిగర్ లో పొటాషియం మరియు ఎంజైమ్స్ పుష్కలంగా ఉండి, ఇది దురద కలిగించే తల మాడుకు మరియు చుండ్రుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ తో సింపుల్ మసాజ్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి. హెయిర్ ఫాలీసెల్స్ ను మూసుకుపోయిన వాటిని తెరచుకొనే చేస్తాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా తలలోని చుండ్రును పూర్తిగా నివారిస్తుంది . ఒక చెంచా బేకింగ్ సోడా మరియు షాంపు రెండింటితో రెగ్యులర్ గా తలస్నాం చేయడం వల్ల చుండ్రు పూర్తిగా నివారించబడుతుంది.

English summary

20 Home Remedies for Hair Care in Men | పురుషుల జుట్టు సమస్యలకు పరిష్కారం..!

Frizzy hair, brittle hair, hair loss, bad hair growth and oily scalps are frequent hair problems in men. Like their female counterparts men need to indulge in home remedies to pamper their tresses to improve hair growth.
Desktop Bottom Promotion