For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఇంట్లోని 8 ఉత్తమ నేచురల్ హెయిర్ కండీషనర్స్

By Super
|

మీరు అవకాడొలు, అరటి, తేనె మరియు కొబ్బరి వంటి పదార్థాలతో చేసినవే మంచి వంటకాలు అనుకుంటున్నారా! సరే, వీటితో మంచి సహజమైన హెయిర్ కండిషనర్ తయారుచేసుకోవొచ్చు అంటే మీరు ఎలా అనుభూతి చెందుతారు? మన జుట్టుకు షాంపూ తరువాత మంచి కండిషనర్ అవసరం ఉంటుంది.

అదృష్టవశాత్తూ, మీరు ఎల్లప్పుడూ మీ జుట్టుకు ముఖ్యంగా అవసరమైన హైడ్రేషన్ కోసం ప్యాకేజీ సీసా లో ఒక కండీషనర్ వాడనవసరం లేదు. జుట్టులో పొడితనం పోగొట్టి మంచి డీప్ స్థితిలో ఉంచేట్లుగా చేసే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని గురించి మరింత తెలుసుకోవడానికి క్రింద ఇచ్చినవాటిని చదవండి.

బనానాస్

బనానాస్

అరటిపండ్లతో తయారైన అద్భుతమైన మరియు సమర్థవంతమైన జుట్టు కండీషనర్ తో మీ జుట్టు మృదువుగా మరియు అందంగా తయారవుతుంది. దీనితోపాటు, జుట్టులోకి సులభంగా వ్యాప్తి చెందే తేనె,గ్లిజరిన్ మరియు ఆలివ్ ఆయిల్ వంటివి కలిపండి మరియు మాయిశ్చరైజింగ్ ప్రయోజనాలు అందించే ఈ అరటిపండు మాస్క్, ఎవరైతే జుట్టు మృదువుగా కావాలనుకునేవారికి, వారికి అనువైనది. ఈ పదార్థాలతో అరటిపండును మెత్తగా ఎటువంటి ముద్దలు లేకుండా గుజ్జులాగా కలపాలి. ఈ గుజ్జును తలకు పట్టించి 30-45 నిముషాలవరకు వదిలివేయండి. ఒక తేలికపాటి షాంపూ తో పూర్తిగా శుభ్రం చేసుకోండి మరియు మీ జుట్టు పూర్తిగా కండిషన్ చేయబడుతుంది.

తేనె

తేనె

తేనె ఒక చర్మమును మెత్త పరచు లేపనముగా వర్గీకరించబడింది అంటే ఇది సహజంగా ఒక మంచి కండిషనర్ మరియు మాయిశ్చరైజర్ ఎందుకంటే దీనిలో నీటి అణువులను ఆకర్షించే మరియు ఉంచుకోగలిగే సామర్థ్యము ఉన్నది. ఇది మీ జుట్టును కాంతివంతంగా మరియు నునుపుగా చేస్తుంది. దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక బొట్టులో మూడోవంతు తేనెను తీసుకుని, అంటే సమమైన మీరు వాడే కండిషనర్ తో కలపండి. ఈ రెండింటిని చేతులతో రుద్దండి. దీనిని మీ జుట్టు మొత్తం పట్టించండి. దీనిని మీ తలమీద జుట్టు కుదుళ్ళను చేరేవరకు మర్దన చేయండి. ఇలా 30 నిముషాల వరకు ఉంచండి, తరువాత తలస్నానం చేయండి.

అవకాడొలు

అవకాడొలు

జుట్టుకు అవకాడొలు రెండవ ఉత్తమ వస్తువుగా అందరి తెలిసిన విషయమే, మొదటిది కొబ్బరి నూనె ఉంటుంది. వీటిని కొబ్బరి పాలతోగాని మరియు ఆలివ్ ఆయిల్ తో గాని కలిపితే మీరు మంచి హెయిర్ కండిషనర్ పొందగలుగుతారు. ఒక అవకాడోను తీసుకొని, దానిని గుజ్జుగా అయ్యేవరకు నలపండి. కొద్దికొద్దిగా కొబ్బరిపాలతో మరియు ఆలివ్ ఆయిల్ తో కలపటం ప్రారంభించండి మరియు బాగా కలిసి చిక్కగా, తలకు పట్టించేందుకు వీలుగా అయ్యేవరకు కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, ఒక సీసాలో పోసి ఫ్రిజ్ లో ఉంచండి. మీరు తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా దీనిని తీసి వాడుకోండి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

ఈ కండీషనర్ జుట్టును పటిష్టం చేస్తుంది; బలాన్ని చేకూరుస్తుంది. కొబ్బరినూనె మన జుట్టుకు మంచి కండిషనర్ అని పురాతనకాలం నుండి చెప్పుకుంటున్నాము. ఈ నూనె జుట్టుకు చక్కగా పట్టి ఉంటుంది మరియు కెరటిన్ నష్టాన్ని నిరోధిస్తుంది. జుట్టును ఆర్ద్రతగా ఉంచుకోవడం కోసం కొబ్బరినూనెకు తేనెను కలపండి. కొబ్బరినూనె మరియు తేనె ఒక కప్పులో తీసుకొని వేడి నూరు ఉన్న గిన్నెలో ఉంచండి. కొన్ని నిముషాల వరకు, కప్పులో మిశ్రమం నులివెచ్చగా అయ్యేంత వరకు ఉంచండి. ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసిన వెంటనే, తలకు టవల్ ఉన్నప్పుడే తలమీద పోయండి. ఇలా 20 నిముషాల వరకు ఉంచి తరువాత కడగండి.

వినెగార్ తో శుభ్రం చేసుకోండి

వినెగార్ తో శుభ్రం చేసుకోండి

వినెగార్, ఇది ఎక్కువగా ఆపిల్ ఆపిల్ రసం నుంచి చేసిన పానీయం; ఇది మీ జుట్టును శుభ్రపర్చడానికి మరియు ఒకే సమయంలో pH స్థాయి సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. ఇందువలన దీనిని ఒక మంచి హెయిర్ కండిషనర్ గా పేర్కొంటారు. రెండు కప్పుల నీటిలో వినేగార్ ను కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అలానే 20-30 నిముషాల వరకు ఉంచండి. ఈ మిశ్రమం జుట్టులో ఇనికిపోయేవరకు మీ వేళ్ళతో 4-5 సార్లు జుట్టును మర్దన చేయండి. తరువాత చల్లటి నీటితో కడగండి. ఈ కండిషనర్ మీరు తలస్నానం చేసినప్పుడు వదలని ఏ రసాయన, షాంపూ లేదా కండీషనర్ గాని తొలగించడంలో సహాయపడుతుంది.

మింట్ కండిషనరు

మింట్ కండిషనరు

కావలసినవి: నీరు 3 గ్లాసులు, మింట్ ఆకులు ఒక గిన్నెడు

విధానం: 2-3 గ్లాసుల నీటిలో మింట్ ఆకులను బాగా వేడి చేయండి మరియు వడ కట్టండి. దీనిని చల్లపర్చండి. ఈ ద్రవాన్ని మీ జుట్టుకు షాంపూ చేసిన తరువాత పట్టించండి.

ఇంట్లో తయారుచేసుకునే కండిషనర్ కు కొన్ని లాభాలు

ఇంట్లో తయారుచేసుకునే కండిషనర్ కు కొన్ని లాభాలు

మీ జుట్టుకు సరిపడేలాగా తయారు చేసుకోవొచ్చు మరియు మూలికలు లేదా సుగంధద్రవ్యాలను గాని కలిపి మీ కండిషనర్ తయారు చేసుకోవొచ్చు.

జిడ్డైన/నూనెగా ఉన్న జుట్టు కోసం బేరిపండు, లావెండర్, నిమ్మ, రోజ్మేరీ, చందనం, టీ ట్రీ లేదా యలంగ్ యలంగ్ వంటి నూనెలను 6-8 చుక్కలను కండిషనర్ తో కలపండి.

పొడిగా మరియు చుండ్రు ఉన్న జుట్టు కోసం మీరు టీ ట్రీ, పిప్పరమెంటు బిళ్ళ, యూకలిప్టస్, నిమ్మ, సేజ్, లేదా రోజ్మేరీ వంటి సుగంధ నూనెలను 6-8 చుక్కల వరకు కలపవొచ్చు.

కండిషనర్

కండిషనర్

రోజ్మేరీ, అన్నిరకాల జుట్టుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన హెర్బ్. ఆపిల్ రసం నుంచి చేసిన పానీయం, వినెగార్ లో 1-2 వారాల వరకు తాజా రోజ్మేరీ కొమ్మలను నానబెట్టండి. వడకట్టి రోజ్మేరీని తీసివేయండి మరియు ఈ వినేగార్ ను మీ కండిషనర్ తయారీలో వినియోగించండి, మిగిలినది భవిష్యత్తులో వాడటానికి ఉపయోగించవొచ్చు. రోజ్మేరీ, ఈ హెర్బ్ అన్ని ప్రయోజనాలతోపాటు ఒక ఆహ్లాదకరమైన చక్కని వాసనను ఇస్తుంది. మీరు రోజ్మేరీ నూనెను కలిగిఉంటే, మీరు రోజ్మేరీతో జత చేసి తయారైన వినేగార్ కోసం వేచిఉండనక్కరలేదు. మీరు రోజ్మేరీ నూనెను మీ కండీషనర్ కు 6-8 చుక్కలు కలపవొచ్చుమరియు ఇది తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉందన్నమాట.

English summary

8 Best Natural Hair Conditioners

You might think avocados, bananas, honey and coconut as the perfect ingredients for a fabulous recipe? Well, what if we tell you they are actually used to make a natural hair conditioner. Our hair needs good conditioning after a shampoo.
Desktop Bottom Promotion