For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బనానా హెయిర్ ప్యాక్ తో పట్టుకుంటే జాలువారే కురులు...!

|

ప్రపంచం మొత్తానికి హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. హెయిర్ ఫాల్ అరికట్టడానికి మనం ఏదో ఒకటి చేయాలనుకొంటాం. ఇంకా హెయిర్ బాగా పెరగాలని ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. కానీ, కొన్ని చిట్కాలు మరియు చికిత్సలు మాత్రమే మంచి ఫలితాలను చూపెడుతాయి. హెయిర్ ప్యాక్ చాలా సాధారణ పద్దతి. దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు. హెయిర్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కేశాలు మెత్తగా, మందంగా పెరుగుతాయి.

హెయిర్ ప్యాక్ లో చాలా రకాలు ఉన్నాయి. అందులోనూ వివిధ రకాల వస్తువులు ఉదా పెరుగు, తేనె, వెనిగర్, గుడ్డు, హెన్నా, నిమ్మ వంటి వాటితో హెయిర్ ప్యాక్స్ వేసుకుంటుంటాం. అలాగే బనానా(అరటితో)హెయిర్ ప్యాక్ మీరెప్పుడైనా విన్నారా? అరటి పండులో హెయిర్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇది పొడిబారిన, చిక్కుబడిన మరియు రఫ్ హెయిర్ ను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. బనానా హెయిర్ మాస్క్ ఇంకా కేశాలను మృదువుగా మరియు సున్నితంగా పట్టుకుంటే జారిపోయేలా తయారవుతాయి.

ఈ సీజన్ లో ఏర్పడే జుట్టు సమస్యలు చుండ్రు, తల దురద, పొడిబారిన జుట్టు వంటి సాధారణ సమస్యలకు మంచి నివారణోపాయని. అందుకే బనానా హెయిర్ ప్యాక్ చాలా పాపులర్ అయింది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని తగ్గించి, మృదువైన కేశాలను పొందాలనుకుంటే కొన్ని బనానా హెయిర్ ప్యాక్ లను తలకు ఎలా వేసుకోవాలో క్రింది పద్దతులను చూడండి....

Banana Hair Packs For Dry Hair

1. బనానా మరియు పాలతో ప్యాక్: హెయిర్ ఫ్యాల్ ను అరికట్టడంలో ఇదొక అద్భుతమైన హెయిర్ ప్యాక్. ఇంకా కేశాలను సిల్కీగా మరియు సున్నితంగా ఉంచుతుంది. బాగా పండిన బనానాను గుజ్జులా తయారు చేసి అందులో ఒకటి లేదా రెండు చెంచాల పాలు పోసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. తల మాడుకు కూడా బాగా పట్టించి, అరగంట పాటు అలాగే వదిలేసి, చల్లని నీటితో మంచి షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి దాంతో మీ కురులు సున్నితంగా మారుతాయి.

2. బనానా-పెరుగు మరియు తేనెతో హెయిర్ ప్యాక్: ఒక గిన్నెలో అరటి పండు గుజ్జును తీసుకొని అందులో కొద్దిగా పెరుగు, రెండు మూడు చుక్కల తేనె మరియు పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు చుండ్రు ఉన్నట్లైతే ఈ మిశ్రమంలోనే నిమ్మరసం కూడా కలుపుకొని తలకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేసి చల్లటి నీటితో తలస్నానం చేయాలి.

3. పొడిబారిన కేశాలకు బనానా మరియు బాదాం: పొడిబారి చిక్కుబడిని కేశాలకు నానబెట్టిన బాదాం, అరటిపండు ను మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి దానికి కొద్దిగి పెరుగు లేదా పాలు చేర్చి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల చిక్కువదిలి, కేశాలు మృదువుగా తయారవుతాయి.

4. గుడ్డు మరియు బనానా హెయిర్ ప్యాక్: కేశాలను మృదువుగా, సిల్కీగా మరియు ఆరోగ్యంగా ఉంచే వాటిలో గుడ్డు ప్రధానమైనది. గుడ్డును, బనానాను ఉపయోగించి పొడిబారిన కేశాలను నివారించి సున్నితమైన జుట్టును పొందవచ్చు. గుడ్డు, బనానా మిశ్రమాన్నికురులు, తలమాడుకు పట్టించి ఒక గంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల, సిల్కీ మరియు షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

ఈ హోం మేడ్ బనానాన హెయిర్ ప్యాక్స్ అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ఈ హెయిర్ ప్యాక్ ను పొడి ఉన్న కేశాలకు అప్లై చేయకూడదు. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసే ముందు కురులకు హాట్ ఆయిల్ మసాజ్ చేసిన అరగంట తర్వాత ఈ హెయిర్ ప్యాక్స్ అప్లైచేయవచ్చు.

English summary

Banana Hair Packs For Dry Hair | బనానా హెయిర్ ప్యాక్ తో సిల్కీ అండ్ షైనీ హెయిర్

Hair fall is the most common problem of a majority of people worldwide. We all want to try anything possible to stop hair fall and increase hair growth. However, very few remedies or treatments show the best results. Applying a hair pack can be a natural remedy to stop hair fall and get soft and thick hair.
Story first published: Wednesday, February 27, 2013, 11:34 [IST]
Desktop Bottom Promotion