For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు హెయిర్ సెరమ్ అప్లై చేస్తే మంచిదేనా..?

|

సాధారణంగా జుట్టు అందంగా ఉంటే మనిషి మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా..ఆకర్షణీయంగా కనబడరు. ముఖ్యంగా జుట్టు సమస్యల్లో జుట్టు పల్చబడ్డం, పొడి జుట్టు, రఫ్ హెయిర్ మరియు చిక్కుబడ్డ హెయిర్ ఈ సమస్యలన్నీ కూడా కేశాల అందాన్ని తగ్గించేస్తాయి. ఈ సమస్యలకు మంచి పరిష్కార మార్గం కూడా ఉంది అదే ‘హెయిర్ సెరమ్'.హెయిర్ స్టైల్ ఫ్యాషన్‌గా, సిల్కీగా,స్మూత్ గా, పూర్తిగా స్ట్రెయిట్ లుక్ కావాలంటే శిరోజాల ఐరనింగ్‌కు ముందు హెయిర్ సెరం వంటి సరైన ఉత్పత్తుల్ని జుట్టు పరిరక్షణకు వాడడం చాలా ముఖ్యం. హెయిర్ సెరమ్ సిలికాన్ ఉండటం వల్ల ఇది కేశాలకు కోట్ చేయడం వల్ల కేశాలు మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. అంతే కాదు ఇది కఠనమైన సూర్య రశ్మి, అధిక వేడి మరియు కాలుష్యం నుండి కేశాలను కాపాడుతుంది. హెయిర్ సెరమ్ మీ కేశాలకు చక్కటి రూపాన్ని మరియు జుట్టు ఆరోగ్యంగా ఉన్నదనే అనుభూతిని ఇస్తుంది.

హెయిర్ సెరమ్ లో సిలికాన్ కంటెంట్ డ్యామేజ్ అయిన జుట్టును తిరగి పెరగడానికి సహాయపడుతాయి. అయితే, కొంత మంది కేశాలకు ఇది హాని కలిగిస్తుంది. కొన్ని రసాయనాలు కలిగిన క్లెన్సర్లను ఉపయోగించి జుట్టు నుండి సిలికాన్ ను చాలా సులభంగా తొలగించుకోవచ్చు . మరి హెయిర్ సెరమ్ మీ కేశాలకు మంచిదా..లేదా హాని కలిగిస్తుందా ఒకసారి చూద్దాం..

లస్ట్రే(నునుపుగా):

లస్ట్రే(నునుపుగా):

హెయిర్ సెరమ్ మీ కేశాలకు అప్లై చేయడం వల్ల కేశాలకు నునుపు దనాన్ని అందిస్తుంది. పొడిజుట్టు, చిక్కుబడ్డ మరియు కఠినమైన, మరియు నిర్వాహణకు కష్టంగా ఉన్న హెయిర్ చాలా మంది మహిళలకు ఉన్న సమస్య. కాబట్టి హెయిర్ సెరమ్ కేశాలను సక్రమంగా నిర్వహించడానికి మరియు షైనింగ్ గా మరియు హెల్తీగా ఉంచుకోవడానికి హెయిర్ సెరమ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది నిర్జీవమైన కేశాలను జీవ ఇస్తుంది మరియు చిక్కు ముడులను తొలగిస్తుంది.

హెయిర్ డ్యామేజ్:

హెయిర్ డ్యామేజ్:

హెయిర్ సెరమ్ ను అప్లై చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా రక్షింపబడుతుంది. జుట్టుకు ఉపయోగించే స్టైలింగ్ టూల్స్, కాలుష్యం, దుమ్ము మరియు తేమ వంటి వాటినుండి జుట్టుకు హెయిర్ సెరమ్ రక్షక కవచంలా ఉంటుంది. అందువల్ల, జుట్టు పొడిబారకుండా మరియు దీర్ఘకాలం బహిర్గతం కావడం వల్ల కేశాలు పెలుబారకుండా కాపాడటానికి హెయిర్ సెరమ్ రక్షిస్తుంది.

హెయిర్ సెరమ్

హెయిర్ సెరమ్

హెయిర్ సెరమ్ మీ కేశాలు ఎంత పొడవు ఉంటే అంతపొడవు వేళ్ళతో అప్లై చేయాల్సి ఉంటుంది. హెయిర్ సెరమ్ ను తల మాడుకు అప్లై చేయకూడదు. లేదంటే ఇది కేశాలు జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. మంచి ఫలితం కోసం తడి జుట్టు మీద హెయిర్ సిరమ్ ను అప్లై చేయడం మంచిది.

యూవీ ప్రొటక్షన్:

యూవీ ప్రొటక్షన్:

కొన్ని హెయిర్ సెరమ్స్ యూవీ ప్రొటక్షన్ ఫార్ములాస్ కలిగి ఉంటాయి. నిరంతరం సూర్యకిరణాలకు జుట్టు బహిర్గతం కావడం వల్ల జుట్టు నష్టం కలుగుతుంది . హెయిర్ సెరమ్ ను కేశాలకు పట్టించడం వల్ల హెయిర్ సెరమ్ లోని యూవీ ప్రొటెక్షన్ ఫార్ములాస్ సన్ డ్యామేజ్ ను నుండి కేశాలను రక్షించేందుకు సహాయపడుతుంది.

కండీషనింగ్:

కండీషనింగ్:

మీ జుట్టుకు హెయిర్ సెరమ్ మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. మీ జుట్టును జిడ్డుగా మరియు చిక్కుగా మార్చే నూనెలను ఉపయోగించడానికి బదులు హెయిర్ సెరమ్ ను ఉపయోగించడం మంచిది. హెయిర్ సరెమ్ చాలా ప్రభావవంతంగా చిక్కుబడ్డ మరియు కఠినమైన జుట్టు నియంత్రించడానికి, మరియు ఆరోగ్యకరమైన నిర్వాహనణకు బాగా సహాయపడుతుంది.

స్టైలింగ్ టూల్:

స్టైలింగ్ టూల్:

ఒక స్టైలింగ్ టూల్, హెయిర్ సెరమ్ మీ కేశాలకు చాలా మంచిది. కేశాలను హీట్ చేయడం లేదా క్లరింగ్ చేసే టూల్స్ వల్ల దీర్ఘకాలంలో కేశాలకు తీవ్ర డ్యామేజ్ కలగవచ్చు. అదే మీ కేశాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కలగకుండా హెయిర్ సెరమ్ ను ఉపయోగించవచ్చు. స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడానికంటే ముందే హెయిర్ సెరమ్ ను ఉపయోగించడం వల్ల, అప్పుడు జుట్టుకు అధిక వేడికి గురికాండు నిరోధిస్తుంది. ఐరన్ సెరమ్ మామూలు సెరమ్‌కు భిన్నంగా ఉండి హీట్ వల్ల జుట్టుకు కలిగే నష్టాన్నుంచి కాపాడుతుంది. మాడుకు అరంగుళం దూరంగా స్ట్రెయిటనింగ్ ఐరన్ నుంచాలి, లేకుంటే కాలే అవకాశం ఉంటుంది. ఐరన్‌కు బదులు హెయిర్ డ్రయ్యర్ వాడుతున్నట్లు అయితే ప్లాట్ బ్రష్ ఉపయోగించాలి. ఒకసారి ప్రతి సెక్షన్‌ను తిన్నగా డ్రైచేశాక చివరిగా కూల్ ఎయిర్ వాడాలి. దీని వల్ల అదనపు మెరుపు లభిస్తుంది.

అయితే, కేశాలకు హెయిర్ సెరమ్ ఉపయోగించడం వల్ల హెల్తీ హెయిర్ లుక్ ను అంధిస్తుంది. హెల్తీ హెయిర్ లుక్ తో పాటు కేశాలకు మంచి పోషణ మరియు షైనింగ్ కవాలంటే అప్పుడు మీరు ఖచ్చతంగా సమతుల్య ఆహారం తీసుకోవడాన్ని తప్పక అనుసరించాలి.

English summary

Benefits Of Using Hair Serum

Hair serums are considered a miracle solution for dry, rough and frizzy hair. It makes your hair look manageable, smooth and silky. Heir serums contain silicon, which coats the hair and reflects light, making your hair look shiny.
Desktop Bottom Promotion