For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో సాధారణ జుట్టు సమస్యలు.. నివారణా చర్యలు.!

|

సాధారణంగా బ్యూటీ విషయంలో మహిళకంటే పురుషులకు అంత ఆసక్తి, అందం గురించి ఆందోళనలు అంతగా ఉండవు. అయితే ఈ భావన ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే పురుషులు కూడా వారు అందంగా కనబడుటకోసం మరియు స్టైల్ మెయింటైన్ చేయడం వంటి వాటిల్లో చురుగ్గానే ఉన్నారు. ఒక్క విషయం గమనించినట్లైతే మీరు వారి అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో పసిగట్టేయవచ్చు. ఉదాహరణకు వారి జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. ఎందుకంటే జుట్టుకు సంబంధించి అనేక సమస్యలకు కారణం అయ్యేవాటిలో భావోద్వేగ ఒత్తిడి మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం,వంటి ఇబ్బందికరమైన సమస్యలున్నాయి. పురుషుల బాడీ ఇమేజ్ లో జుట్టు ప్రధాన పాత్రపోషిస్తుంది. అందుకే ఆ జుట్టు గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

పురుషుల్లో ఫ్యాషన్ మరియు హెయిర్ ట్రెండ్ కాలక్రమేణా చాలా మార్పు తీసుకొచ్చింది. పురుషుల జుట్టుసమస్యలు వారి పని వాతావరణానికి దగ్గరి సంబంధం ఉంది. పురుషులు కాలుష్య వాతావరణంలో పనిచేయడం వల్ల వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంకా వేడి వాతావరణంలో పనిచేయడం మరియు అధిక ఉష్ణోగ్రత కలిగిన కొలిమిలో లేదా ఇంజిన్ గదుల్లో లేదా కార్యాలయాల్లో పని చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోవడానికి కారణం అవుతున్నాయి. ఇటువంటి కొన్ని సాధారణ జుట్టు సమస్యలు నివారించుకోవడానికి కేశాల మీద తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Common Hair Problems Of Men

జుట్టు రాలిపోవడం: ప్రపంచవ్యవాప్తంగా చాలా మంది పురుషులు తమ జుట్టును కోల్పోయినవారి మెజారిటీనే ఎక్కువగా కనబడుతున్నారు. జుట్టు సమస్యలు ఎదుర్కోవడంలో స్త్రీల కంటే పురుషులే అధికంగా బాధపడుతున్నారు. అతి కురచగా ఉండే పురుషుల జుట్టు నష్టపోవడాన్ని దాచాలంటే కష్టం. కాబట్టి, మీ జుట్టు గురించి అజాగ్రత్తగా ఉంటే మాత్రం, హెయిర్ కేర్ గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. సమస్య వచ్చిన తర్వాత నివారించడం కంటే సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచి పద్దతి.

బట్టతల: పురుషుల్లో మేల్ హార్మోన్స్ జుట్టు సమస్యల కారణాల్లో ఒకటి. పురుషుల్లోని హెయిర్ ఫోలిసెల్స్ దీన్నే డైహైడ్రో టెస్టోస్టిరాన్ అంటారు. దీని వల్ల బట్టతల ఏర్పడుతుంది. బట్టతలకు మరో కారణం జన్యు సంబంధిత ప్రభావం కూడా ఉన్నది. ఇంకా చాలా వరకూ పురుషులు వారి జుట్టు రాలిపోవడాన్ని సీరియస్ గా తీసుకొని ఆందోళన చెందుతారు. ఇటువంటి ఆందోళనలు, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి బట్టతల ఏర్పడటానికి ముఖ్య కారణాలు. కాబట్టి ఎప్పుడతై తన జీవన శైలిలో మార్పులు చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారో అటువంటి వారు తప్పకుండా బట్టతల ఏర్పకుండా నివారించగలరు.

చుండ్రు: పురుషుల్లో చుండ్రు బాధ కలిగించడంతో పాటు చిరాకు తెప్పించే సమస్య. ఇది అసౌకర్యం కలిగిస్తుంది. మహిళలల్లో కంటే, పురుషుల్లో ఈ చుండ్రు సమస్య అత్యంత క్లిష్టంగా ఉంటుంది. అందుకు తగిన నివారణా చర్యలు తీసుకోవడం వల్ల చుండ్రు రాకుండా నియంత్రించవచ్చు. అప్పటికి చుండ్రు తగ్గకుండా మిమ్మల్ని బాధిస్తుంటే తప్పకుండా వైద్యసలహా తీసుకోవడం చాలా అవసరం.

అనుకోకుండా జుట్టు రంగు మారడం: పురుషుల్లో అనుకోకుండా జుట్టురంగు (గ్రేకలర్ లోనికి )మారడం ఇదో రకమైన సమస్య. ఇటువంటి జుట్టును ఎవ్వరూ ఇష్టపడరు. జన్యుశాస్త్రం ప్రకారం ఇటువంటి సమస్య పని చేసేవాతారవణం మరియు రసాయన బహిర్గతం వంటి అనేక కారకాలు కేశాల రంగును మార్చడంలో ఒక కారణం కావచ్చు. ఇది గుర్తించిన తర్వాత దీన్ని నివారించడం చాలా కష్టం కాబట్టి ఇటువంటి సమస్య తలెత్తక ముందే మంచి ఆహారంతో పాటు కొన్ని జుట్టు సంరక్షణ పద్దతుల పాటించడం అవసరం.

జుట్టు పల్చబడడం: జుట్టు పల్చబడానికి అనేక కారణాలున్నాయి. పురుషుల్లో జుట్టు పల్చబడటానికి సర్వసాధారణంగా ఒత్తిడి లేదా పూర్ డైట్, జన్యుసంబంధం, వంశపారంపర్యం వల్ల జుట్టు పల్చబడటానికి కారణాలు. ఇంకా జుట్టుపలచబడటానికి బలహీనమైన జుట్టు పోషణ. జుట్టు రాలిపోవడానికి కారణం కావచ్చు. కాబట్టి మీ జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని, నష్టాన్ని అరికట్టవచ్చు.

English summary

Common Hair Problems Of Men | పురుషుల్లో సాధారణ జుట్టు సమస్యలు.. నివారణా చర్యలు.!

Usually there is a notion that men do not have much beauty concerns like women. But this concept is absolutely wrong. Men are also conscious about their looks and style. Seldom you would find a man caring about his hair. Problems associated with hair are quite embarrassing with emotional distress and lack of self-confidence. Hair has a great role to play in men's body image so you need to care for it.
Desktop Bottom Promotion