For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలను కూల్ గా ఉంచే సమ్మర్ హెయిర్ ప్యాక్స్ ...!

|

వేసవి కాలంలో శరీరాన్ని మాత్రమే కాదు కేశాలను కూడా కూల్ ఉంచుకోవడం ఎంతైనా అవసరం. వేసవి కాలం మొదలైందంటే చాలు శరీరంలోని నీరంత ఇంకిపోవతుంది. దాంతో శరీరం పొడిబారుతుంది. రాషెష్ ఏర్పడుతాయి. చిరాకు కలిగిస్తాయి. ఒక్క శరీరానికి మాత్రమే కాదు..కేశాలకు కూడా వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి మిగిలిన సీజన్ల కంటే ఈ వేసవి సీజన్ లో మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం కొంచం కష్టమైన పనే. అంతే కాదు మీరు వేసవి కాలంలో కేశ సంరక్షణకు తీసుకొనే కొన్ని జాగ్రత్తల్లో కరెక్టైన టెక్నిక్స్ తెలుసుకొని ఉండాలి. అప్పుడు కేశాలతో పాటు మీ స్లాప్ ను కూడా శుభ్రంగా..వేసవిలో చల్లగా ఉంచుకోగలుగుతారు.

Cooling Summer Hair Pack Recipes

శరీరం కూల్ గా ఉంచుకోవడానికి సీజన్ బట్టి పండ్లు కూరగాయలు, డ్రింక్స్ ఇలా ఎన్నో మార్పులు చేసుకుంటాం. అయితే కేశ సంరక్షణలో కూడా సరైన ఆహారపు అలవాట్లతో పాటు చల్లని హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం చాలా అవసరం. ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్స్ ను తలకు వాడటం వల్ల మీ తల మాడును వేడి నుండి రక్షించి కూల్ గా ఉంచుతుంది. అందుకు కొన్ని హెయిర్ ప్యాక్స్ రిసిపిలున్నాయి. ఇవి సమ్మర్ హీట్ తో పోరాడుతాయి. మరి మీరో ఈ హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగించి మీ తలను కూల్ కూల్ గా ఉంచుకోండి...

1. తేనె, గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టి పసుపుగా ఉన్న సొన మాత్రమే వేయాలి . తర్వాత దానికి 2చెంచాల తేనె మరియు 2 చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తూ గిలకొట్టాలి. ఇప్పుడు ఈ సమ్మర్ హెయిర్ ప్యా క్ కు తలకు బాగా పట్టించి పది నిముషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ మీ తలకు చల్లదన్నాన్ని ఇవ్వడంతో పాటు కేశాలు మెరిసేలా చేస్తాయి.

2. కొబ్బరి నూనె మరియు రెడ్ వైన్: కొబ్బరి నూనె మరియు రెడ్ వైన్ రెండూ సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ సమ్మర్ హెయిర్ ప్యాక్ చిక్కగా లేకపోయినా తలకు పట్టించడం వల్ల కారిపోతుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు హెయిర్ కు ప్యాక్ వేసి షవర్ క్యాప్ ను ధరించాలి . పది నిముషాల తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీ తల చాలా కూల్ గా విశ్రాంతి పొందుతుంది.

3. పెరుగు మరియు నిమ్మరసం: వేసవిలో చాలా తరచుగా ఉపయోగించే హెయిర్ ప్యాక్ ఇది. వేసవిలో సరైన హెయిర్ కేర్ తీసుకోవాలనుకొనే వారి కోసం రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి కూలింగ్ రెండు మాయిశ్చరైజింగ్. పెరుగు మరియు నిమ్మరసం రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు, కేశాల చివరి వరకూ బాగా పట్టించాలి. పది నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీకేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎటువంటి చుండ్రు మరియు దురద సమస్యలుండవు మరియు స్లాప్ కు తగినంత హైడ్రేషన్ కలిగిస్తుంది.

4. కీర దోస మరియు సోర్ క్రీమ్: వేసవి కాలంలో మీ చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తారు. మరి కేశాల సంగతేంటి?మీ కేశాలు సూర్యరశ్మికి గురైతే వివిధ రకాల జుట్టు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి వేసవిలో కేశ సంరక్షణ కోసం కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. తర్వాత అందులో సోర్ క్రీమ్ వేసిబాగా మిక్స్ చేసి తలకు పట్టించి శుభ్రం చేసుకోవాలి. ఈ స్మూత్ సమ్మర్ కూల్ హెయిర్ ప్యాక్స్ చాలా ఉపయోగకరం మరియు ఆరోగ్యకరం మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

English summary

Cooling Summer Hair Pack Recipes | మీ తల కూల్..కూల్ గా చల్ల..చల్లగా...!

The Indian summer is a time when you would like to keep yourself cool. The three months of relentless heat drag on and dry every part of your body including your hair. Thus it is not enough to keep your skin and body hydrated. You must also take care of your hair in summer using the right techniques to keep your scalp cool.
Story first published: Friday, May 17, 2013, 12:46 [IST]
Desktop Bottom Promotion