For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకర్షణీయమైన జుట్టు కోసం అద్భుత చిట్కాలు

|

జుట్టు ఊడటానికి ఇంకొక చెడ్డ రోజా? అద్భుతమైన, ఆరోగ్యకరమైన జుట్టు ఉండటంవలన మీ రూపురేఖలు మారిపోతాయి. ఇక్కడ మీ కేశాలను ఆరోగ్యకరంగా చేయటానికి కొన్ని సులభమైన, సాధారణమైన కొన్ని పాయింట్లను పొందుపరుస్తున్నాము.

మీ కేశాలు పొడిగా మరియు రింగులుగా ఉంటే, వారానికి ఒకసారి షాంపూ మరియు కండిషనర్ చేసిన తరువాత వేడి నూనె మర్దన చేయండి. కొన్ని వారాలవరకు ఎక్కువగా కలరింగ్, పర్మింగ్ మరియు ఇతర రసాయన చికిత్సలు మానుకోండి.

గృహంలో చేసిన హెయిర్ మాస్కులను ఉపయోగించటం మరియు అధిక వేడిగాలితో కేశాలను ఆరబెట్టుకోవటం నివారించటం వంటి సాధారణ చిట్కాలతో మీ కేశాలను అందంగా ఉంచుకోవొచ్చు.

గృహంలో ఈ సులభమైన హెయిర్ మాస్క్ తయారుచేసుకోండి

మెంతులను ఒక సగం కప్పు తీసుకోండి

మెంతులను ఒక సగం కప్పు తీసుకోండి

రాత్రంతా రెండున్నర కప్పుల నీటిలో నాననివ్వండి

నానిని మెంతులను గ్రైండర్ జార్ లో వేసి, మెత్తగా చేయండి.

ఈ మెత్తని మెంతి పేస్ట్ ను తలకు పట్టించండి

కొంత సమయం దాకా అలానే వదిలివేయండి మరియు తరువాత కడగండి.

మీ జుట్టుకు షాంపూ చేస్తున్నప్పుడు

మీ జుట్టుకు షాంపూ చేస్తున్నప్పుడు

మీరు జుట్టు శుభ్రపరచటంపైనే దృష్టి పెట్టి, మీ వేళ్లతో సున్నితంగా నురుగుతోపాటుగా జుట్టును మసాజ్ చేయండి. తలస్నానం తరువాత, క్రీమీ కండీషనర్ వర్తింపచేయండి. మీ జుట్టు యొక్క ప్రతి విభాగానికి కోట్ వేయండి మరియు తరువాత సరిగా కడగండి.

చేయకూడని పనులు

చేయకూడని పనులు

మీ జుట్టుకు వేడి-స్టైలింగ్ లేదా ఐరన్లను ఉపయోగించటం మరియు వేడి కర్లర్స్ ను ఉపయోగించటం. మీ జుట్టును సహజంగానే ఆరనివ్వండి.

ఆల్కహాల్ ఉన్న కొన్ని హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను వాడటం

అపరిశుభ్రమైన ఉపకరణాలు ఉపయోగించటం. ఎల్లప్పుడూ మీ దువ్వెనలు మరియు బ్రష్లను శుభ్రంగా ఉంచండి. తరచుగా మీ తలస్నానంకు కఠినమైన షాంపూలను వాడటం.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

తలస్నానానికి ముందు తలకు కండీషన్ అప్లై చేస్తే కురులు మెరుస్తుంటాయి. అలోవెరా జెల్ తలకు పట్టించడం వల్ల కేశాలు అద్భుతంగా మెరుస్తూ, మెత్తగా నునుపు గా ఉంటాయి.

చిట్కా

చిట్కా

సాధారణంగా మనం అలసిపోయిన తరువాత యెంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇల్లు చేరుకోవాలని చూస్తాము. మీకు పొడవు జుట్టు ఉంటే, ఆ జుట్టును మీరు పడుకునే ముందు దానిని దగ్గరగా చేర్చి కట్టుకోవటం మంచిదని నిపుణులు చెపుతున్నారు. జుట్టును పైకి బాండ్ పెట్టి కట్టుకోండి లేదా జడ అల్లుకోండి. మీరు పడుకున్నప్పుడు జుట్టును జడగా అల్లుకోవటం మంచిది.

నూనెతో మీ తలను మర్దన చేసుకోవటం

నూనెతో మీ తలను మర్దన చేసుకోవటం

మీ జుట్టుకు రోజూ నూనె రాయటం వలన మీ జుట్టు అందంగా, ఒత్తుగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. నెమ్మదిగా తల మీద నూనెతో మర్దన చేయండి. మూలికలతో నింపబడిన ఆలివ్, జొజోబా, బాదం లేదా కొబ్బరి నూనెను వాడితే మీ జుట్టుకు పోషణ అందిస్తుంది.

సున్నితమైన తల

సున్నితమైన తల

మర్దన వాళ్ళ మంచి గాఢనిద్ర పడుతుంది మరియు మీరు మరుసటి రోజు చురుగ్గా నిద్ర లేచి, మీ కార్యక్రమాలు అన్నీ చురుగ్గా చేస్తారు.

మీరు నూనెను మీ జుట్టుకు రాసినప్పుడు, తప్పనిసరిగా జుట్టు చివరలకు కూడా రాయండి.

జుట్టు ఊడుతున్నదా?

జుట్టు ఊడుతున్నదా?

మీకు అవసరమైనవి:

అరకప్పు మెంతులు500 మీ.లి. స్వచ్చమైన కొబ్బరినూనె మరియు చాలా సూర్యకాంతి

పధ్ధతి: ఒక గ్లాస్ జార్ లో కొబ్బరినూనెను తీసుకుని అందులో మెంతులను నాననివ్వండి. సూర్యుని కిరణాలు సూటిగా పడేట్లుగా ఒక వారం పాటు, ప్రతిరోజూ మెంతులు నానవేసిన జార్ ను ఉంచండి. ఈ నూనెను వారాని మూడుసార్లు తలపై మర్దన చేస్తే జుట్టు ఊడటం తగ్గుతుంది.

మంచి కొబ్బరినూనెను తయారుచేయటం ఎలా !

మంచి కొబ్బరినూనెను తయారుచేయటం ఎలా !

ఒక డబుల్ బాయిలర్ (వేడినీరు పైగా ఉండేలా వేడి ప్రూఫ్ డిష్) తీసుకోండి మరియు కొబ్బరి నూనె 500 మి. లి. పోయండి. ఎండిన మందార ఆకులు మరియు పుష్పాలు, ఎండిన ఉసిరికాయ కొన్ని ముక్కలు, మహా భ్రింగరాజ్ ఆకులు (ఇవి ఆయుర్వేద దుకాణాలలో లభిస్తాయి)వేసి నూనెను మరగనివ్వండి.మీరు గులాబీ, లావెండర్, కామోమిల్ వంటి సుగంధద్రవ్యాలను కూడా జోడించవచ్చు. ఎక్కువసేపు నూనెను మరగనివ్వవొద్దు. ఒకసారి మరిగినతరువాత ఆ నూనెను ఒకటి,రెండు రోజులు అలానే ఉంచండి మరియు మీ కేశసంరక్షణ తైలం సిద్ధం.

English summary

Do all this for gorgeous hair


 Another bad hair day? A glorious crown of healthy hair can really make or break your entire look. Here are some simple points that when adhered to, can make your hair healthier.
Story first published: Wednesday, October 2, 2013, 10:04 [IST]
Desktop Bottom Promotion