For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిట్లిన జుట్టుకు వంటింటి చిట్కాలతో పరిష్కార మార్గం.!

|

ప్రస్తుత రోజుల్లో చివర్లు చిట్లిన శిరోజాలు చాలామందిని వేధించే సాధారణ సమస్య. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి అనేక కారణాలున్నాయి..ముఖ్యంగా వాతావరణం అధిక ఉష్ణోగ్రత మరియు కాలుష్యం వల్ల జుట్టు తొందరగా పొడిబారి చిట్లిపోతుంది. వీటితో పాటు కెమికల్ ప్రొడక్ట్స్, హాట్ స్టైలింగ్ టూల్స్, ఎప్పుడూ తలస్నానం చేయడం, తక్కువ నాణ్యత గల ఉత్పత్తుల వినియోగం, ఇవన్నీ కూడా జుట్టు చివర్లు చిట్లిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. దాంతో వాటి ఎదుగుదల సరిగా ఉండదు. అంతేకాకుండా జుట్టు బలహీనంగా మారిపోతుంది. శిరోజాలు నిర్జీవంగా మారి రాలిపోతాయి.

జుట్టు చిట్లడానికి కారణం ఏదైనా కావచ్చు, వెంటనే సరైన జాగ్రతలు లేదా నిర్వహాణ, లేదా చికిత్స తీసుకోకపోతే నిజంగా చాలా అసహ్యాంగా తయారువుతుంది. మీ జుట్టు అసహ్యంగా మరియు డ్యామేజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ సమస్యను నివారించాలంటే కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ మార్కెట్లో లభ్యం అయినా, అవి తాత్కాలిని పరిష్కారం పొందవచ్చు. కానీ, నష్టం ఇంకా జరుగుతూనే ఉంటుంది.

అలాంటి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే, ఇక్కడ కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. ఇవి చిట్లిన జుట్టుతో పోరాడటమే కాదు, ఎటువంటి కెమికల్ ట్రీట్మెంట్స్ లేకుండానే, జుట్టుకు అవసరం అయ్యే పోషణను కూడా అంధిస్తుంది. మరి చిట్లిన జుట్టును నివారించుకోవడానికి ఉపయోగపడే, సహాయపడే కొన్ని హోం రెమడీస్ మీద ఓ లుక్కేయండి...

బొప్పాయి ప్యాక్:

బొప్పాయి ప్యాక్:

బొప్పాయి కేశాలకు ఒక అద్భుతమైనటువంటి హెయిర్ ప్రొడక్ట్. బాగా పండిన బొప్పాయిని తీసుకొని గింజలను తొలగించాలి. వాటిని మెత్తగా చేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. దీనివల్ల కురులు చిట్లే సమస్య నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలడం సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

పాలు మరియు క్రీమ్:

పాలు మరియు క్రీమ్:

అరకప్పు పాలలో ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ మిక్స్ చేసి బాగా మిక్స్ తలకు పట్టించాలి. తర్వాత 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఆముదం:

ఆముదం:

ఆముదంనూనె, బాదం నూనె, ఆలివ్ నూనెను సరిసమానంగా తీసుకొని, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి . తర్వాత తలకు ఒక టవల్ చుట్టి, అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

బీర్:

బీర్:

బీర్ కేశాలకు ఏం చేస్తుందని మీరు ఆశ్చర్యం చెందవచ్చు. ఇది కేశాలకు ఒక అద్భుతమైన వస్తువు. బీర్ ను కొద్దిగా చేతిలోకి తీసుకొని తలకు మసాజ్ చేయాలి. జుట్టు మొదల్లు బాగా తడిసేలా బీర్ తో మసాజ్ చేయాలి. పది, పదిహేను నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. బీర్ స్మెల్ పూర్తిగా పోయేలా చేయాలి. లేదంటే ఇబ్బందికరమైన వాసన మిమ్మల్ని చుట్టుముడుతుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులోని సొన తీసుకొని, దానికి బాదాం ఆయిల్ మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయాలి. తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత రెగ్యురల్ షాంపూతో తలస్నానం చేయాలి.

నల్లని ఉద్దిపప్పు:

నల్లని ఉద్దిపప్పు:

బ్లాక్ లెంటిల్ (నల్లని ఉద్దిపప్పును)ను మరియు ఒక టీస్పూన్ ఉద్దిపప్పును రెండింటిని కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా పెరుగు మిక్స్ చేసి తలకు పట్టించి, రెండు గంట తర్వాత తలస్నానం చేయాలి.

తేనె:

తేనె:

చిట్లిన జుట్టుకు తేనె ఒక అద్భుత పదార్థాం. అరకప్పు పెరుగులో ఒక టేబు స్పూన్ తేనె మిక్స్ చేసి , తలకు బాగా మసాజ్ చేయాలి. 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేడి చేసి తర్వాత తలకు బాగా మసాజ్ చేయాలి . షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట అలాగే ఉండి. తర్వాత తలస్నానం చేయాలి.

అవొకాడో:

అవొకాడో:

ఇది ఆరోగ్యపరంగా మాత్రమే కాదు, సౌందర్య పరంగా కూడా చక్కటి ఫలితాన్నిస్తుంది. తలకు అవసరం అయ్యే పోషణను అంధిస్తుంది. అవొకాడోను తీసుకొని బాగా చిది, కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకొని తలకు పట్టించాలి . అరగంల అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి.

మొయోనైజ్:

మొయోనైజ్:

ఇది అవొకాడో కు ప్రత్యామ్నాయం. మీరు అవొకాడో మీకు అందుబాటులో లేకపోతే మొయోనైజ్ ను అప్లై చేయాలి . 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి . ఇలా వారానికి రెండు సార్లు చేయడం మంచిది.

English summary

Easy Home Remedies For Split Ends


 Split hair ends is a common problem among most women. Split ends is also known as trichoptilosis. There are wide range of causes due to which split ends occur.
Story first published: Monday, September 2, 2013, 18:00 [IST]
Desktop Bottom Promotion