For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టతలను నివారించి, జుట్టుపెరిగేలా చేసే10 పవర్ ఫుడ్స్

|

చాలా మంది ప్రజల్లో గతంలో కంటే ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం మరియు బట్టతల ఏర్పడటం అతి పెద్ద సమస్యగా మారింది. అత్యధిక కాలుష్యం కలిగిన వాతావరణం, మన జీవనశైలి మరయు చెడు ఆహారపు అలవాట్లు వల్ల పరిస్థితి మరింత చెత్తగా మారుతోంది. ముఖ్యంగా మనం తీసుకొనే ఆహారం గురించి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు తీసుకొనే జంక్ ఫుడ్ లో ఎటువంటి న్యూట్రీషియన్స్ ఉండవని, ఇవి రసాయనాలతో తయారుచేయబడినివి ఆలోచించకుండా ఈ జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల చర్మం మరియు కేశ సంరక్షణలకు సంబంధించిన సమస్యలు అధికంగా పెరుగుతున్నాయి . కాబట్టి ఈ సమస్యలను మీరు నిజంగా నివారించాలనుకుంటే, బట్టతల రాకుండా ముందుజాగ్రత్త తీసుకోవాలనుకున్నా, ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గించాలన్నా మీరు హెల్తీగా తినడం అలవాటు చేసుకోవాలి. బట్టతలను నివారించడంలో అనేక హెల్తీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే అత్యధిక న్యూట్రీషియన్స్ చాలా అవసరం అవుతాయి. మీకు బట్టతల రాకుండా ఉండాలన్నా, ఆరోగ్యకరమైన జుట్టు పెరగాలన్నా, పూర్తిపోషకాంశాలు కలిగిన న్యూట్రీషియన్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ తో ఫుల్ ఫిల్ చేయాలి. జుట్టుకు ప్రత్యేకమైన ప్రోటీనులు మరియు వివిధ రకాల న్యూట్రీషియన్స్, విటమిన్ ఎ, బి, ఇ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మినిరల్స్ మరియు పొటాషియ, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ మరియు యాంటీఆక్సిడెంట్స్ చాలా అవసరం. బట్టతల రాకుండా నివారించాలంటే ఈ పోషకాంశాలన్నీ పుష్కలంగా ఉండే ఆహారాలను మీరు రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. దాంతో జుట్టు పెగుదలలో మార్పు కనబడుతుంది.

అలాగే లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్, నట్స్, వెజిటేబుల్స్, మరియు తాజా పండ్లు వంటివి మీ డైలీ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడు పైన చెప్పబడిన అన్ని పోషకాలను మీరు పొందగలుగుతారు. బట్టతలను నిరోధించి, జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని ఆహారాలను క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. గుడ్లు:

1. గుడ్లు:

జుట్టు పెరుగుదలకు మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ప్రోటీనులు చాలా ముఖ్యం అని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. అటువంటి పుష్కలమైన ప్రోటీనుల కలిగి ఆహారం గుడ్లు. అంతే కాదు వీటిలో ఇంకా విటమిన్ బి, పుష్కలంగా ఉండి, బట్టతలను నివారిస్తుంది.

2. డైరీ ప్రొడక్ట్స్ :

2. డైరీ ప్రొడక్ట్స్ :

మీరు శాకాహారం అయితే, మీరు చాలా త్వరగా జుట్టు కోల్పోతున్నట్లైతే మీరు ఖచ్చితంగా కొన్ని డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోవల్సి ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ లో పెరగు మరియు వెన్న తీసిన పాలు వంటివి విటిమిన్ ఎ కు ఒక మంచి మూలకం. ఇంకా తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచి, బట్టతలను అరికడుతుంది.

3. గ్రీన్ లీఫ్స్:

3. గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్ లో చాలా అధిక శాతంలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ బి, సి, మరియు ఇ ఉన్నాయి. ఇందులో ఇంకా పొటాషియం మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ మరయు క్యాల్షియం అధికంగా ఉంటాయి. కాబట్టి, జుట్టు పెరుగుదలకు, బట్టతల నివారణకు వీటిని తీసుకోవడం చాలా అవసరం.

4. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్:

4. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్:

మీరు బట్టతలను నివారించాలంటే మరియు ఇతర జుట్టు సమస్యలను నివారించదల్చుకుంటే, ఒక గుప్పుడు నట్స్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోండి. వీటిలో చాలా పుష్కలమైనటువంటి ప్రోటీనులు, విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైటోకెమిల్స్ పుష్కలంగా ఉండే జుట్టు సమస్యలను నివారిస్తాయి.

5. బీన్స్:

5. బీన్స్:

మీ డైలీ డైట్ లో వెరైటీ బీన్స్ ను యాడ్ చేసుకోండి, కిడ్నీ బీన్స్, బీన్స్, సోయా బీన్స్, చిక్ పీస్ వంటివి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ ను అధిస్తుంది. మరియు బట్టతలను అరికడుతుంది.

6. చేపలు:

6. చేపలు:

మీ జుట్టు పెరుగుదలకు ప్రోటీనులు చాలా ముఖ్యం. మీకు చేపలు తినడం ఇష్టమైతే ఇది జుట్టుకు ఒక గొప్ప ఆహారం. చేపల్లో సాల్మన్, తున, మెకెరల్ మరియు కోడ్ లివర్ ఆయిల్లో ప్రోటీనులుమరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

7. క్యారెట్స్:

7. క్యారెట్స్:

క్యారెట్స్ జు్టుకు చాలా మంచిది. ఇది బట్టతలను నివారిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. క్యారెట్ లోని బీటా కెరోటిన్ మరియు విటిమన్ ఎ తలలో సెబమ్ ను పెరిగేలా ప్రోత్సహించి జుట్టు పెరిగేట్లు చేస్తుంది.

8. ఓట్స్:

8. ఓట్స్:

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఒట్ మీల్ తో మీ దినచర్యను మొదలు పెట్టండి. వీటిలోని విటిమన్స్, మినిరల్స్, మరియు ప్రోటీనుల, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటివి బట్టతలను నిరోధిస్తుంది.

9. స్వీట్ పొటాటో:

9. స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో మీ కేశాలకు చాలా మంచిది. ఇందులోని బీటా కెరోటిన్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. మరియు ఇందులో విటమిన్ సి, ఐరన్, కాపర్ మరియు ప్రోటీనులు మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

10. సన్ ఫ్లవర్ సీడ్స్:

10. సన్ ఫ్లవర్ సీడ్స్:

ఈ గింజల్లో పూర్తి పోషకాంశాలున్నాయి. ఇవి బట్టతలను అరికడుతుంది . ఇందులో ప్రోటీనులు, సెలీనియం, జింక్, బయోటిన్, కాపర్, ఐరన్ మరియు విటమిన్ బి మరియు ఇ , ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలం.

English summary

Foods To Prevent Baldness

Hair fall and baldness has become a big problem for many people nowadays. Over-polluted environment, our lifestyle and bad eating habits are making it even worst. We hardly bother about the food we eat. Eating junk foods without thinking of nutrition and use of chemical based products on skin and hair has taken this problem to a higher level.
Desktop Bottom Promotion