For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెన్నా(గోరింటాకు)తో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్స్

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మన ఇల్లలో బామ్మగారు లేదా అమ్మో, లేదా పక్కింటి ఆంటీలో ఎవరో ఒక్కరు తలయు ప్యాక్ వేసుకోవడం చూస్గుంటాం. ముఖ్యంగా చాలా మంది జుట్టుకు హెన్నా(గోరింటాకు) ప్యాక్ వేసుకోవడం గమనించే ఉంటారు. ఈ హెన్నా(గోరింటాకు)తలకు ఎందుకు ప్యాక్ లా వేసుకుంటారు? వేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?మరి ప్రయోజనాలేంటో తెలుసుకోవాలనుందా?నిజంగా మెహిందీ(గోరింటాకు)జుట్టుకు ఒక అద్భుతమైన నేచురల్ హెయిర్ డై. ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాలు, గుణాగణాల వల్ల జుట్టు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి కొన్ని వేళ సంవత్సరాల నుండి దీన్ని జుట్టు సంరక్షణలో బాగంగా ఉపయోగిస్తున్నారు.

ఇది హెడ్ డై మాత్రమే కాదు, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . దీన్ని రెగ్యులర్ బేసిస్ లో అప్లై చేయడం వల్ల. జుట్టుకు బలాన్ని చేకూర్చుతుంది. మరియు జుట్టును ప్రకాశంతంగా మార్చుతుంది. ఇంకా చుండ్రు, తలలో పొలుసులా ఏర్పడే స్కబ్బీజుట్టు నివారించి, జుట్ట యొక్క వాల్యూమ్ ను పెంచుతుంది. మరి ఈ గోరింటాకు గురించి ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకొన్నాకా, మీరు తలకు పెట్టకుండా ఎలా ఉంటారు?మరి హెన్నా(గోరింటాకు)జుట్టుకు ఎలా ఉపయోగించాలో కొన్ని చిట్కాలు మీకోసం...

Hair Benefits Of Henna

జుట్టుకు హెన్నా ఎలా ఉపయోగించాలి:
ఒక కాపర్ బౌల్ లో హెన్నా కలిపి పెడితే మరింత క్యాలిటీ మరియు వాల్యూమ్ పెరుగుతుంది. కాబట్టి ఒక కాపర్ బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి, అందులో హెన్నా(గోరింటాకు)పొడి వేసి, సున్నితంగా కలుపుతూ పేస్ట్ లా తయారుచేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా మిక్స్ చేయాలి. మీ జుట్టు పొడిబారి ఉండేట్లు అయితే కొన్ని చుక్కల మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేయాలి. కానీ మీ కేశాల ఆకారానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది. పొడి జుట్టు, దురద(చుండ్రు)జుట్టు ఉన్నట్లైతే రెండు చెంచాల పెరుగును మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన హెన్నాను తలకు బాగా పట్టించాలి. జుట్టును పాయలుగా విడదీసి, కుదుళ్ళ మొదళ్ళ నుండి అప్లై చేయాలి. హెన్నా అప్లై చేసిన తర్వాత 2-3గంటల పాటు అలాగే వదిలేసి పూర్తిగి ఎండనివ్వాలి. తర్వాత ట్యాప్ క్రింద తల పెట్టి, తలస్నానం చేసి, జుట్టును సహజంగా ఎండలో ఆర్పుకోవాలి.

హెన్నా/మెహింది(గోరింటాకు తలకు పెట్టడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం:
1. నేచురల్ హెయిర్ కలర్: హెన్నా నేచురల్ హెయిర్ డై మరియు దీని జుట్టుకు పట్టించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు . చాలా మంది వారి జుట్టును కలర్ కోసం రసాయనిక హెయిర్ డైలను ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇది జుట్టుకు ఎరుపురంగులో ఉండేలా చేస్తుంది.

2. ఒక అద్భుతమైన కండీషనర్: మీరు జుట్టుకు కండీషనర్ గా అనేక హెయిర్ ప్రొండక్ట్స్ ను ఉపయోగించి డబ్బు వేస్ట్ చేసి ఉంటారు? మరి సహజసిద్దంగా లభించే ఈ హెన్నాను ఒక సారి కండీషనర్ గా అప్లై చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది. మీ జుట్టు నేచురల్ హెయిర్ గా ఉంచి, తగినంత పోషణ, ఆరోగ్యాన్ని అంధిస్తుంది. మరియు తలలో నేచురల్ యాసిడ్ ఆల్కలైన్ ను సమతుల్యం చేస్తుంది.

3. చుండ్రును నివారిస్తుంది: హెన్నా సాధారణ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండటంచేత, తలకు హెన్నా పెట్టినప్పుడు చుండ్రును నివారించవచ్చు మరియు పొరలుగా వుండే జుట్టును నివారిస్తుంది. రెగ్యులర్ గా హెన్నా తలకు పట్టించడం వల్ల చుండ్రు నివారించవచ్చు.

4. జుట్టుకు పోషణ, తగినంత బలాన్ని అంధిస్తుంది: మీ జుట్టుకు తగినంత పోషణ మరియు బలాన్ని అందించాలంటే హెన్నా తలకు పట్టించాల్సిందే. హెన్నాలో జుట్టుకు బలాన్ని చేకూర్చడంతో పాటు జుట్టుకు పెరుగుదలకు సహాయపడే అనేకమైన సద్గుణాలున్నాయి . గోరింటాకు నిక్షేపాలు జుట్టు పెరుగుదల వ్యాల్యూమ్ ను పెంచడానికి సహాయపడుతుంది. జుట్టు మందంగా పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన పడకుండా హెన్నాను తలకు పట్టించండి.

5. నేచురల్ షైనింగ్: బ్రైట్ గా మరియు మంచి మెరుపుతో ఉన్న జుట్టు ఎవరి ఇష్టం ఉండదు చెప్పడి? అందరూ ఇలాంటి జుట్టుకోసమే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ హెన్నాతో ఇలా పొందడం చాలా సులభం. రెగ్యులర్ గా హెన్నాను మీ జుట్టుకు పట్టిస్తే చాలు, మీ జుట్టుకు నేచురల్ కలర్, నేచురల్ షైనింగ్ పొందవచ్చు . హెన్నాలోని నిక్షేపాలు హెయిర్ క్యూటికల్స్ ను ముదురు వర్ణంలో మరియు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.

English summary

Hair Benefits Of Henna


 You must have seen your grandma, mother and Aunts applying henna on their hair. Do you know why they all use it and what are its benefits? If you never bothered to know the reason then we will tell you why. Mehendi is a really wonderful natural hair dye which has been used in India since ages as it has great qualities in it.
Story first published: Friday, August 23, 2013, 12:05 [IST]
Desktop Bottom Promotion