For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహం చేసుకోబోయే స్త్రీలు -జుట్టు సంరక్షణ చిట్కాలు

By Derangula Mallikarjuna
|

ప్రతి వధువు తన పెళ్లి రోజున ప్రత్యేకంగా, సొగసుగా, అందంగా మరియు ఆకర్షనీయంగా కనబడాలనుకుంటుంటుంది. ఆమె వివాహ వేడకకు అందంగా కనబడుటకు శరీర సంరక్షణ, మరియు చర్మ సంరక్షణ అందంగా మలచుకోవడం మాత్రమే సరిపోదు. కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యమైన బ్యూటీకేర్ . పెళ్లిలో వధువు అందంగా, జుట్టు ఆకర్షణీయంగా కనబడుటకు, ఏ బ్యూటీపార్లర్ కు వెళ్లకుండానే జుట్టు సంరక్షణ మీద శ్రద్ద తీసుకోవడం వల్ల అది సాధించవచ్చు. ప్రత్యే హెయిర్ ఎక్సపర్ట్స్ బ్యూటీ టిప్స్ ప్రకారం వధువు పెళ్లి జుట్టు అద్భుతమైన మరియు ఆకర్షణీయంగా కనబడుటకు కొన్ని బ్యూటి టిప్స్ బాగా పనిచేస్తాయి .

ప్రారంభం నుండి కేశ సంరక్షణను ప్రారంభించండి : పెళ్లి రోజున చూడటానికి అందంగా కనబడే జుట్టు పొందడానికి, వధువు జుట్టు సంరక్షణ పెళ్లికి కొన్ని రోజుల ముందునుండి ప్రారంభించాలి. సాధ్యం అయితే కొన్ని నెలల ముందు నుండి కేశ సంరక్షన పద్దతులను అనుసరించినట్లైతే చివరి గంటల్లో ఎంటువంటి ఇబ్బంది ఉండదు. అందుకోసం, జుట్టు సంరక్షణలో బాగానైపుణ్యం పొందిన మంచి నిపుణుల వద్ద జుట్టు సంరక్షణకు సహాయం తీసుకోవచ్చు.

Hair care tips

మీ జుట్టు రకాన్ని బట్టి, కేశ సంరక్షణ చిట్కాలు పాటించాలి: వధువు కేశసంరక్షణలో మంచి ఫలితాలను పొందడానికి, ఆమె మొదట ఎటువంటి జుట్టు రకాన్ని కలిగి ఉందో తెలుసుకోవాలి. వధువు జుట్టు చాలా పొడిగా ఉన్నప్పుడు అంది చుండ్రు సమస్య కూడా బాధించవచ్చవచ్చు. అటువంటప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉండే యాంటీ డాండ్రఫ్ ఉత్పత్తులను వాడటం ఉత్తమ మార్గం. హెయిర ఎక్స్ పర్ట్స్ ప్రకారం, వధువు బ్యూటీ టిప్ పెళ్ళి లు్ కోసం తలస్నానం చేసిన తర్వాత సాధరణ జుట్టును కలిగి ఉండటం వల్ల ఎక్కువ సమయం జుట్టు మంచి షైనింగ్ తో మరియు మంచి లుక్ తో ఎక్కువ సమయం ఉంటుంది.

నేచురల్ బ్రైడల్ హెయిర్ కేర్ పద్ధతులకు ప్రధాన్యత ఇవ్వాలి: నేచురల్ బ్రైడల్ హెయిర్ కేర్ పద్దతులను, నేచురల్ హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిచి సహజంగా అందమైన జుట్టును పొందవచ్చు. వధువు కేశసంరక్షణలో హానికరమైన జుట్టు సమస్యల్లో చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నివారించాలి. అయితే, వధువు జుట్టు సంరక్షన చిట్కాల్లో వధువు జుట్టును హెయిర్ డ్రయ్యర్స్ కు , సింథటిక్స్ కలర్స్ కు లేదా ఇతర ఉత్పత్తులకు బహిర్గతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే, అటువంటి సమ్మేళనాలు జుట్టు బలంను తగ్గిస్తుంది. హెయిర్ ఎక్స్ పర్ట్స్ ప్రకారం వధువు వారి జుట్టుకు కలరింగ్ వేసుకోవడానికి హెన్న, డికాషన్ మరియు కొన్ని చుక్కల నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కనీసం నెలకొకసారి, గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టించడం ద్వారా జుట్టు మంచి షైనింగ్ తో ఉండేలా చేస్తుంది.

రెగ్యులర్ హెయిర్ వాషింగ్ ను ఎంపికచేసుకోవాలి: వధువు కేశ సంరక్షణలో వారంలో కనీసం 3 సార్లు, తలకు షాంపు పట్టించి తలస్నానం చేసుకోవడం మంచిది. వధువు యొక్క కేశ సంరక్షణ చిట్కాల్లో జుట్టు వివిధ రకాలుగా డ్యేమేజ్ కాకుండా చూసుకోవాలి . తలస్నానం కొరకు వధువు ప్రోటీన్ ఆధారిత కండీషనర్ ను ఉపయోగించడం వల్ల స్టైలిష్ లుక్ తో పాటు డిఫరెంట్ టైప్స్ హెయిర్ స్టైల్స్ ను అంధిస్తుంది . అలాగే రెగ్యులర్ గా హెయిర్ మసాజ్ ను అనుసరించడం వల్ల పెళ్ళికి ఒక అందమైన జుట్టు సౌందర్యాన్ని పొందవచ్చు .దాంతో వధువు వివాహ వేడుక మరింత ఆనందదాయకంగా చేయవచ్చు .

ముగింపు

ఈ చిట్కాలువధువుకు ఉపయోగపడే హెయిర్ కేర్ చిట్కాలు. వీటని పెళ్ళి చేసుకోబోయే వధువు కోసం కేశసంరక్షణ పద్ధతులను అత్యంత ఉత్తమమైనవిగా సిఫార్సు చేయబడినవి . ఈ చిట్కాలను ప్రయత్నించి మీ వెడ్డింగ్ డేను మరింత స్పెషల్ గా చేసుకోండి.

Desktop Bottom Promotion