For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేశ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఉసిరి ప్రాధాన్యత...

|

ఉసిరికాయను హిందీలో ఆమ్లా లేదా ఇంగ్లీష్ లో ఇండియన్ గూస్బెర్రీ అంటారు. ఈ ఉసిరికాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. భారతీయులు సాంప్రదాయరీతిలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ఉసిరికాయలతో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్‌లు, తలకి వేసుకునే రంగుల్లో, కూడా దీనిని విరివిగా వాడుతున్నారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఐదు రుచులను కలిగి ఉంది. ఉసిరిలో అత్యధికం గా "సి" విటమిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. రాసాయనికంగా నారింజలో కన్నా ఉసిరిలో 90 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు, కెరోటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్, కాల్సియం, ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి.

ఉసిరిలో విటమిన్ సి, విటమిన్ ఐ పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటి వి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హేరాయిల్స్‌ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా సరఫరాచేస్తున్నారు. అంతేకాక హెమరైజ్‌కి, మెన్‌రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్త స్రావాన్ని అరి కట్టడానికి ఔషధంగా వాడతారు. దీని నుండి తయారుచేయబడిన నూనెని చాలా మంది నిత్యంవాడుతూ వుంటారు. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, మెదడుకి చల్ల దనాన్ని ఇస్తుంది. సౌందర్యసాధనాల తయారీలో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు.

ఉసిరి కాయతో చర్మానికి మిరయు కేశాలను చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఉసిరి పొడిని హెన్నాలో వాడుతారన్న విషయాన్ని బహుశా మీరు వినేఉంటారు. ఉసిరి జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. ఉసిరి రసం లేదా జ్యూస్ చర్మానికి చాలా ఆరోగ్యకరం. ఈ ఆరోగ్యకరమైన జ్యూస్ వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపబడుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని కాపాడుతుంది. ఇంకా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఆమ్లాఆయిల్ ను కేశాలను పెట్టుకోవడం వల్ల జుట్టు బాగా పెరగడమే కాదు మందగా కూడా పెరుగుతుంది. మరి ఉసిరికాయను ఉపయోగించి జుట్టుకు రక్షణ ఎలా పొందాలో పరిశీలించండి...

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

జుట్టురాలడాన్ని అరికడుతుంది: తలస్నానం చేయడానికి ఒక గంట ముందు, ఆమ్లాఆయిల్ తో తల మాడుకు బాగా మర్ధన చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

పల్చబడ్డ జుట్టుకు మంచి ట్రీట్మెంట్ వంటిది: మీ జుట్టు మరీ పల్చగా మారిందా?మీ కేశాలను ఒత్తుగా కనబడటానికి కేశాలను ముడివేయడం కన్నా లేదా పల్చబడ్డ కేశాలు ఎగిసిపడుతుంటే ఆమ్లా ఆయిల్ ను ఉపయోగించి మెత్తగా చేయవచ్చు. ఇంకా పల్చబడ్డ కేశాలకు తిరిగి ఒత్తైన కేశాలు పొందడానికి శీకాకాయ పొడి మరియు రీటా(హెన్నా)లో ఉసిరి పొడిని కలపడం మంచి చికిత్స వంటిది. సహజంగానే మీ జుట్టును ఒత్తైనవిగా మార్చుకోవచ్చు.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

చుండ్రును అరికడుతుంది: ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో చుండ్రు ఒక సాధారణ సమస్య. చుండ్రును నివారించడంలో ఆమ్లా ఓ మంచి దివ్వఔషదం. ఆమ్లా పౌడర్ లేదా ఆమ్లా ఆయిల్ వల్ల తలలో చుండ్రును అరికట్టి, తల శుభ్రంగా మరియు హెల్తీగా ఉండేలా సహాయపడుతుంది.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

హెయిర్ కండీషనర్: ఉసిరి కాయ ఒక బెస్ట్ హెయిర్ కండీషనర్. ఎందుకంటే ఇది ఎటువంటి రసాయనాలు లేని ఒక మంచి ఔషదం వంటిది. కేశాలను ఆరోగ్యంగా, ఒత్తుగా, మంచి మెరుపును పొందడానికి బాగా సహాయపడుతుంది.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

అనుకోకుండా జుట్టు గ్రేకలర్ లోకి మారడం: ఒత్తిడి, జీర్ణసమస్యలు మరియు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సడెన్ గా కేశాలు రంగు మారుతాయి. ఇటువంటి జుట్టు సమస్యలను నివారించడానికి, ఆమ్లా ఆయిల్ ను ఉపయోగించడం లేదా ఆమ్లా జ్యూస్ ను త్రాగడం వల్ల మంచిది.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

తలలో దురుద: తరచూ తలలో దరుద పెడుతుంటే? ఉసిరిపొడిని పెరుగులో మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది: ఉసిరికాయ జుట్టు అభివృద్ధి మరియు జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ ను ప్రేరేపిస్తుంది.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

నిర్జీవమైన జుట్టును మెరుగుపరుస్తుంది: ఇలా జుట్టు నిర్జీవంగా మారడానికి కారణం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మరియు కాలుష్యం వంటివి ప్రధాన కారణాలు. పొడిబారిన మరియు నిర్జీవమైన కేశాలకు ఆమ్లాను ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలు బలోపేతం అవుతాయి మరియు జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది.

జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

జుట్టు రంగును అలాగే ఉంచుతుంది లేదా భద్రపరుస్తుంది: అనారోగ్యకరమైన జీవన విధానం వల్ల జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారడం, రంగును కోల్పోవడం జరగుతుంది. కాబట్టి కేశాల రంగును స్థిరంగా ఉంచుకోవడానికి తరచూ ఆమ్లాను ఉపయోగించాలి.

English summary

Hair Care With Amla (Indian Gooseberries) | జుట్టు సమస్యలకు ఉసిరికాయతో అద్భుత పరిష్కారం..

Amla or the Indian gooseberries are considered to be very healthy. It also offers skin and hair benefits. This Ayurvedic herb is rich in antioxidants and vitamins which is healthy for the overall health.
Story first published: Tuesday, April 9, 2013, 13:14 [IST]
Desktop Bottom Promotion