For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెయిట్ హెయిర్ పొందాలంటే?ఎఫెక్టివ్ టిప్స్ ఇదిగో!

|

సాధారణంగా మనుష్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన హెయిర్ ఉంటుంది. కర్లింగ్ హెయిర్, స్ట్రెయిట్ హెయిర్, పొడి జుట్టు, మొదలగునవి మరికొన్ని. జుట్టు రకాన్ని బట్టి హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. ఉదా: కర్లింగ్ హెయిర్ కు ఖచ్చితంగా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తుంటుంది. నిర్వహణ సౌకర్యంగా మరియు చిక్కుబడకుండా మరియు పొడిబారకుండా ఉంటుంది.

అదేవిధంగా, స్ట్రెయిట్ హెయిర్ ఉన్న మహిళలు, ఆ హెయిర్ ను అలాగే మెయింటైన్ చేయడానికి, కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, అరటి పండు, మరియు బొప్పాయతో హెయిర్ ప్యాక్, నిమ్మరసంతో కొబ్బరినూనె మిక్స్ చేసి హెయిర్ మసాజ్ వంటివి, స్ట్రెయిట్ హెయిర్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. ఇంకా వెనిగర్ మరియు పెరుగు వంటివి కూడా, స్ట్రెయిట్ హెయిర్ నిర్వాహణకు ఉపయోగిస్తుంటారు.

చాలా మంది మహిళలు తమ కేశాలను స్ట్రెయిట్ గా ఉంచుకోవాలంటే చాలా ఇష్టం. అందుకు వారు హెయిర్ స్ట్రెయిటనింగ్ పద్దతిని పాటించడం, లేదా హెయిర్ స్ట్రెయిటనింగ్ హోం రెమడీస్ ఉపయోగించడం చేస్తుంటారు. కానీ, మీకు ఆల్రెడీ స్ట్రెయిట్ హెయిర్ ఉన్నట్లైతే(సహజంగా లేదా నిఠారైన జుట్టు)ఉన్నట్లైతే అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించి, మీ జుట్టును కాపాడుకోవాలి. అందుకు హెయిర్ ప్రొడక్ట్స్ ను అప్లై చేయడం మాత్రమే కాకుండా, మీరు కొన్ని టిప్స్ ను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, జుట్టు తేమగా ఉన్నప్పుడు జుట్టును ముడివేయకూడదు. తేమగా ఉన్న జుట్టుకు క్లిప్స్, టైట్ గా ఉండే ఇతర యాక్ససరీస్ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల హెయిర్ క్వాలిటీ డ్యామేజ్ చేయడంతో పాటు కేశాలను పల్చగా మార్చుతాయి.

మార్కెట్లో హెయిర్ ప్రొడక్ట్స్ ను కొనడం అంటే చాలా ఖర్చుతో కూడుకొన్నవి. కాబట్టి, హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం కొన్ని హోం మేడ్ హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం చాలా ముఖ్యం. అవసరం కూడా . మీకు స్ట్రెయిట్ హెయిర్ ఉన్నట్లైతే. అందుకు ఇక్కడ మీకోసం కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ కేశాలను అలాగే స్ట్రెయిట్ హెయిర్ గా నిర్వహించడానికి ఇవి బాగా సహాయపడుతాయి. మరి ఆ హెయిర్ ప్రొడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

టీ లిక్కర్:

టీ లిక్కర్:

స్ట్రెయిట్ హెయిర్ ను మెయింటైన్ చేయడానికి నేచురల్ గా దొరికే టీ లిక్కర్ ను డీప్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి, మీరు తలస్నానం చేసిన తర్వాత చివరగా, ఈ టీ లిక్కర్ ను తలరా పోసుకోవడం ద్వారా కేశాలు, సాప్ట్ గా, సిక్కీగా మరియు మెరుస్తుంటాయి.

పాలు:

పాలు:

పాలను హెయిర్ స్ప్రే బాటిల్లో పోసి, తలకు స్ప్రే చేసుకోవాలి. ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ ను స్ప్రే చేసిన తర్వాత అరగంట అలాగే ఉంచాలి. దాంతో మీ కేశాలు ఫ్లాట్ గా , సిల్కీగా నేచురల్ గా ఉంటాయి.

తేనె:

తేనె:

ఈ హోం మేడ్ హెయిర్ ప్రొడక్ట్ ను పాలు లేదా గుడ్డుతో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండం వల్ల జుట్టు మంచి షైనింగ్ తో, సాఫ్ట్ గా మరియు స్ట్రెయిట్ హెయిర్ నిర్వహాణకు సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి షాంపుతో తల స్నానం చేయాలి తర్వాత కండిషనర్ అప్లై చేసి, తర్వాత వ్యత్యాసాన్ని చూడండి.

బనానా మరియు బొప్పాయి ప్యాక్:

బనానా మరియు బొప్పాయి ప్యాక్:

స్ట్రెయిట్ హెయిర్ మెయింటైన్ చేయడానికి ఇది చాలా ప్రభావవంతమైన హెయిర్ ప్యాక్ ఇది. ఇది ఒక సహజమైన మరియు ఇతర ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేసే ఒక మంచి హోం మేడ్ హెయిర్ ప్రొడక్ట్. బనానా మరియు బొప్పాయిని పాలతో మిక్స్ చేసి, ఈ మూడింటి మిశ్రమాన్ని తలకు పట్టించి 30-45నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డు నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది హెయిర్ ను స్ట్రెయిట్ గా ఉంచుతుంది. మరయు సాఫ్ట్ గా ఉంచుతుంది. బాగా గిలకొట్టిన గుడ్డును తలకు పట్టించి, అరగంట అలాగే వదిలేసి, తర్వాత చల్లటి నీటితో, మన్నికైన షాంపును ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఈ హెయిర్ కేర్ ప్రొడక్ట్ మార్కెట్లో చాలా సులభంగా లభ్యం అవుతుంది . ఆలివ్ ఆయిల్ ను గుడ్డుతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల నేచురల్ గానే కేశాలను స్ట్రెయిట్ గా మార్చుకోవచ్చు.

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు:

కోకోనట్ మిల్క్, కొబ్బరి తురుమును గ్రైండర్ లో వేసి మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి పాలు సపరేట్ గా తీసుకొని, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రిఫ్రిజరేటర్ లో రెండు గంటల పాటు ఉంచి, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టించి, అరగంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

వెనిగర్:

వెనిగర్:

స్ట్రెయిట్ హెయిర్ మెయింటైన్ చేయడానికి వెనిగర్ మరో అద్భుత హెయిర్ కేర్ ప్రొడక్ట్. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత వెనిగర్ ను నీళ్ళ వేసి తల మీద పోసుకోవడం వల్ల కేశాలు స్ట్రెయిట్ గా మరియు మంచి షైనింగ్ తో ఉంటాయి.

పెరుగు:

పెరుగు:

పెరుగు హెయిర్ కేర్ లో చాలా అద్భుతమైన వస్తువుం. ఎందుకంటే పెరుగును జుట్టుకు పట్టించడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, చుండ్రు నివారించబడుతుంది, జుట్టు సాఫ్ట్ గా చేస్తుంది. కాబట్టి పెరుగును నిమ్మరసం మరియు గుడ్డుతో మిక్స్ చేసి, కొన్ని చుక్కల నూనె వేసి బాగా మిక్స్ చేసి, తలకు పట్టించిన తర్వాత మంచి ఫలితాలను పొందవచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసం:

జుట్టు సంరక్షణలో నిమ్మరసం ఎన్నో అద్భుతాలను చేస్తుంది. ఈ నిమ్మరసంను అనేకు హెయిర్ కేర్ ఉపయోగించే వస్తువుల(పెరుగు, కొబ్బరి నూనె, గుడ్డు లేదా పాలు)తో చేర్చి, ఉమ్మడిగా ఉపయోగిస్తారు. వీటిలో దేన్ని జుట్టుకు ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది.

English summary

Hair Products To Maintain Straight Hair

Women must use hair products depending on their hair. There are hair products for different hair types. For example, if you have curly hair, you must use hot coconut oil to keep it shiny, manageable and not frizzy or dry.
Desktop Bottom Promotion