For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ఆకర్షణీయం&సురక్షితం

|

దీపావళికి ఇంటి అలంకరణ ఎంత ముఖ్యమో.. అతివళ అలంకరణ కూడా అంతే ముఖ్యము. అతివళు అలంకరణ, కొత్త బట్టలు ధరించడం ఈ పండగ ప్రత్యేకత. ఈ సందర్భంలో మార్కెట్ అంతా బిజీబిజీగా ఉంటుంది. అలంకరణ వస్తువుల, వస్త్రాలు, టపాకాయలు ఒక్కటేంటి ఇటు కొనుగోలు దారులు, అటు అమ్మకం దారులతో మార్కెట్ అంతా కళకళలాడుతుంటుంది. దీపావళి అంటేనే కొత్త బట్టలు, టపాకాలు. ఈ పండుగ రోజున సాంప్రదాయకరమైన కొత్తబట్టలు వేసుకోవడం అంటే చాలా మంది ఇష్టం. అయితే దీపావళికి కొత్త బట్టలు వేసుకొనేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండటం అవసరం. టపాకాయలు కాల్చేసమయం ఎటువంటి అపాయం అయినా జరగవచ్చు. కాబట్టి అలాంటి ప్రమాధాలు జరగకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. సాధారణంగా స్త్రీలు, పిల్లలు ధరించే సిల్క్ వస్త్రాలు, నెటెడ్ వస్త్రాలు, మస్లిన్, అతి త్వరగా వేడికి తాకగలిగే తేలికయైన, పలుచని వస్త్రాలకు దూరంగా ఉండటమే మంచిది.

అంతే కాదు దీపావళి సమయంలో కురుల సంరక్షణ కూడా చాలా అవసరం. ఎవరికైతే ఒత్తైన పొడవైన కురులు కలిగి ఉంటారో వారు కురులను ఫ్రీగా లూజ్ గా స్టైల్ గా వదలడం కంటే, సౌకర్యవంతంగా ఉండేలా భారతీయ సాంప్రదాయ పద్దతి ప్రకారం దీపావళి రోజు జడను వేసుకోవడం వల్ల అందానికి అందం. సౌకర్యవంతంగానూ ఉంటుంది. దేశీ లుక్ ను ప్రయత్నించేటప్పుడు మీ హెయిర్ స్టైల్ మీద కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. సరైన హెయిర్ స్టైల్ లేకుండా ప్రొపర్ లుక్ ఇవ్వదు.

దీపావళి రోజున అందంగా కనబడటం అటుంచితే, మీరు చాలా జాగ్రత్త మరియు సురక్షితంగా ఉండాలి. కాబట్టి సౌకర్యవంతమైన దుస్తులతో పాటు, హెయిర్ స్టైల్ ను కూడా మార్చాలి. ఇలా చేయడం వల్ల అనుకోకుండా జరిగే కొన్ని అపాయాల నుండి బయటపడవచ్చు. కురులను జడగా అల్లినా, ముడి వేసుకొన్నా, పొట్టి జుట్టు ఉన్నవారు ఫ్రీగా వదులుకొన్నా ఎలా వేసుకొన్నా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. భారతీయ కేశాలంకరణ ఫ్యాషన్ కాకపోయినా, చూడటానికి అందంగా కనబడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొన్ని ఫాషన్ షోలలో ఫ్యాషన్ గా ఎటువంటి దుస్తులు ధరించినా కేశాలంకరణ మాత్రం ఇండియన్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు.

మరి ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మీరు అందంగా కనబడటం కోసం కొన్ని హెయిర్ స్టైల్స్. మీరు ధరించే దుస్తులకు సూట్ అయ్యే హెయిర్ స్టైల్స్ ను ఇక్కడ అంధిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన స్టైల్ ఎంపిక చేసుకొని చక్కగా అలంకరించుకొంటే అందంతో పాటు దీపావళి రోజున సేఫ్ గా కూడా ఉంటారు.

 1. లోబన్:

1. లోబన్:

దీపావళి రోజున అనుసరించాల్సిన ఒక సేఫెస్ట్ హెయిర్ స్టైల్ లోబన్ ఇది. ఈ సీజన్ కు ట్రెండింగ్ గాను మరియు సాంప్రదాయంగాను ఉంటుంది.

2. వెట్ హెయిర్(తడి జుట్టు) :

2. వెట్ హెయిర్(తడి జుట్టు) :

పొడవాటి జుట్టును ఇలా సెట్ చేస్తూ సెట్ చేయవచ్చు. లేదా బ్యాక్ ఒక సెంటర్ కు బ్యాండ్ వేసి నిలిచేలా చేయవచ్చు.

3. స్వెప్ట్ బ్యాక్ హెయిర్:

3. స్వెప్ట్ బ్యాక్ హెయిర్:

దీపావళికి ఈ స్వెప్ట్ బ్యాక్ హెయిర్ చాలా సేఫ్ హెయిర్ స్టైల్.

4. మెస్సీ హెయిర్:

4. మెస్సీ హెయిర్:

ఈ మెస్సీ హెయిర్ స్టైల్ ట్రెండింగ్ గా మరియు అందంగా ఉంది. మీరు మెస్సీ హెయిర్ బన్ లేది సింపుల్ గా టైఅప్ చేయండి.

5. హాఫ్ పిన్డ్ హెయిర్:

5. హాఫ్ పిన్డ్ హెయిర్:

మహిళలకు చాలా వరకూ పాపులర్ హెయిర్ స్టైల్ . ఫ్రెంట్ హెయిర్ ను పిన్స్ తో బందించాలి బ్యాక్ సైడ్ మిగిలిన హెయిర్ ను అలాగే లూజ్ గా వదిలేయాలి.

6. వింటేజ్ బన్:

6. వింటేజ్ బన్:

ఒక సెలబ్రెటీ ఒక పాతకాలపు హెయిర్ స్టైల్ ను మన కొత్త ట్రెండ్ గా ఇలా తీసుకొచ్చింది. . ఈ హెయిర్ స్టైల్ సోనమ్ కపూర్ కు చాలా ఇష్టమైన హెయిర్ స్టైల్.

 7. ఫ్రింజెస్:

7. ఫ్రింజెస్:

షార్ట్ ఫింగర్ లుక్ స్టైల్ మరియు ఇది ఒక ఫ్యాషనబుల్ గా కనబడుతోంది . మీరు డిఫరెంట్ గా ప్రయత్నించాల్సి వస్తే, మీ కేశాలను ఇలా ముడి వేయండి ఫ్రింజెస్ తో మీ ఫోర్ హెడ్ ను ఇలా కవర్ చేయండి.

8. పఫ్ పిన్డ్ బన్స్:

8. పఫ్ పిన్డ్ బన్స్:

ఇది చాలా అందంగా మరియు సౌకర్యంగా ఉండే దివాళి హెయిర్ స్టైల్. మీ హెయిర్ ను రోల్ చేసి పిన్ చేయబడినవి.

9. లూజ్ గా అల్లిన జుట్టు :

9. లూజ్ గా అల్లిన జుట్టు :

పొడవాటిజుట్టున్న వారు, ఈ హెయిర్ స్టైల్ ను ప్రయత్నించవచ్చు.

 10. ఫిష్ స్టైల్ జడ:

10. ఫిష్ స్టైల్ జడ:

దీపావళికి మరో సేఫ్ హెయిర్ స్టైల్ ఇది.

11. ట్రెడిషినల్ జడ:

11. ట్రెడిషినల్ జడ:

మీకు సింపుల్ గా మరియు కంపర్టబుల్ గా ఉండాలనుకుంటే ఈ ట్రెడిషనల్ హెయిర్ స్టైలను ఎంపిక చేసుకోండి.

12. గజ్రా:

12. గజ్రా:

సెంటర్ పార్టింగ్ హెయిర్ బన్ చూడటానికి చాలా అద్భుంతగా సాంప్రధాయ బద్దంగా ఉంటుంది.

 13. కర్లింగ్:

13. కర్లింగ్:

కర్లీ హెయిర్ ఉన్నవారు, ఇలా జుట్టును ఫ్రీగా వదులుకోవచ్చు . ఈ హెయిర్ స్టైల్ చాలా స్టైలిష్ గా మరియు ట్రెడిషన్ అవుట్ ఫిట్స్ కు సూట్ అవుతుంది.

14. సైడ్ బ్రైడ్:

14. సైడ్ బ్రైడ్:

పొట్టిగా కర్లీ హెయిర్ ఉన్నవారు, దీపావళి రోజున ఈ హెయిర్ స్టైలను ట్రై చేయండి .

English summary

Hairstyles For A Safe Diwali

Diwali is the festival where all women get beautifully dressed to celebrate it with family and close ones. You can see the market flooded with women who will be busy buying things for Diwali celebrations.
Desktop Bottom Promotion