For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో ప్రకాశవంతమైన జుట్టుకు హోం మేడ్ హెయిర్ ప్యాక్స్

|

చలికాలంలో చాలా మందికి ఏదో ఒకటి ఇష్టంగా ఫీలవుతారు. చల్లని ఉష్ణోగ్రత లేదా చలికాలంలో వచ్చే వెచ్చని సూర్య కిరణాలంటే చాలా మంది ఇష్టం. అయితే ఇష్టం లేనివి కూడా ఉన్నాయి. చలిగాలికి చర్మం, పగుళ్ళు, జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు.

ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. జుట్ట రాలడానికి, చిట్లడాన్ని నివారించడంతో పాటు జుట్టు మెరుస్తూ, దట్టంగా పెరగాలంటే అందుకు శీతాకాలంలో ఇంట్లోనే కొన్ని హెయిర్ ప్యాక్స్ ను ప్రయత్నించవచ్చు. మనకు ఇష్టం లేనివి కెమికల్ హెయిర్ ప్యాక్స్ మార్కెట్లో బోలెడెన్ని దొరుకుతున్నాయి. వాటిని ఉపయగించడం కంటే ఇంట్లో తయారు చేసుకొని హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం చాలా సులభం మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు...

1.పొడి మరియు చిట్లిన(చిక్కుబడిన) జుట్టు:

1.పొడి మరియు చిట్లిన(చిక్కుబడిన) జుట్టు:

బాగా పొడిబారిన జుట్టుకోసం బనానా హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. బనానాలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి తలలో చర్మానికి మొదళ్ళకు పట్టే విధంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు సున్నితంగా, మంచి షైనింగ్ తో మొరుస్తుంటాయి.

2. డ్యామేజ్డ్ హెయిర్:

2. డ్యామేజ్డ్ హెయిర్:

జుట్టు మధ్యలోని తెగిపోవడం ఈ సీజన్ లో సహజం. అందుకోసం రెండు గుడ్లను పగులగొట్టి అందలోని పచ్చ సొన మరియు ఒక ఎగ్ వైట్ కలిపి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మరో గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని తలకు పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

3. స్టాటిక్ హెయిర్:

3. స్టాటిక్ హెయిర్:

స్టాటిక్ హెయిర్ కోసం చాలా సింపుల్ మార్గం ఉంది. ఈ సీజన్ లో జుట్టు పోషణకు మెంతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే వ్యత్యాసం మీకే తెలుస్తుంది.

4. నిర్జీవమైన కురుల కోసం:

4. నిర్జీవమైన కురుల కోసం:

ఒక కప్పులో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో వెనిగర్, తెనె రెండూ సమపాళ్ళలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడవం వల్ల కురులకు అధిక శక్తినందిస్తుంది. కురుల పెరుగుదలకు ఉపయోగపడే శక్తినిస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను వెంటవెంటనే ఉపయోగించకూడదు. వెనిగర్ ఎక్కువ సేపు తలలో ఇంకడం వల్ల కురులకు చెడు ప్రభావం కలిగిస్తుంది.

5. హెయిర్ బ్రేకేజ్:

5. హెయిర్ బ్రేకేజ్:

ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాలా తేనె, రెండు చెంచాలా క్యాస్ట్రో ఆయిల్. ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల ఈ వింటర్ సీజన్ లో హెయిర్ బ్రేకేజ్ కాకుండా అరికడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి వింటర్ లో కురులను సంరక్షించుకోండి..

 6. స్ట్రావీ హెయిర్ (క్వాలిటీ లేని జుట్టు):

6. స్ట్రావీ హెయిర్ (క్వాలిటీ లేని జుట్టు):

ఒక వేళ మీరు మీ కేశాలకు ఎక్కువగా కలరింగ్ వేయడం మరియు దాని వల్ల జుట్టు మరింత నాణ్యత కోల్పోయి, డ్రైగా మారడం లేదా చిట్లడం, లేదా సన్నగా మరాడం వంటివి మార్పులు జరిగినప్పుడు, అందుకు మీరు ఒక అరటిపండు, రెండు చెంచాలా వేపాకు పౌడర్, ఒక కప్పు బీర్, వియోలా, రెండు కప్పుల బొప్పాయ ముక్కలు మరియు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ తిరిగి మీకు కేశాలు మంచి షైనింగ్ తో మరియు ప్రకాశవంతంగా మారడానికి సహాయం చేస్తుంది.

7. జిడ్డు గల తల మరియు ఆయిల్ హెయిర్ స్ట్రక్చర్:

7. జిడ్డు గల తల మరియు ఆయిల్ హెయిర్ స్ట్రక్చర్:

జిడ్డు జుట్టుతో చాలా మంది బాధపడూ, కంప్లైంట్స్ చేస్తుంటారు . అటువంటి వారికి హోం మేడ్ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ చాలా అవసరం అవుతుంది. ఆరెంజ్ జ్యూస్, ఒక చెంచా తులసి పౌడర్, ఒక కప్పు పెరుగు, వియోలా మరియు ఆమ్లా పౌడర్ వేసి మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది జిడ్డును తొలగిస్తుంది.

8. హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది:

8. హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది:

జుట్టు రాలడం ఎప్పుడు క్రమంగా పెరుగుతుంటుందో, అప్పుడు నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. అందువల్ల అవొకాడో హెయిర్ ప్యాక్ మెంతి హెయిర్ ప్యాక్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అయినా అరికడుతుంది. ఇది గ్రీన్ టీ మరియు గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడవచ్చు. మీ జుట్టు చాలా కఠినమైనదిగా మరియు రఫ్ గా ఉన్నట్లైతే, ఈ ప్యాక్ వేసిన తర్వాత మీ జుట్టు కొన నుండి మార్పును గమనించవచ్చు.

9. దురద పుట్టించే తల:

9. దురద పుట్టించే తల:

జుట్టు ఎల్లవేళలా దురద బాధిస్తోందా? అందుకు ప్రధాన కారణం చుండ్రు. దాని వల్ల ఎల్లవేళలా మీ తలలో దురదగా భావితస్తుంటారు. దీనికి ఒక అద్భుత పరిష్కార మార్గం. ఉసిరి కాయ రసం దాంతో పాటు నిమ్మరసం, ఒక కప్పు పెరుగు మరియు వియోలా. ఈ వస్తువులును అన్నింటిని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల ఎఫెక్టివ్ గా అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది. మీ జుట్టు సమస్యలు నివారించడబడి, మీ కేశాలు మంచి షైనింగ్ తో మెరుస్తూ మేలై పరిష్కారం చూపుతాయి.

10. కెమికల్స్ తో హెయిర్ డ్యామేజ్ అయితే:

10. కెమికల్స్ తో హెయిర్ డ్యామేజ్ అయితే:

హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ కలరింగ్, మరియు ఇతరాల వల్ల మీ కేశాలకు డ్యామే అయ్యుంటే, ఇప్పుడు మీరు తప్పనిసరిగా నేచురల్ హెయిర్ కేర్ తీసుకోవడ చాలా అవసరం. ఈ నేచురల్ హెయిర్ కేర్ చాలా సులభం, చాలా తేలికైన పనికూడా. అందుకు ఒక అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మరియు ఒక గుడ్డు మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసి, హెయిర్ ప్యాక్ గా వేసుకొని 30-45నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కెమికల్స్ వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ కు ఒక అద్బుత పరిష్కారం.

English summary

Home-made hair packs for luscious hair in winter

A good hair care routine is a must during the winter months. Lack of moisture in the air coupled with decreased humidity and pollution makes your hair weak causing split ends and damage.
Desktop Bottom Promotion