For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడాన్నినివారించే హోం రెమెడీస్: నివారణ

|

జుట్టు రాలడం నివారించడానికి కొన్ని వేల హోం రెమెడీలను తలరు అప్లై చేయమని చెబుతుంటారు. కానీ, బోల్డ్ స్కై ఆ వేల హోం రెమెడీస్ లో ఉత్తమమైనవి మంచి ఫలితాలను అంధించేవి ఎంపిక చేసుకొని మీకు అందిస్తోంది . అయితే, జుట్టు నష్టానికి ప్రధాన కారణం సరైన ఆహారనియమాలు పాటించకపోవడం లేదా జుట్టుకు సరైన నిర్వహణ బాధ్యతలు తీసుకోకపోవడం, తలస్నానానికి కఠినమైన నీళ్ళు (బోర్ వెల్ వాటర్). మరో కారణం కూడా ఉంది వాతారణంలో మార్పులు వల్ల కూడా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. మరియు మీరు పనిచేసే వాతావరణం లేదా ప్రదేశం కూడా ఆధారపడి ఉంటుంది. అయితే, మనలో చాలా మందికి అర్ధం కానీ, మనలో జుట్టు రాలడానికి ప్రదాణ కారణం తెలుసుకోకపోవడం, ఆ సమస్యను నివారించడంలో అర్ధచేసుకోకపోవడంలో విఫలం అవుతుంటారు.

అటువంటి వారు, కొంచెం ఎక్కువ శ్రద్ద తీసుకొన్నట్లైతే, లేదా కొన్ని ఉత్తమ హోం రెమెడీలను ఉపయోగించినట్లైతే ఈ జుట్టు రాలే సమస్యనుండి దూరంగా ఉండవచ్చు.

ఈ రోజు, జుట్టు రాలే సమస్యను నివారించడానికి ఇక్కడ కొన్ని ఉత్తమ హోం రెమెడీలను మీతో పంచుకుంటున్నాం. వీటిని ఉపయోగించిన తర్వాత జుట్టు రాలడం మరియు డ్యామేజ్ అవ్వడంలో కొన్ని మార్పులను మీరు గమనించవచ్చు. ఈ సమస్యలను నివారించడంలో ఈ హోం రెమెడీలు అద్భుతంగా సహాయపడుతాయి.

మరి మన ఇంట్లో చాలా సులభంగా అందుబాటులో ఉండే హోం రెమెడీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించి, వాటిని ఉపయోగించి ప్రయోజనం పొందండి...

ఉసిరి:

ఉసిరి:

జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉసిరి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అందువల్లే ఇది ఒక బెస్ట్ హోం రెమెడీగా ఉంది . ఉసిరికాయను ఎండబెట్టి, పౌడర్ లా చేసి, అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చే తలకు బాగా అప్లై చేయాలి. ఎండిన తర్వాత మంచినీటితో తలస్నానం చేయాలి.

లెట్యుస్:

లెట్యుస్:

కొన్ని లెట్యుస్ ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి, ఈ ఆకులను నుండి వచ్చిన రసాన్ని మీ తలకు పట్టించాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. జుట్టు రాలడం నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

హెన్నా:

హెన్నా:

జుట్టురాలడాన్ని అరకట్టె వాటిలో బెస్ట్ హోం రెమెడీ హెన్నా. హెన్నా తలకు అప్లై చేయడం వల్ల కేశాలకు మరియు కేశ కణాలకు బలాన్ని చేకూర్చతుంది. మీ కేశాలకు నెలకొకసారి హెన్నా అప్లై చేయడం చాలా మంచిది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది . మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లైతే, ఉల్లిపాయను కట్ చేసి, ఆముక్కలతో తల మీద రుద్దుకోవాలి. రుద్దిన 10నిముషాల తర్వాత, మీ జుట్టును మంచినీటితో వాష్ చేసుకోవాలి.

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు మీ కేశాలను బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. కొబ్బరి పాలు ఒక పాతకాలపు వంటింటి చిట్కా . పచ్చి కొబ్బరి పాలను మీ తలకు మరియు మీ జుట్టుకు కూడా అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పాలు:

పాలు:

డైరిప్రొడక్ట్స్ లో ఒకటైన పాలు మీ జుట్టు మూలలకు బలాన్ని చేకూర్చడానికి సహాయపడతుంది. ఫ్రెష్ గా ఉన్నపాలను తీసుకొని, తలకు బాగా పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.ఒక నెల తర్వాత తిరిగి ఇలా చేసి, డిఫరెన్స్ ను గమనించండి.

మస్టర్డ్ ఆయిల్:

మస్టర్డ్ ఆయిల్:

జుట్టు రాలే సమస్య అధికంగా ఉన్నవారికి మస్టర్డ్ ఆయిల్ చాలా ఉపయోగకరం. జుట్టురాలే సమస్యను అరికట్టడంలో మస్టర్డ్ ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

కాఫీ:

కాఫీ:

జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు, బ్లాక్ కాఫీని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బ్లాక్ కాఫీని తలారా పోసుకొని 10నిముసాలు అలాగే ఉండి తర్వాత తలస్నానం చేసుకోవాలి. తర్వతా తిరిగి రెండు వారాల తర్వాత ఇలా చేయాలి.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులోని పచ్చసొన తెగిపోయే జుట్టు సమస్యకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. జుట్టు మద్యలో డ్యామేజ్ అవ్వడాన్ని మరియు జుట్టు రాలడాన్ని అరకట్టడంలో అద్భుతంగా సమాయపడుతుంది.

బాదం:

బాదం:

పొడిచేసిన బాదంను పాలలో మిక్స్ చేసి తలకు హెయిర్ ప్యాక్ పట్టించాలి. లేదా బాదం ఆయిల్ ను తలకు అప్లై చేయాలి . జుట్టురాలడాన్ని అరకట్టడంలో ఈ రెండు చాలా అద్భుతంగా సహాయపడుతాయి.

English summary

Home Remedies For Hair Loss: Prevention

There are more than a million home remedies one would tell you to apply to your hair when it comes to preventing hair loss.
Story first published: Monday, December 16, 2013, 15:59 [IST]
Desktop Bottom Promotion