For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు పోషణ అందిచే హోంమేడ్ ఇండియన్ షాంపులు

|

మనకు ఇష్టమైన అందమైన, ఆరోగ్యకరమైన కురులు వుండటం అంత సులభం కాదు, కానీ అలా ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది . మనలో చాలా మంది మన కురలు మంచి షైనింత్ తో ఉండాలని, ఒక ఖచ్చితమైన జుట్టు సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటారు. అటువంటి జుట్టును పొందాలంటే, హెయిర్ డ్యామేజ్ చేసే రసాయన ఉత్పత్తులను మరియు వేడి, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడే మీరు అందుమైన జుట్టును పొందగలుగుతారు.

కఠిమైన హెయిర్ ప్రొడట్స్ నుండి జుట్టును సంరక్షించుకోవాలంటే, మీరు ఎల్లప్పుడూ రసాయనిక హెయిర్ ప్రొడక్ట్స్ ప్రత్యామ్నాయంగా హోం మేడ్ షాంపూలను ఉపయోగించవచ్చు. ఇవి జుట్టు సంరక్షణకు మరియు జుట్టు ఆరోగ్యంగా పెరుగుదలకు ఈ ఇండియన్ హోం మేడ్ షాంపులు బాగా సహాయపడుతాయి. వీటిని మనం ఇట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి, వీటిలో ఎటువంటి రసాలయనాలు లేకుండా ఉంటాయి. ఈ నేచురల్ ఇండియన్ మోం మేడ్ షాంపులు మీ కురలకు ఎటువంటి హాని కలిగించదు. కరులను బలహీన పరచవు, కఠినంగా పొడిగా మార్చవు, మరియు నిర్జీవంగా మార్చవు.

మనలో చాలా మంది రెగ్యులర్ గా తలస్నానం చేస్తూ, కఠినమైన రసాయ షాంపూలను ఉపయోగించే అలవాటు ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి దారితీయవచ్చు. కాబట్టి, మీ జుట్టులో చైతన్యం నింపడానికి, మీ జుట్టుకు మంచి షైనింగ్ ను తిరిగి పొందడానికి, కొన్ని హోం మేడ్ ఇండియన్ షాంపులను ట్రై చేయండి. ఈ హోం మేడ్ ఇండియన్ షాంపులను మీరు ఇంట్లోని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ట్రై చేసి చూడండి..

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

బేకింగ్ సోడా: ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసికొని నీళ్ళలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, బాగా షేక్ చేసి, తర్వాత తడి జుట్టుకు పట్టించాలి. ఈ నేచురల్ షాంపుకు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా, తలలోని చుండ్రు వదలగొడుతుంది.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఆరెంజ్-ఎగ్ షాంపు: మీ కేశాలు కురచగా లేదా పొడవుగా ఉన్నాసరే, ఈ షాంపు మీ కేశాలను సాఫ్ట్ గా చేస్తుంది. ఒక బౌల్లో ఒక గుడ్డుసొన మరియు ఆరెంజ్ జ్యూస్ ను తీసుకొని బాగా గిలకొట్టాలి. ఈ రెండింటి మిశ్రమం స్మూత్ గా తయారయ్యే వరకూ, బాగా మిక్స్ చేసి, తర్వాత ఈ షాంపును మీతలకు పట్టించి, పది నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

గుడ్డు షాంపు: సాఫ్ట్ గా, షైనింగ్ తో , మరీ మెత్తని కురులకోసం గుడ్డును సాధారణంగా ఉపయోగిస్తుంటారు. మీ జుట్టు మందం, పొడవును బట్టి 2-3గుడ్లు తీసుకోవాలి. ఈ గుడ్లలోని లిక్విడ్ ను గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత గిలకొట్టిన గుడ్డులిక్విడ్ ను తలకు పట్టించి అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

తేనె-నిమ్మరసంతో షాంపు: ఈ హోం మేడ్ ఇండియన్ షాంపును జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడటంతో పాటు, చుండ్రులేని జుట్టును పొందవచ్చు. 3టేబుల్ స్పూన్ల నిమ్మరసం, మరియు తేనె మిక్స్ చేయాలి. మరో బౌల్లో రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. ఈగుడ్డు లిక్విడ్ ను నిమ్మరసం, తేనె మిశ్రమంలో వేసి బాగా గిలకొట్టాలి. చివరగా మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

రీటా లేదా శీకాకాయ్ షాంపు: రీటా లేదా శీకాయ షాంపు కురులకు మంచి పోషణను అంధిస్తుంది. అందుకు 100grmఉసిరికాయ, 100grms రీటా మరియు 75గ్రాములు శీకాయ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు తగినన్ని నీళ్ళు కలిపి రాత్రంత నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం, శీకాయ లిక్విడ్ ను తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

గసగసాలు మరియు శీకాయ: శీకాయ, కందిపప్పు, పెసరపప్పు, గసగసాలను ప్రతి ఒక్కటీ 250grms తీసుకొని, అందులోనే మెంతులు మరియు హార్స్ గ్రామ్స్ ను కూడా మిక్స్ చేసి ఈ పద్దార్థలన్నింటి ఒక్క మిశ్రమంగా చేసి, మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్ తో తలస్నానం చేయవచ్చే. ఈ పౌడర్ ను కొద్దిగా నీళ్ళలో కలుపుకొని, తలకు పట్టించి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

అవొకాడో షాంపు: అవొకాడోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి అందులోనే బేకింగ్ సోడా, నీళ్ళు కూడా వేసి, మెత్తగా అయ్యే వరకూ బ్లెడ్ చేయాలి. ఈ హోం మేడ్ ఇండియన్ షాంపును మీ కేశాలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా కేశాలను రక్షించుకోవచ్చు.

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం!

నిమ్మ మరియు ఉసిరికాయ షాంపు: ఒక మిక్సింగ్ బౌల్లోనికి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు 50గ్రాములు ఉసిరికాయ పొడి తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.

ఈ హోం మేడ్ ఇండియన్ షాంపులను తయారు చేయడానికి అంత ఎక్కువ సమయం ఏం పట్టదు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి మీ జుట్టులోని వ్యత్యాసాన్ని గుర్తించండి.

English summary

Homemade Indian Shampoos For You

Having a lovely healthy hair is not very simple but every women dreams of it. Most of us wish to have shining hair but making it an actuality requires a strict hair care regime.
Desktop Bottom Promotion