For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టును నల్లగా.. ఒత్తుగా.. పొడవుగా మార్చే నూనెలు-మూలికలు

|

ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్‌ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. నల్లని ఒత్తైన జుట్టు ఆడవారికి మరింతగా అందాన్ని చేకూరుస్తాయి. అందుకే తమ అందానికి ప్రతిరూపమైన నల్లని నిగనిగలాడే జుట్టుకోసం ఆశపడని స్త్రీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాని కొందరికి వెంట్రుకలు రాగి రంగులో నిర్జీవంగా ఉంటాయి. అలాంటి వారు నల్లని జుట్టు పొందడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందమైన, నల్లని కురుల సంపద కోసం ఆడవారి తాపత్రయం చాలా ఉంటుంది. ఎవరికైనా ఒతైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే జుట్టు పట్ల సరైన జాగ్రత్తలు, సంరక్షణ కలిగి వుంటే కురులను కాపాడుకోవచ్చు.

అందుకు కొన్ని హోం రెమడీస్ బాగా పనిచేస్తాయి. ఈ హోం రెమడీస్ ను ఫాలో అవ్వడం వల్ల తిరిగి మీ అందమైన నల్లటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ మీ కేశాలను నల్లగా మార్చడమే కాకుండా కేశాలను బాగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ హోం రెమడీస్ లో కొన్ని సహజనూనెలు కూడా ఉన్నాయి. ఈ నూనెలు మీ కేశాలను సహజంగానే నల్లగా మార్చుతాయి. ఇంకా కేశాలను నల్లగా మార్చడానికి హేర్బ్ కూడా ఉన్నాయి. మీ కేశాలు ఎరుపు రంగులోనికి మారుతున్న కూడా ఈ హోం రెమడీస్ తిరిగా నల్లగా మార్చుతాయి. అందుకే మీరూ నల్లని కురులను సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సలహాలు పాటించి చూడండి. నల్లగా నిగనిగలాడే అందమైన కురులు మీ సొంతమౌతాయి.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

హాట్ ఆయిల్ మసాజ్: కేశాలకు కొన్ని నెలలుగా నూనెను పెట్టుకోకపోయినా కూడా బ్లాక్ రెడ్ హెయిర్ సమస్య మీకు ఏర్పడుతుంది. అంటే మీ కేశాలకు పోషణా అవసరం అని తెలుసుకోవాలి. కాబట్టి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ కేశాలు తిరిగి నలుపు రంగులోనికి మారుతాయి.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

కరివేపాకు: జుట్టును నల్లగా మార్చడంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే మూలిక కరివేపాకు. తాజా కరివేపాకు ఆకలును వేడి నూనెలో వేసి కొద్దిగా వేడి చేయాలి. ఈ నూనెను బాగా చల్లరనివ్వాలి. ఒక వారం తర్వాత ఈ నూనెను తలకు మసాజ్ చేసుకోవడం వల్ల మీ కేశాలు నల్లగా మారుతాయి.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

మందార నూనె: హెయిర్ పిగ్మెంటేషన్ కు హైబిస్కస్ ఆయిల్(మందార నూనె) చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హైబిస్కస్ ఆయిల్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంది. లేదా మందారం పువ్వు మొగ్గలను రెగ్యులర్ గా మీరు తలకు ఉపయోగించే నూనెలో వేసి వేడి చేసి చల్లరనిచ్చి తర్వాత లకు పెట్టుకుంటుండాలి.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

ఆమ్లా ఆయిల్: ఉసిరికాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు కేశాలకు కూడా బహువిధాలుగా సహాపడుతుంది. కాబట్టి మీ కేశాలకు నూనెతో మసాజ్ చేసుకొన్న తర్వాత ఆమ్లా ఎసెన్స్ లేదా ఉసిరి కాయ రసాన్ని తలకు పట్టించాలి. ఉసిరి కాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఇటు కేశాలకు చాలా మేలు చేకూరుతుంది.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

సన్ డ్యామేజ్: ఎండలో ఎక్కువగా ఉండటం లేదా ఎక్కువగా తిరగడం వల్ల కూడా జుట్టు యొక్క రంగు మారిపోతుంది. సూర్యరశ్మిలోని యూవీ కిరణాలు చర్మానికి మాత్రమే కాదు కేశాలకు కూడా హాని కలిగించి జుట్టు రంగును మార్చడంతో పాటు జుట్టును డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి తలకు డైరెక్ట్ సన్ లైట్ (సూర్యకిరణాలు)తగలకుండా కాపాడుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్ళకూడదు. వెళ్ళినా తలకు క్యాప్ లేదా క్లాత్ వంటిది పెట్టుకోవాలి.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

అశ్వగంధతో జుట్టు సంరక్షన: అశ్వగంధం పురాతకాలం నుండి ఉపయోగిస్తున్నా ఓ ఔషధ మూలిక. ఇది హిమాళయాల్లో పెరుగుతుంది. ఈ మూలికను జుట్టు సంరక్షణకు ఉపయోగించే అనేక ఔషదాల్లో ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ అశ్వగంధం మూలిక యొక్క పౌడర్ ను నూనెతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల మీ కేశాలు ఒత్తుగా, నల్లగా పొడవుగా పెరుగుతాయి.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

నువ్వుల నూనె: నువ్వుల నూనె జుట్టు ముదురు వర్ణం పొందడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి నువ్వులను నూనెను తలకు మసాజ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు నువ్వులను తినడం కూడా ఇటు ఆరోగ్యానికి అటు కేశ సంరక్షణకు చాలా మంచిది.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

క్యారెట్ జ్యూస్: కేశాల రంగును స్థిరంగా ఉంచడానికి మరియు ముదు వర్ణంలోనికి తీసుకు రావడానికి క్యారెట్ లోని కెరోటినాయిడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అయితే క్యారెట్ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి జ్యూస్ కు బదులు క్యారెట్స్ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

నిమ్మరసం: నిమ్మరసం కేశాలకు బహు ప్రయోజనాలు కలిగిస్తాయి. నిమ్మరసం కేశాలకు పట్టించడం వల్ల మీకేశాలు నల్లగా మారడంతో పాటు, తలలో చుండ్రును సులభంగా వదలగొడుతుంది. ఇంకా నేచురల్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది.

జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

తలస్నానానికి రీటాను ఉపయోగించండి: కఠినమైన రసాయనిక షాంపూలు జుట్టును రంగును మార్చడంతో పాటు, జుట్టును డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ షాంపులకు బదులుగా నేచురల్ వస్తువులు (శీకాకాయ, కుంకుడుకాయ)వంటివి ఉపయోగించడం చాలా మంచిది.

English summary

How To Get Black Hair Naturally? | జుట్టును నల్లగా-ఒత్తుగా-పొడవుగా మార్చే సులభ పద్ధతులు

People with lighter hair colours actually want to darken their hair. Partial brown hair is a sign of discoloration. If your hair is naturally black and suddenly lightens, then it means that your hair is undernourished by oil or it is sun damage. But don't worry. In the collective wisdom of ages, there are many home remedies to get black hair. You can easily darken your hair to make it lustrous black again.
Story first published: Saturday, April 13, 2013, 15:26 [IST]
Desktop Bottom Promotion