For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

|

చుండ్రు ఫంగస్ వలన సంభవించే ఒక చిరాకైన సమస్య. పొడి జుట్టు తరచుగా నెత్తిపై దురదలు, చుండ్రుని కలిగిస్తుంది. మృతచర్మ కణాలు నెత్తిమీద మందపాటి తెల్లని పొలుసులుగా ఏర్పడి, క్రమ పద్ధతి లేకుండా పోగవుతాయి. దురదగా, పొడిగా, పొలుసులుగా ఉండే మృత చర్మం చూడటానికి వికారంగా చికాకును కల్గిస్తుంది. ఈ చర్మ వ్యాధి కొన్ని సార్లు చాల అసౌకర్యంగా, నొప్పిగా కూడా ఉంటుంది. ఒక వేళ మీరు ఈ చిరాకును కలింగించే సమస్యతో బాధపడుతుంటే, దీనిని అదుపు చేయడానికి లేదా పోగొట్టడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మీరు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించి దీనిని అదుపు చేయవచ్చు లేదా ఇంటిలో ఉండే సహజమైన పదార్ధాలను వాడి చుండ్రును అరికట్టవచ్చు.

చుండ్రును సహజంగా తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

హాట్ ఆయిల్ మసాజ్: మీ తలను ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మర్దన చేయండి. మీ జుట్టును తాజాగా, మెరిసేలా చేయడంతో బాటు ఈ నూనెను తగినంతగా వాడటం వలన తలకు పోషణ అందటమే కాక ఎక్కువగా మర్దన చేయడం వలన రక్త ప్రసరణ ఉత్తమంగా ఉండి పొడి మృతచర్మాన్ని తొలగిస్తుంది.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

గొడుగు/క్యాప్: ఎండలో ఎక్కువగా తిరగడం వలన జుట్టు పొడిబారిపోయి చుండ్రు ఏర్పడుతుంది. మీ జుట్టుకు శుభ్రతతో కూడిన పోషణ కలిగించి చుండ్రును అరికట్టవచ్చు. భయటకు వెళ్ళేటప్పడు గొడుగు లేదా హ్యాట్, క్యాప్ వంటివి ధరించడం మంచిది.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

తేనె- పెరుగు: కొన్ని చుక్కల నిమ్మరసం, తేనే, పెరుగును కలపండి. దీనిని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్ది సేపు వదిలేయండి. తర్వాత తొలగించి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

నిమ్మరసం: నిమ్మ రసాన్ని తలపై మర్దన చేయడం వలన కూడా మీరు చాల తేలికగా చుండ్రును పోగొట్టుకోగలరు. నిమ్మరసంతో తడిపిన మీ తలను, జుట్టును 30 నిమిషాల పాటు వదిలివేయండి, తర్వాత నీటితో కడగండి. రెండు మూడు సార్లు కడిగిన తర్వాత తేడాను మీరే గమనించగలరు. ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని నీటితో కలిపి మీ జుట్టును దీనితో కడగండి. ఇది చుండ్రును తొలగిస్తుంది లేదా మీ తలపై రాకుండా చేస్తుంది. ఈ పద్ధతి మీ జుట్టును మెరిపిస్తుంది కూడా.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

గుడ్డు: తలస్నానం చేసిన తర్వాత కోడిగుడ్డును జుట్టుకు పట్టించండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది కూడా చుండ్రును తగ్గిస్తుంది.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

బేబీ ఆయిల్: బేబీ నూనెను మీ తలకు పట్టించి, తలకు, జుట్టుకు బాగా పట్టేటట్టు చూడండి. ఉదయం గోరువెచ్చటి నీరు, తేలికపాటి షాంపూతో కడగండి. దీనిని క్రమపద్దతిలో చేయండి, మీ చుండ్రు పారిపోతుంది.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

కూంబింగ్: క్రమంగా తలదువ్వడం వలన చుండ్రు పొలుసులు పోయి రక్త ప్రసరణ మెరుగౌతుంది. మీ జుట్టు దువ్వడానికి ముందు మరింత మెరుగైన రక్తప్రసరణ కోసం వెలి కొసలతో మర్దన చేయండి. దీని వలన కూడా చుండ్రును నివారించవచ్చు.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

ఆపిల్ సైడర్ వెనిగర్: సెడార్ వేనిగార్ ను నీటితో కలిపి దూదితో మీ తలకు పట్టించండి. ఈ పద్ధతి కూడా మీ జుట్టునుండి చుండ్రును పోగొడుతుంది.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

కొబ్బరినూనె: కొబ్బరి నూనెను మీ తలపై మీ వేలికొసలతో మర్దన చేయండి. తర్వాత 15 నిముషాల పాటు గోరువెచ్చని నీటితో కడగండి. ఇది ఖచ్చితంగా మీ తల నుండి చుండ్రును తొలగిస్తుంది.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి: పళ్ళు, పచ్చి కూరగాయలు చికాకు పుట్టించే సమస్యను చాలా రోజుల వరకు అదుపులో ఉంచుతాయి.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

ఒత్తిడి: ఉద్రేకం, ఒత్తిడి తరుచు చుండ్రును కలిగించవచ్చు. అందువల్ల చుండ్రును తప్పించుకోవడానికి చాలావరకు ప్రశాంతంగా ఉండండి. తగినంతగా నిద్రపోండి, మీరు మరింత ఎక్కువగా ఉద్రేకం, ఒత్తిడి కలిగించే విషయాల్లో కల్గచేసుకోకండి.

జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

పెరుగు: పెరుగును వివిధ రకాల కురలు సమస్యలకు(చుండ్రు, చివరులు చిట్లడం, దురద, పొడిబారడం) ఉపయోగించి ఉంటారు. అంతే కాదు ఈ పెరుగుతో నేచురల్ గా కురులు సున్నితంగా తయారవుతాయి.

పైన చెప్పిన నివారణోపాయాలన్ని చుండ్రు సమస్యను అరికట్టి, మిమ్మల్ని చికాకు పుట్టించే పరిస్థితుల నుండి కాపాడతాయి. ప్రభావవంతమైన ఫలితాల కోసం మీరు ఈ పద్ధతులను కనీసం నెలకొకసారి ఉపయోగించాలి. అయితే అందరి విషయంలోనూ నియమాలు ఒకే రకంగా ఉండవు, అందువలన రెండు, మూడు రకాల పద్దతులను ఉపయోగించి ఏది మీకు ఉత్తమంగా ఉంటుందో తెల్సుకోవాలి.

English summary

How to keep your Hair Dandruff – Free | జుట్టును చుండ్రు లేకుండా ఉంచుకోవడం ఎలా?

Dandruff is an irritating problem which is caused by a fungal infection. Dry hair often results in itchy scalp that inversely causes dandruff. Dead skin cells accumulate to form thick white scales on the scalp and shed randomly.
Story first published: Saturday, March 23, 2013, 15:08 [IST]
Desktop Bottom Promotion